Telangana

News June 9, 2024

తీర్యాని: ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య

image

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలం స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయం దగ్గర కాలువ సమీపంలో కూన చిన్న‌ పోషయ్య అనే వ్యక్తి ఉరేసుకుని మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సంఘటన విషయాన్ని పోలీసులకు చేరవేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 9, 2024

ATA ఉత్సవాల్లో పాలమూరు ఎమ్మెల్యేలు

image

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ఉత్సవాలలో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రవాస భారతీయులు తెలంగాణలో పెట్టుబడి పెట్టి, తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

News June 9, 2024

SRD: జాతీయ పురస్కారం అందుకున్న టీచర్ రామకృష్ణ

image

సదాశివపేట మండలానికి చెందిన నిజాంపూర్( కె) పాఠశాల ఉపాద్యాయులు డా. రామకృష్ణ (విద్యా సామాజిక చైతన్యం కృషి) జాతీయ బంగారు కామధేనువు పురస్కారం అందుకున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రభుత్వ సాంసృతిక శాఖ సౌజన్యంతో GCS వల్లూరి ఫౌండేషన్ గ్రూప్ జాతీయ బంగారు అవార్డుల ప్రదానోత్సవ రవీంద్రభారతిలో జరిగింది. BC కార్పొరేషన్ ఛైర్మన్ వాకుళాబరణం కృష్ణ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై పురస్కారం అందజేశారు.

News June 9, 2024

మెదక్: అదృశ్యమైన మహిళ.. అడవిలో మృతదేహం

image

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామానికి చెందిన బాగమ్మ(55) అనే వృద్ధురాలు గత నెల 1న అడవిలో వంట చెరుకు తేవడానికి వెళ్లి అదృశ్యమైంది. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం అడవి ప్రాంతంలో మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అది బాగమ్మ మృతదేహంగా గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టారు.

News June 9, 2024

MBNR: గొడుగు చేసిన ఘోరం.. పంచాయతీ సెక్రటరి మృతి

image

బొంరాస్‌పేట మండలానికి చెందిన <<13410192>>గ్రూపు-1 అభ్యర్థి<<>> సుమిత్రాబాయి(29) రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. వికారాబాద్‌లో పరీక్ష రాసి వస్తుండగా వర్షంతో పాటు గాలి వీసింది. దీంతో బైక్ పై వెనుక ఉన్న సుమిత్ర తన వద్ద ఉన్న గొడుగు తీసే ప్రయత్నంలో ధారూర్ మం. గట్టెపల్లి వద్ద కిందపడింది. దీంతో సుమిత్ర తలకు తీవ్ర గాయాలు కావడంతో తాండూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని బంధువులు తెలిపారు.

News June 9, 2024

ఆదివారం: హైదరాబాద్‌ మెట్రో ఖాళీ!

image

HYDలోని పలు మెట్రో‌ స్టేషన్లు ఆదివారం సాయంత్రం ఖాళీగా దర్శనమిచ్చాయి. ట్రైన్‌లో సౌకర్యవంతంగా ప్రయాణం చేసినట్లు ఓ నెటిజన్‌ పేర్కొన్నారు. ఇండియా VS పాక్ T20WC, PM ప్రమాణ స్వీకారం, ఆదివారం‌ సెలవు కావడంతో‌ ఉద్యోగస్థులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఖాళీగా ఉన్న ఓ మెట్రో స్టేషన్‌ ఫొటో‌ను ఆ నెటిజన్‌ ‘X’లో షేర్ చేశారు. కాగా, సాధారణ రోజుల్లో‌ HYD మెట్రో‌లో రద్దీ అందరికీ తెలిసిందే. PIC CRD: @PrathyushaCFA18

News June 9, 2024

ఆదివారం: హైదరాబాద్‌ మెట్రో ఖాళీ!

image

HYDలోని పలు మెట్రో‌ స్టేషన్లు ఆదివారం సాయంత్రం ఖాళీగా దర్శనమిచ్చాయి. ట్రైన్‌లో సౌకర్యవంతంగా ప్రయాణం చేసినట్లు ఓ నెటిజన్‌ పేర్కొన్నారు. ఇండియా VS పాక్ T20WC, PM ప్రమాణ స్వీకారం, ఆదివారం‌ సెలవు కావడంతో‌ ఉద్యోగస్థులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఖాళీగా ఉన్న ఓ మెట్రో స్టేషన్‌ ఫొటో‌ను ఆ నెటిజన్‌ ‘X’లో షేర్ చేశారు. కాగా, సాధారణ రోజుల్లో‌ HYD మెట్రో‌లో రద్దీ అందరికీ తెలిసిందే.
PIC CRD: @PrathyushaCFA18

News June 9, 2024

అస్సాం సీఎంను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు

image

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ను ఆదివారం ఢిల్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం పూల మొక్క అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రామారావ్ పటేల్, పాల్వాయి హరీశ్ బాబు, దన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ నాయకులు తదితరులున్నారు.

News June 9, 2024

NZB: ‘గోవులను అక్రమంగా తరలిస్తే చర్యలు’

image

మూగజీవాలను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాగిరెడ్డిపేట మండల ఎస్సై రాజు తెలిపారు. బక్రీద్ సందర్భంగా గోవులను తరలించడానికి పశువైద్యాధికారి ధ్రువీకరణపత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు. మూగజీవాలను తరలిస్తున్నట్లు తెలిస్తే వారికి సమాచారం ఇవ్వాలని, వాహనాలను అడ్డుకొని గొడవలు చేయడం సరికాదన్నారు. పశువుల రవాణాకు చెక్‌ పోస్ట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బక్రీద్‌‌ను శాంతియుతంగా చేసుకోవాలని సూచించారు.

News June 9, 2024

ADB: కోర్టు ఆవరణలో చోరీకి యత్నం.. కేసు నమోదు

image

ఆదిలాబాద్ జిల్లా కోర్డు ఆవరణలో ఇద్దరు చోరీకి యత్నించారు. టూ టౌన్ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఇద్దరు వ్యక్తులు కోర్టు ఆవరణలోని నీటి విద్యుత్ మోటార్, 2 పైపులను చోరీ చేసి, రిక్షాలో తీసుకెళ్తుండగా గమనించిన కోర్టు అటెండర్ శ్రీనివాస్ వారిని మందలించడంతో వారిద్దరూ రిక్షాను వదిలి పారిపోయారు. అటెండర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.