Telangana

News June 9, 2024

RR: రోడ్డు ప్రమాదంలో గ్రూప్-1 అభ్యర్థి మృతి

image

గ్రూప్-1 పరీక్ష రాసి తిరిగి వెళ్తున్న అభ్యర్థి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషాద ఘటన ధరూర్ మండలం దోర్నాల దగ్గర జరిగింది. స్థానికుల సమాచారం.. బొంరాస్‌పేట మండల BRS సోషల్ మీడియా అధ్యక్షుడు నెహ్రూ నాయక్ భార్య సుమిత్ర యాలాల మండలం అచ్యుతాపూర్ కార్యదర్శి. వికారాబాద్‌లో గ్రూప్-1 పరీక్ష రాసి వస్తుండగా దోర్నాల వద్ద ప్రమాదం జరిగింది. సుమిత్ర స్వగ్రామం దేవుల నాయక్ తండాలో విషాదం నెలకొంది.

News June 9, 2024

సంగారెడ్డి: ఫెడరేషన్ బార్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా విష్ణువర్ధన్ రెడ్డి

image

ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా సంగారెడ్డికి చెందిన న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన మాట్లాడుతూ.. తనలో రెండోసారి ఈ పదవికి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

News June 9, 2024

BREAKING ములుగు: ఐఈడీ మందు పాతరలు నిర్వీర్యం

image

ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరభద్రవరం గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన 4 ఐఈడీ మందు పాతరలను బీడీ బృందాలు గుర్తించినట్లు ఎస్పీ శబరిశ్ తెలిపారు. వాటిని చాకచక్యంగా నిర్వీర్యం చేశామన్నారు. మావోయిస్టులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మందు పాతరలను అమర్చి, అమాయకుల ప్రాణాలను తీస్తున్నారన్నారు. వీటిలో ఇప్పటికే 3 పేలిపోగా.. ఒక మందు పాతరను నిర్వీర్యం చేసినట్లు పేర్కొన్నారు.

News June 9, 2024

బొంరాస్‌పేట: రోడ్డు ప్రమాదంలో గ్రూప్-1 అభ్యర్థి మృతి

image

గ్రూప్-1 పరీక్ష రాసి తిరిగి వెళ్తున్న అభ్యర్థి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషాద ఘటన ధరూర్ మండలం దోర్నాల దగ్గర జరిగింది. స్థానికుల సమాచారం.. బొంరాస్‌పేట మండల BRS సోషల్ మీడియా అధ్యక్షుడు నెహ్రూ నాయక్ భార్య సుమిత్ర యాలాల మండలం అచ్యుతాపూర్ కార్యదర్శి. వికారాబాద్‌లో గ్రూప్-1 పరీక్ష రాసి వస్తుండగా దోర్నాల వద్ద ప్రమాదం జరిగింది. సుమిత్ర స్వగ్రామం దేవుల నాయక్ తండాలో విషాదం నెలకొంది.

News June 9, 2024

వరంగల్: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు 72.8% హాజరు

image

హంటర్ రోడ్‌లోని గ్రీన్ వుడ్ పాఠశాల, బిర్లా ఓపెన్ మైండ్ పాఠశాల పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ తీరును, పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను ప‌రిశీలించి.. పరీక్ష సజావుగా జరిగినట్లు తెలిపారు. జిల్లాలో ఈ పరీక్షకు 9902 మంది అభ్యర్థులకు గాను 6622 మంది 72.8 శాతంతో హాజరయ్యారు.

News June 9, 2024

గత వైభవాన్ని మళ్లీ తెస్తాను: మాజీ ఎమ్మెల్యే

image

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో గత వైభవాన్ని తిరిగి తెస్తానని మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, కార్యకర్తలు పార్టీకి వెన్నంటి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మళ్లీ మంచి రోజులు వస్తాయని గత వైభవాన్ని తిరిగి తెస్తానని రాజయ్య అన్నారు. 

News June 9, 2024

MBNR: నైరాశ్యంలో డీకే అరుణ అనుచరులు

image

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి విజయం సాధించిన డీకే అరుణకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆమె అనుచరులు ఎంతగానో ఆశించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆమెకు ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో అనుచరులు నైరాశ్యంలో పడ్డారు. మహిళా కోటలో తప్పనిసరి మంత్రి పదవి వస్తుందని ఊహించారు. తెలంగాణ నుంచి ఇద్దరికీ మాత్రమే మంత్రి పదవి లభించింది.

News June 9, 2024

NLG: ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి

image

నారాయణపూర్ మండలం వాయిల్లపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపై రాళ్లు విసిరారు. రాళ్లు వేయడంతో అద్దాలు ధ్వంసమై బస్సు లోపల పడ్డాయి. బస్సు చౌటుప్పల్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉండగా, కొన్ని చోట్ల ఆపకపోవడంతో రాళ్లతో దాడి చేసినట్లుగా ప్రయాణికులు భావిస్తున్నారు. కాగా బస్సును నారాయణపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News June 9, 2024

ఆదిలాబాద్ : KU పరిధిలో పరీక్షలు వాయిదా

image

KU పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి బీఎస్ఎల్ సౌజన్య తెలిపారు. ఈనెల 11 నుంచి ఈపరీక్షలు జరగాల్సి ఉండగా.. వివిధ పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సెమిస్టర్ పరీక్షల్ని వాయిదా వేసినట్లు తెలిపారు. 

News June 9, 2024

జోగిపేట శివారులో మొసలి కళేబరం

image

జోగిపేట శివారులో మృతి చెందిన మొసలిని స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పట్టణంలోని రాజరాజేశ్వరి ఆలయం ససమీపంలోని అటవీ ప్రాంత కాలువల్లో నుంచి వచ్చిన మొసలి అక్కడే మృతి చెందింది. రెండు, మూడు రోజుల క్రితమే ఇది చనిపోయి ఉండొచ్చని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.