Telangana

News June 9, 2024

image
News June 9, 2024

HYD: రేపు రాష్ట్ర సదస్సుకు హాజరుకానున్న మంత్రి సీతక్క

image

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని సంఘం నేత అంకగళ్ల కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు HYDలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న సదస్సుకు రాష్ట్ర మంత్రి సీతక్క, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకుడు వెంకట్, రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య, ఎంపీ శివదాసన్, తదితరులు హాజరవుతారని తెలిపారు. వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.

ఈనెల 14న కామారెడ్డిలో ఉద్యోగ మేళా

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థుల కోసం ఈ నెల 14న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈవో షేక్ సలాం ఓ ప్రకటనలో తెలిపారు. టెక్ బి ప్రోగ్రాం కోసం సీఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ గ్రూప్‌లలో ఇంటర్ పూర్తి చేసుకున్నవారు మేళాకు రావాలన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రం, ఇంటర్ మార్కుల ఆన్ లైన్ జాబితా, ఆధార్ కార్డుతో మేళాకు హాజరుకావాలని సూచించారు.

News June 9, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు ఇలా

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 36.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో 36.1 మి.మీ, గద్వాల జిల్లా కల్లూరు తిమోన్ దొడ్డి 36.0 మి.మీ, నారాయణపేట జిల్లా ధన్వాడలో 35.5 మి.మీ, వనపర్తి జిల్లా అమరచింతలో 34.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 9, 2024

మిషన్ భగీరథ నీరు వస్తోందా.. ?!

image

ఖమ్మం జిల్లాలో దాదాపు 3 లక్షల ఇళ్లకు.. భద్రాద్రి జిల్లాలో కూడా దాదాపు అదేసంఖ్యలో ఇళ్లకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కానీ ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో చాలా ఇళ్లకు నీరు అందడం లేదని, పైపులైన్లు పగిలిపోయి, వాల్వ్ ల వద్ద లీకేజీలతో నీరు వృథా అవుతోందనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యాన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటిని సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News June 9, 2024

హనుమకొండ: పీజీ 4వ సెమిస్టర్ పరీక్ష వాయిదా

image

కేయూ పీజీ కోర్సుల MA, ఎంకామ్, MSC కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి బీఎస్ఎల్ సౌజన్య తెలిపారు. ఈనెల 11 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా, పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సెమిస్టర్ పరీక్షల్ని వాయిదా వేసినట్లు తెలిపారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

News June 9, 2024

ADB: స్తంభం పైనే మృతి చెందిన ఎలక్ట్రిషన్

image

విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతు పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో ఓ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ దుర్మరణం చెందిన ఘటన ఆదిలాబాద్ రూరల్ మండలంలో చోటుచేసుకుంది. యాపల్ గూడకు చెందిన మోతిరామ్ విద్యుత్ పనులు చేస్తుంటాడు. అయితే ఆదివారం విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో ఆయన స్తంభం పైనే మృతి చెందాడు. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది.

News June 9, 2024

FLASH: HYD: భారీ ట్రాఫిక్ జామ్.. గ్రూప్-1 అభ్యర్థుల పరుగులు

image

HYD రామోజీ ఫిలింసిటీ సమీపంలోని అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్ కాలేజీలో ఈరోజు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పరుగులు తీస్తూ కేంద్రానికి చేరుకోవాల్సి వచ్చిందని వాపోయారు. కాగా ఫిలింసిటీ వద్ద రామోజీరావు అంత్యక్రియలు జరుగుతున్న విషయం తెలిసిందే.