Telangana

News June 9, 2024

NGRL: యువజంట సూసైడ్

image

నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బల్మూర్ మండలంలోని జినుకుంట శివారులో ఈ తెల్లవారుజామున యువజంట బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మహేష్ ఇటీవల అదే గ్రామానికి చెందిన భానుమతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడాది తిరగక ముందే కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు కాని శనివారం రాత్రి వారి వ్యవసాయ పొలంలో ఉన్న చెట్టుకు ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

News June 9, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో బదిలీలకు రంగం సిద్ధం

image

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతుంది. జిల్లాస్థాయి నుంచి మండలస్థాయి వరకు అధికారులు బదిలీ కానున్నారు. ఏండ్ల తరబడి ఒకే దగ్గర పని చేసిన అధికారులకు స్థాన చలనం తప్పకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో జిల్లాల్లో మంచి పోస్టింగ్‌ల కోసం అప్పుడే స్థానిక కాంగ్రెస్‌ నాయకుల ద్వారా అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రుల వద్దకు అధికారులు పరుగులు తీస్తున్నారు.

News June 9, 2024

NLG: పెట్టుబడి సాయం అందక రైతన్న పాట్లు

image

వానాకాలం సీజన్ ఆరంభం కావడంతో ఉమ్మడి జిల్లాలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షాలు కురుస్తుండడంతో పత్తి విత్తనాలు విత్తుతున్నారు. మృగశిర కార్తె ప్రారంభం కావడంతో వరినార్లు పోసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కనీసం విధివిధానాలను రూపొందించకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. పెట్టుబడి సాయం కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

News June 9, 2024

పెద్దపల్లి: డబుల్​ బెడ్​ రూం పంపిణీకి రెడీ

image

పెద్దపల్లిలో డబుల్​ బెడ్​ రూం ఇండ్లను పంపిణీ చేయడానికి MLA విజయరమణారావు రెడీ అయ్యారు. 9ఏళ్ల నుంచి ఇప్పటి వరకు 262 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 1,669 ఇండ్లను కడుతుండగా.. 1,463 ఇండ్లకు పునాదులు తీయలేదు. జిల్లాలోని 14 మండలాల్లో మంథని 92, కాల్వ శ్రీరాంపూర్​లో 170 మాత్రమే పూర్తయ్యాయి. PDPL, సుల్తానాబాద్​, RGM మండలాల్లో నిర్మాణాలు స్లోగా జరుగుతున్నాయి. ధర్మారం(U)​, మంథని(U)​లో స్థలం లేక పనులు చేపట్టలేదు.

News June 9, 2024

NZB: జాతీయ లోక్‌అదాలత్‌లో 17 వేల కేసులు పరిష్కారం

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ద్వారా 17వేల కేసులు పరిష్కారమైనట్లు న్యాయసేవా సంస్థ కార్యదర్శి పద్మావతి తెపారు. 153 సైబర్ క్రైం కేసులు పరిష్కరించి రూ.9 లక్షలు బాధితులకు పోలీసుల ద్వారా అందజేశారు. మోటారు బీమాకు 51 కేసులకు సంబంధించి రూ. 2.18 కోట్ల పరిహారం అందించారు. జిల్లా జడ్జి కుంచాల సునీత మాట్లాడుతూ.. పట్టు విడుపు ధోరణితో కక్షిదారులు కేసులు పరిష్కరించుకోవాలని అన్నారు.

News June 9, 2024

జనగామ: కుక్కల దాడిలో బాలుడు మృతి

image

చిల్పూర్ మండలం ఫతేపూర్ గ్రామ శివారులోని నునావత్ తండాలో శనివారం దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లొచ్చేసరికి ఇంట్లో ఉన్న బాలుడు పై కుక్కలు దాడి చేసి అతి దారుణంగా చంపేశాయి. చెట్ల పొదల్లో అరుపులు వినిపించడంతో వెళ్లి చూసే సరికి బాలుని మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

News June 9, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

image

ఆసిఫాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా కావల్కర్ లక్ష్మీ బాయి, కావల్కర్ సురేష్ కు చెందిన రెండు ఇళ్లల్లో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో రెండు ఇల్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 9, 2024

KMM: కేయూలో రెండో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

జూన్ 11 నుంచి ప్రారంభం కావాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయ PG సెకండ్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి, అదనపు నియంత్రణ అధికారి డాక్టర్ బి.ఎస్.ఎల్ సౌజన్య తెలిపారు. తిరిగి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో తెలియజేస్తామన్నారు. విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు.

News June 9, 2024

HYD: 47,309 మందికి చేప ప్రసాదం పంపిణీ

image

మృగశిర కార్తె పురస్కరించుకుని HYD నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. శనివారం రాత్రి 8 గంటల వరకు 47,309 మంది ప్రసాదం స్వీకరించినట్లు తహశీల్దార్ ప్రేమ్ కుమార్ తెలిపారు. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, ఒడిశా, UP, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తదితరరాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారన్నారు. ఈ పంపిణీ ఈరోజు కూడా కొనసాగనుందన్నారు.

News June 9, 2024

HYD: 47,309 మందికి చేప ప్రసాదం పంపిణీ

image

మృగశిర కార్తె పురస్కరించుకుని HYD నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. శనివారం రాత్రి 8 గంటల వరకు 47,309 మంది ప్రసాదం స్వీకరించినట్లు తహశీల్దార్ ప్రేమ్ కుమార్ తెలిపారు. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, ఒడిశా, UP, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తదితరరాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారన్నారు. ఈ పంపిణీ ఈరోజు కూడా కొనసాగనుందన్నారు.