Telangana

News June 9, 2024

నాలుగుసార్లు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే..

image

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత 2007లో శాసనమండలి వ్యవస్థను తిరిగి ప్రారంభించారు. WGL–KMM–NLG గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా తొలిసారి టీఆర్‌ఎస్‌ నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లోనూ కపిలవాయి విజయం సాధించారు. 2015 తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. మళ్లీ 2021ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు.

News June 9, 2024

భార్య వేధింపులతో భర్త సూసైడ్

image

భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులతో భర్త సూసైడ్ చేసుకున్న ఘటన హుజూర్‌నగర్‌లోని సీతారాంనగర్‌లో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై ముత్తయ్య వివరాల ప్రకారం.. చిట్టిప్రోలు రంజిత్‌కుమార్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య స్వప్న రేషన్‌ దుకాణం నడిపిస్తుంది. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి గొడవ పడుతున్నారు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు వేధిస్తుండటంతో ఆయన ఉరేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

News June 9, 2024

జగిత్యాల: హత్య చేసిన కేసులో ముగ్గురి అరెస్ట్

image

హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వివరాలిలా.. భూపాలపల్లికి చెందిన రమేశ్ జగిత్యాల జిల్లా ఎండపల్లి (M) గోడిశాలకి చెందిన మల్లేశ్ దగ్గర రూ.2 లక్షలు అప్పుతీసుకున్నాడు. గతంలో వీరికి అప్పు విషయంలో గోడవలు జరిగాయి. ఈక్రమంలో మల్లేశ్, కుమారుడు నాగరాజు, జితేందర్ ముగ్గురు గురువారం భూపాలపల్లిలోని రమేశ్ ఇంటికి వెళ్లి హత్య చేసి పారిపోయారు. కేటీకే 5వ గని వద్ద శనివారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

News June 9, 2024

HYD: ఈసెట్ కౌన్సెలింగ్ స్లాట్ బుకింగ్ ప్రారంభం

image

ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్ లైన్ సెంటర్‌లో ఈసెట్ కౌన్సెలింగ్ స్లాట్ బుకింగ్ ప్రారంభమైందని, ఈనెల 11 వరకు విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్యగౌడ్ చెప్పారు. ఈనెల 10 నుంచి 12 వరకు ఈసెట్ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన, 10 నుంచి 14వ తేదీ వరకు కళాశాలల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్స్, 18 నుంచి విద్యార్థులకు కళాశాలల కేటాయింపు జరుగుతుందన్నారు.

News June 9, 2024

HYD: ఈసెట్ కౌన్సెలింగ్ స్లాట్ బుకింగ్ ప్రారంభం

image

ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్ లైన్ సెంటర్‌లో ఈసెట్ కౌన్సెలింగ్ స్లాట్ బుకింగ్ ప్రారంభమైందని, ఈనెల 11 వరకు విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్యగౌడ్ చెప్పారు. ఈనెల 10 నుంచి 12 వరకు ఈసెట్ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన, 10 నుంచి 14వ తేదీ వరకు కళాశాలల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్స్, 18 నుంచి విద్యార్థులకు కళాశాలల కేటాయింపు జరుగుతుందన్నారు.

News June 9, 2024

కమ్మర్‌పల్లి: చెల్లిని కాపాడబోయి అక్క మృతి

image

చెల్లిని కాపాడబోయి అక్క మృతి చెందిన ఘటన కమ్మర్ పల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కమ్మర్‌పల్లి గాంధీ నగర్‌కు చెందిన మంజుల భర్తతో గొడవలు జరుగుతున్నాయని ఇంటికి సమీపంలో ఉన్న వరద కాలువలో దూకింది. ఆమె వెనుక అక్క శ్యామల పరుగెత్తుకుంటూ వెళ్లి కాపాడడానికి వరద కాలువలో దూకగా అక్క మరణించింది. అక్కడ ఉన్నవారు చీరను విసరగా మంజుల దానిని పట్టుకొని పైకి వచ్చింది. శ్యామల మరణించింది.

News June 9, 2024

DK అరుణకు మంత్రి పదవి దక్కుతుందా..?

image

కేంద్ర మంత్రివర్గంలో DK అరుణకు చోటు దక్కుతుందని పాలమూరు జిల్లా వాసుల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు దక్కవచ్చని, మహిళా కోటలో డీకే అరుణకు మోదీ కేబినెట్‌లో మంత్రిగా బెర్త్ దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన అనుభవం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనే నాయకురాలిగా గుర్తింపు వంటి అంశాలు ఆమెకు కలిసొస్తాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

News June 9, 2024

ADB: 220 భాషా పండిత పోస్టుల ఉన్నతీకరణ

image

ఆదిలాబాద్‌లో మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషలకు సంబంధించి 220 లాంగ్వేజ్ పండిట్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా ఉన్నతీకరణ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత తెలిపారు. ఈ మేరకు రీజినల్ జాయింట్ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందుతుందన్నారు.

News June 9, 2024

ఆత్మకూరు: బావిలో పడి రైతు మృతి

image

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి రైతు మృతి చెందిన ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీరుకుళ్ల గ్రామానికి చెందిన బిట్ల ప్రేమ్ చందర్ శనివారం పొలానికి మందు పిచికారీ చేయడానికి వెళ్లాడు. బావిలో నీళ్లు తోడుతున్న సమయంలో బావిలో పడిపోయాడు. గమనించిన భార్య తోటి రైతుల సాయంతో ప్రేమ్ చందర్‌ను బయటకు తీయించింది. అనూష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 9, 2024

HYD: ఈనెల 15న జాబ్ మేళా.. మిస్ అవ్వకండి!

image

సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో ఈనెల 15న ఉద్యోగ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నరసయ్య గౌడ్ తెలిపారు. 2022, 23, 24 సంవత్సరాలకు చెందిన విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎంబెడెడ్ సిస్టం బ్రాంచుల్లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించినవారు అర్హులని అన్నారు. 20 కంపెనీల ప్రతినిధులు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయనున్నారని తెలిపారు. SHARE IT