Telangana

News June 9, 2024

గ్రూప్-1 పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. జిల్లాలో 22 పరీక్ష కేంద్రాల్లో 7692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. పరీక్షా నిర్వహణకు 386 మంది ఇన్విజిలేటర్లు, 22 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 77 మంది బయోమెట్రిక్ ఆఫీసర్లు తదితరులను నియమించామన్నారు.

News June 9, 2024

MBNR: 36 కేంద్రాలు.. 15,199 మంది అభ్యర్థులు

image

నేడు జరగనున్న గ్రూప్-1 పరీక్ష ప్రిలిమినరీ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 15,199 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులను 8:30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అంటే ఉదయం 10 గంటలకే గేట్లు మూసి వేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.

News June 9, 2024

NZB: నేడు గ్రూప్‌-1 EXAM.. ఇది మీ కోసమే!

image

నేటి గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. NZB‌ జిల్లాలో 41, కామారెడ్డి జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,630 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్దకు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది.
>ALL THE BEST

News June 9, 2024

ADB: నేడు గ్రూప్‌-1 EXAM.. ఇది మీ కోసమే!

image

నేటి గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ADB 18, నిర్మల్ 13, మంచిర్యాల 27, ఆసిఫాబాద్ జిల్లాలో 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22,964 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు కేంద్రాల వద్దకు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది.
>ALL THE BEST

News June 9, 2024

MDK: 10 కేంద్రాలు.. 3,912 మంది అభ్యర్థులు

image

నేడు జరగనున్న గ్రూప్-1 పరీక్ష ప్రిలిమినరీ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 3,912 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులను 8:30 గం. నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అంటే ఉదయం 10 గంటలకే గేట్లు మూసి వేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.

News June 9, 2024

HYD: నేడే గ్రూప్‌-1 EXAM.. ఇది మీ కోసమే!

image

నేటి గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. HYD‌లో 76, మేడ్చల్‌-105, రంగారెడ్డి-93, వికారాబాద్‌‌లో 13 సెంటర్ల చొప్పున ఏర్పాటు చేశారు. రాజధానిలో దాదాపు 1.70 లక్షల మంది పరీక్ష రాస్తున్నారు. అభ్యర్థుల కోసం కోఠి, రేతిఫైల్‌ బస్టాండ్‌లో హెల్ప్‌డెస్క్‌, రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులను అందుబాటులో ఉంచినట్లు సజ్జనార్‌ తెలిపారు.
NOTE: 10:30AM నుంచి 1PM వరకు పరీక్ష ఉంటుంది.
ALL THE BEST

News June 8, 2024

HYD: దారుణం.. మంత్రాల పేరిట అత్యాచారం

image

మేడ్చల్ PS పరిధి‌లో దారుణం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కిష్టపూర్‌లో ఒడిశా వాసి ఉంటున్నాడు. తన భార్య ఆరోగ్యం బాగోలేదని సహద్యోగి షేక్ మోసిన్(41)కు చెప్పుకున్నాడు. మంత్రం వేసి నయం చేస్తానని నమ్మించిన మోసిన్‌ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అందరూ బయటే ఉండాలి.. మంత్రం వేస్తానని చెప్పి గదిలో అత్యాచారం చేశాడు. అవమానంతో బాధితురాలు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఈ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు.

కాళేశ్వరం వాసులకే ఛైర్మన్‌ పదవి?

image

కాళేశ్వరం దేవస్థానానికి పాలక మండలి నియామకానికి సన్నాహాలు మొదలయ్యాయి. BRS ప్రభుత్వంలో నియామకమైన పాలకమండలి గడువు మార్చి 13న ముగిసింది. రెండేళ్ల క్రితం ఈ క్షేత్రానికి పూర్తిస్థాయి ఈవో నియామకం జరగగా.. 2 నెలల క్రితం బదిలీ అయ్యారు. అయితే పాలకమండలి ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు. ఈసారి కాళేశ్వరం వాసులకే ఛైర్మన్‌ పదవి దక్కాలని ఆశిస్తున్నట్లు సమాచారం.