Telangana

News June 8, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామోజీరావుకు ఘన నివాళులు.
@ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామన్న జగిత్యాల కలెక్టర్.
@ సైదాపూర్ మండలంలో అనుమానాస్పద స్థితిలో దినసరి కూలీ మృతి.
@ గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు.
@ తంగళ్ళపల్లి మండలంలో షెడ్డు కూలీ రెండు లేగ దూడలు మృతి.
@ కాటారం మాజీ జెడ్పిటిసి మృతి.
@ పెద్దపల్లిలో గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

News June 8, 2024

కొత్తగూడెం: తాటి చెట్టుపై నుంచి జారిపడి యువకుడి మృతి

image

తాటి చెట్టుపై నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన వెంకటాపురం మండలంలో చోటుచేసుకుంది. చింతపల్లికి చెందిన శివ(25) శనివారం తాటి ఆకుల కోసం చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందాడు.

News June 8, 2024

నాగిరెడ్డిపేట: వేధింపులు భరించలేక యువకుడి సూసైడ్

image

కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటన నాగిరెడ్డిపేటలో చోటుచేసుకుంది. బొల్లారం గ్రామానికి చెందిన హరీశ్ ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. ఇటీవల అతడు గ్రామానికి రాగా కుటుంబ సభ్యులు డబ్బుల కోసం వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన హరీష్ ఉరకేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు.

News June 8, 2024

సోనియా గాంధీని కలిసిన నల్గొండ, భువనగరి ఎంపీలు

image

ఎంపీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఢిల్లీలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డితో సోనియా గాంధీని కలిశారు. ఈ కార్యక్రమంలో మిగతా ఎంపీలు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

News June 8, 2024

కేయూలో రెండో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

జూన్ 11 నుంచి ప్రారంభం కావాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి, అదనపు నియంత్రణ అధికారి డాక్టర్ బి.ఎస్.ఎల్ సౌజన్య తెలిపారు. తిరిగి ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో తెలియజేస్తామన్నారు. విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు ఈ విషయాన్ని వహించాలని తెలిపారు.

News June 8, 2024

కామారెడ్డి జిల్లాలో 69 మంది పోలీసులు బదిలీ

image

కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో ఐదేళ్లు విధులు నిర్వహించిన 69 మంది కానిస్టేబుల్స్‌ని బదిలీ చేసినట్లు ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. సిబ్బంది ఆరోగ్య, కుటుంబ సమస్యలు, సీనియార్టీని పరిగణలోకి తీసుకొని సిబ్బంది కోరిక మేరకు బదిలీలు చేసినట్లు పేర్కొన్నారు. బదిలీ అయిన కానిస్టేబుల్స్ వారికి స్టేషన్‌లలో రిపోర్ట్ చేసి విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు.

News June 8, 2024

యాదాద్రి ఆలయంలో వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు

image

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు వృద్ధులు, వికలాంగులు
అనారోగ్యంతో నడవలేని స్థితిలో బ్యాటరీ వెహికిల్ తో పాటుగా దేవస్థానం ప్రోటోకాల్ కార్యాలయం ముందు వీల్ చైర్లు అందుబాటులో ఉన్నాయని ఆలయా ఈవో భాస్కర్ రావు
తెలిపారు. ఈ బ్యాటరీ వెహికల్ అవసరమైన భక్తులు తమ పేరును, సెల్ నెంబర్ నమోదు చేసుకొని ప్రోటోకాల్ కార్యాలయంలో గల ఈ వీల్ చైర్ లను భక్తులు ఉపయోగించు కోవాలన్నారు.

News June 8, 2024

ఎంజీయూలో 5 ఏళ్ల ఫార్మా కోర్సు

image

ఇంటర్ విద్యతో MGUలో 5సం.రాల ఇంటిగ్రేటెడ్ ఫార్మాసుటికల్ కెమిస్ట్రీ పీజీ కోర్స్ చేయవచ్చని అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంజీయూ ప్లేస్మెంట్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి తెలిపారు. కోర్సు పూర్తి అయిన విద్యార్థులకు నేరుగా ఫార్మా ఇండస్ట్రీలో అవకాశాలు, ప్రాజెక్టు వర్క్ కోసం ఇండస్ట్రీ, ఐఐసీటీ, ఐఐటీని ఎంచుకోవచ్చన్నారు. ఈ కోర్సును OU నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అర్హత సాధించి ఎంచుకోవచ్చన్నారు.

News June 8, 2024

పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ

image

దేశ రాజధాని న్యూ-ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలను కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, తదితరులు పాల్గొన్నారు.

News June 8, 2024

MNCL: దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టు

image

దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు మంచిర్యాల DCP అశోక్ కుమార్ తెలిపారు. గత కొద్ది నెలలుగా జిల్లాలోని హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో జల్సాలకు అలవాటుపడ్డ నిందితులు ఖమ్మంకు చెందిన యెసొబు @(సురేశ్ రెడ్డి), రాహుల్‌ను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 21/4 తు.ల బంగారం, 15 తు.ల వెండి, రూ.2,44,660 నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.