Telangana

News June 8, 2024

ఖమ్మం: కాంగ్రెస్ ఫస్ట్ టైం విన్

image

NLG-WGL-KMM పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే గెలుపుతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ ఈ స్థానాన్ని ఫస్ట్ టైం గెలుచుకున్నట్లైంది. 2015, 21లో ఈస్థానాన్ని బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) గెలుచుకుంది. ఈ సారి మాత్రం పట్టభద్రులు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు.

News June 8, 2024

నల్గొండ: కాంగ్రెస్ ఫస్ట్ టైం విన్

MBNR: పల్లెల్లో ‘కాంగ్రెస్’.. పట్టణాల్లో BJPకి జై !

image

సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని పట్టణవాసులు కమలం పార్టీకే జైకొడితే.. పల్లెల్లో మాత్రం కాంగ్రెస్ ది పైచేయి అయింది. పూర్వ మహబూబ్‌నగర్‌లో పురపాలికలు మొత్తం 23 ఉన్నాయి. వీటి పరిధిలో BJPకి 2,07,202 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,92,620, BRSకు 48,617 ఓట్లు వచ్చాయి. పట్టణాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకి 14,582 ఓట్లు అత్యధికంగా వచ్చాయి. NGKL లోక్ సభ స్థానం పరిధి గ్రామాల్లో BRS, BJPకి పోటాపోటీగా ఓట్లు పడ్డాయి.

News June 8, 2024

BREAKING: HYDలో మరో MURDER

image

HYDలో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాపూర్ సమీపంలోని మీర్‌పేట్ PS పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నందనవనం రౌడీ షీటర్ సల్మాన్(23) హత్యకు గురయ్యాడు. అయితే అర్ధరాత్రి అతడి సోదరి.. సల్మాన్‌కి కాల్ చేసి డబ్బులు ఇస్తానని అయ్యప్ప గుడి వద్దకు రమ్మని పిలిచింది. అక్కడే ఉన్న సూరి, అతడి స్నేహితులు కలిసి సల్మాన్‌ని గొంతు కోసి చంపేశారు. కేసు నమోదైంది. 

మూడవసారి గిన్నిస్ రికార్డును అందుకున్న గౌరీశంకర్

image

సత్తుపల్లికి చెందిన సూక్ష్మకళాకారుడు గుమ్మడిదల గౌరీశంకర్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. తాజాగా 3 సారి రికార్డు పొంది హ్యాట్రిక్ వీరుడయ్యాడు.పెన్సిల్ లెడ్ను ఉపయోగించి ఇదివరకు 617 లింక్లతో ఉన్న గిన్నిస్ రికార్డు అధిగమించాడు. పెన్సిల్ లెడ్తో ఏకంగా 9 అడుగుల పొడవు ఉండేలా 1,125లింకులు చేసి ఆ రికార్డ్ను బద్దలు కొట్టాడు.ఇందుకోసం దాదాపు 6 నెలలపాటు శ్రమించినట్లు గౌరీ శంకర్ తెలిపారు

News June 8, 2024

సానుకూలంగా ఉంటూ కష్టపడి పని చేద్దాం: కేటీఆర్

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కష్టపడి పని చేశారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ఆశించిన రీతిలో రాలేదని, రాకేష్ రెడ్డి నిత్యం బలంగా, సానుకూలంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేటీఆర్ అన్నారు.

News June 8, 2024

రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి కీలక ఆదేశాలు!

image

2023సంవత్సరంలో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా బదిలీ అయిన జిల్లా పరిధిలోని ఉపాధ్యాయులు తక్షణమే ఈరోజు నూతన పాఠశాలల్లో రిపోర్ట్ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి ఏ.రమేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని మండల విద్యాశాఖ అధికారులు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.

News June 8, 2024

తీన్మార్ మల్లన్న విజయం.. రేవంత్ రెడ్డి విషెస్

image

పట్టభద్రుల MLCగా గెలుపొందిన తీన్మార్ మల్లన్నకు ట్విటర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలిపారు. తీన్మార్ మల్లన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలపై ప్రశ్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఇదే స్థానంలో గెలిచిన పల్లారాజేశ్వర్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇచ్చారు.

News June 8, 2024

HYD: ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన మహిళ మృతి

image

HYD కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బేగంపేట్‌లోని కుందన్ బాగ్‌లో నివాసం ఉంటున్న పరిణిత సంతానం కోసం ఐవీఎఫ్ చికిత్స చేయించుకునేందుకు మే 31న KPHB కాలనీలోని ప్రసాద్ ఆసుపత్రిలో చేరింది. వైద్యం వికటించి ఆమె మృతిచెందగా పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. విషయం బయట పడకుండా ఆస్పత్రి యాజమాన్యం గోప్యంగా ఉంచారు. కాగా విషయం ఈరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.