Telangana

News June 8, 2024

HYD: ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన మహిళ మృతి

image

HYD కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బేగంపేట్‌లోని కుందన్ బాగ్‌లో నివాసం ఉంటున్న పరిణిత సంతానం కోసం ఐవీఎఫ్ చికిత్స చేయించుకునేందుకు మే 31న KPHB కాలనీలోని ప్రసాద్ ఆసుపత్రిలో చేరింది. వైద్యం వికటించి ఆమె మృతిచెందగా పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. విషయం బయట పడకుండా ఆస్పత్రి యాజమాన్యం గోప్యంగా ఉంచారు. కాగా విషయం ఈరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

News June 8, 2024

HYD: రామోజీరావుకు నివాళులర్పించిన KTR

image

HYD రామోజీ ఫిలిం సిటీలో ఈనాడు అధినేత రామోజీరావు పార్థివదేహానికి ఈరోజు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నివాళులర్పించారు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ.. రామోజీరావు మరణించడం చాలా బాధాకరమన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారని, మీడియా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులున్నారు.

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మత్తు పదార్థాల కలకలం

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోకి కొందరు పేషంట్ సహాయకులు కల్లు, గుట్కా ప్యాకెట్లు లాంటి మత్తు పదార్థాలను తీసుకురావడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది గాంధీ సందర్శకులను తనిఖీలు చేస్తూ నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఆసుపత్రిలోకి మత్తు పదార్థాలను తీసుకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

HYD: రామోజీరావుకు హరీశ్‌రావు నివాళి 

image

ఈనాడు అధినేత రామోజీరావు మృతిచెందడం చాలా బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈరోజు HYD రామోజీ ఫిలింసిటీలో ఆయనకు హరీశ్‌రావు నివాళులర్పించి మాట్లాడారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. మీడియా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

అందోల్: గుండెపోటుతో రేషన్ డీలర్ మృతి

image

అందోల్ మండలం నేరడిగుంట గ్రామానికి చెందిన రేషన్ డీలర్ నర్సింహులు శనివారం గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. 18ఏళ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థలో తనదైన శైలిలో గ్రామంలోని ప్రజలకు ఎన్నో సేవలను అందించారు. ఈయన మృతి పట్ల మండల డీలర్ల సంఘం తీవ్ర సంతాపం తెలిపింది. ఎల్లప్పుడూ ప్రజానీకంలో ఉంటూ ప్రజల మన్ననలు పొందారని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రోల్ల జోగినాథ్ అన్నారు.

News June 8, 2024

జనగామ: గ్రూపు-1 పరీక్షకు 3,697మంది అభ్యర్థులు

image

జూన్ 9వ తేదీన (రేపు) జరుగనున్న గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ పరీక్షలకు 3,697మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. 14కేంద్రాలలో జూన్ 9వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించనున్నట్లు వివరించారు.

News June 8, 2024

HYD: మహా నగరాభివృద్ధి సంస్థ బలోపేతానికి స్పెషల్ ఫోకస్ 

image

HYD మహానగరాభివృద్ధి సంస్థను బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం HMDA పరిధిలోని 7 జిల్లాల్లో 7228 చ.కి.మీ.ల వరకు ఉంది. దీన్ని ప్రాంతీయ వలయ రహదారి వరకు విస్తరించనున్నారు. మరికొన్ని ప్రాంతాలను HMDA పరిధిలోకి తీసుకురావడమే కాకుండా.. జోన్ల సంఖ్యను ఆరు లేదా ఎనిమిది చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. HMDAలో కీలకమైన ప్రణాళిక విభాగాన్ని బలోపేతం చేయనున్నారు. SHARE IT