Telangana

News June 8, 2024

HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు పోటెత్తారు..!

image

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈరోజు ఉదయం నుంచి చేప మందు పంపిణీ కొనసాగుతోంది. ఈ క్రమంలో వివిధ రాష్టాల నుంచి భారీ ఎత్తున ప్రజలు చేప ప్రసాదం తీసుకునేందుకు తరలిరావడంతో గ్రౌండ్‌లో ఫుల్ రద్దీ నెలకొంది. వేలాది మంది తరలి రావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీ తెలిపారు.

News June 8, 2024

HYD: మహా నగరాభివృద్ధి సంస్థ బలోపేతానికి స్పెషల్ ఫోకస్

image

HYD మహానగరాభివృద్ధి సంస్థను బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం HMDA పరిధిలోని 7 జిల్లాల్లో 7228 చ.కి.మీ.ల వరకు ఉంది. దీన్ని ప్రాంతీయ వలయ రహదారి వరకు విస్తరించనున్నారు. మరికొన్ని ప్రాంతాలను HMDA పరిధిలోకి తీసుకురావడమే కాకుండా.. జోన్ల సంఖ్యను ఆరు లేదా ఎనిమిది చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. HMDAలో కీలకమైన ప్రణాళిక విభాగాన్ని బలోపేతం చేయనున్నారు. SHARE IT

News June 8, 2024

HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు పోటెత్తారు..!  

image

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈరోజు ఉదయం నుంచి చేప మందు పంపిణీ కొనసాగుతోంది. ఈ క్రమంలో వివిధ రాష్టాల నుంచి భారీ ఎత్తున ప్రజలు చేప ప్రసాదం తీసుకునేందుకు తరలిరావడంతో గ్రౌండ్‌లో ఫుల్ రద్దీ నెలకొంది. వేలాది మంది తరలి రావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీ తెలిపారు.  

News June 8, 2024

తీన్మార్ మల్లన్న విజయం.. రేవంత్ రెడ్డి విషెస్

image

పట్టభద్రుల MLCగా గెలుపొందిన తీన్మార్ మల్లన్నకు ట్విటర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలిపారు. తీన్మార్ మల్లన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలపై ప్రశ్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఇదే స్థానంలో గెలిచిన పల్లారాజేశ్వర్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇచ్చారు.

News June 8, 2024

MBNR: పల్లెల్లో ‘కాంగ్రెస్’.. పట్టణాల్లో BJPకి జై !

image

సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని పట్టణవాసులు కమలం పార్టీకే జైకొడితే.. పల్లెల్లో మాత్రం కాంగ్రెస్ ది పైచేయి అయింది. పూర్వ మహబూబ్‌నగర్‌లో పురపాలికలు మొత్తం 23 ఉన్నాయి. వీటి పరిధిలో BJPకి 2,07,202 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,92,620, BRSకు 48,617 ఓట్లు వచ్చాయి. పట్టణాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకి 14,582 ఓట్లు అత్యధికంగా వచ్చాయి. NGKL లోక్ సభ స్థానం పరిధి గ్రామాల్లో BRS, BJPకి పోటాపోటీగా ఓట్లు పడ్డాయి.

News June 8, 2024

డిచ్‌పల్లి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి(M) ధర్మారానికి చెందిన ప్రేమ్ కుమార్(32) మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా డిచ్‌పల్లి పరిధిలో ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News June 8, 2024

ఖమ్మం చరిత్రలో భారీ మెజార్టీ

image

కూసుమంచి: ఖమ్మం ఎంపీ ఎన్నికల చరిత్రలో ఏ ఎంపీకీ రాని మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డికి ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నాయకన్ గూడెంలో స్థానిక నేతలతో నిర్వహించిన సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. మొదటి విడతలో ఇళ్లు, రెండో విడతలో ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. అతి త్వరలోనే అర్హులైన అందరికీ ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని పేర్కొన్నారు.

News June 8, 2024

HYD: వాట్సాప్‌ యూజర్లకు పోలీసుల ALERT

image

సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో కాల్ చేసి బెదిరిస్తూ డబ్బులు కాజేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి టెలికాం శాఖ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ వాట్సాప్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ..మనీలాండరింగ్ కేసులో మీ పై కేసు నమోదైందని, మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి రూ.10లక్షలు ఇవ్వాలని బెదిరించగా డబ్బు పంపి బాధితుడు మోసపోయాడు.

రామోజీ రావు జీవితం అందరికీ ఆదర్శం: హరీశ్ రావు

image

రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన వ్యక్తి రామోజీ అన్నారు.