Telangana

News June 8, 2024

‘2009 నుంచి బీజేపీ గెలవలేదు’

image

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంపై కాషాయజెండా ఎగరవేయాలని నాయకులు 2009 నుంచి ప్రయత్నిస్తున్నారు. 2009లో బీజేపీ నుంచి పోటీచేసిన చింతా సాంబమూర్తి నామమాత్రపు పోటీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో TDPతో కలిసి పోటీ చేసిన పార్టీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డి శ్రమించినా ఫలితం దక్కలేదు. 2019లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పీవీ శ్యామ్‌సుందర్‌రావు ఓటమిపాలయ్యారు, ప్రస్తుతం నర్సయ్య ఓటమితో బీజేపీకి నిరాశే మిగిల్చింది.

News June 8, 2024

వాంకిడిలో అనుమానాస్పదంగా యువకుడి మృతి

image

వాంకిడి మండలంలోని కనార్ గాం గ్రామానికి చెందిన కళ్యాణ్ (18) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. కళ్యాణ్ పెరట్లో వెళ్లి అక్కడే కిందపడి ఆరిచాడు. చుట్టూ పక్కల వారు గమనించి వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు వాంకిడి ఎస్ఐ సాగర్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 8, 2024

ఖమ్మం కలెక్టర్ గౌతమ్ కీలక ఆదేశాలు

image

గ్రూప్ 1 అభ్యర్థులకు ఖమ్మం కలెక్టర్ గౌతమ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు బూట్లు, అభరణాలు వేసుకుని రావొద్దని సూచించారు. జిల్లాలో మొత్తం 52 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 18,403 మంది హాజరవుతారన్నారు. నిమిషం ఆలస్యమై పరీక్ష కేంద్రంలోనికి అనుమతి లేదన్నారు.

News June 8, 2024

WGL: రామోజీరావు మృతిపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

image

ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అకాల మృతిపై పంచాయ‌తీరాజ్, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీరావు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించారన్నారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడని ఆమె కొనియాడారు.

News June 8, 2024

MLC ఓట్ల లెక్కింపు: మూడురోజుల పాటు నానా అవస్థలు

image

పట్టభద్రుల MLC ఉపఎన్నిక లెక్కింపు 60 గంటలకు పైగా సాగింది. కౌంటింగ్‌లో మొత్తం 52మంది అభ్యర్థులు, 3వేల మందికి పైగా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 12 గంటల పాటూ ఏకధాటిగా విధుల్లో ఉండడంతో అలసిపోయారు. గోదాముల్లో కూలర్లు ఏర్పాటు చేసినా అక్కడి ఉక్కపోతతో కొంతమంది డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. గతంలో 56 టేబుళ్లపై లెక్కించగా.. ఈదఫా 96టేబుళ్లపై ఓట్లను లెక్కించినా ప్రక్రియ ఆలస్యమవడంతో అవస్థలు పడినట్లు తెలిపారు.

News June 8, 2024

KNR: కానిస్టేబుల్ ఖాతా నుంచి రూ.1.40 లక్షలు మాయం

image

సైదాపూర్ ఠాణాలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ సెల్ నుంచి రూ.1.40 లక్షలను సైబర్ నేరస్థుడు కాజేశాడు. వివరాలిలా.. సట్ల ఆంజనేయులు సెల్‌కు మే 30న ఆధార్‌కార్డు నంబరుతో సహా ఓటీపీ వచ్చింది. తర్వాతి రోజు రాత్రి సిమ్ పనిచేయలేదు. కస్టమర్ కేర్‌కు ఫోను చేసి తెలుసుకోగా సిమ్ బ్లాక్ అయిందని తెలిసింది. కొత్త సిమ్ తీసుకోగా జూన్5న యాక్టివేషన్ అయ్యింది. అప్పటికే తన ఖాతా నుంచి రూ.1.40 లక్షలు డ్రా అయినట్లు తేలింది.

News June 8, 2024

అసిఫాబాద్: ఉమ్మడి జిల్లాలో 23,504 గ్రూప్ -1 అభ్యర్థులు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించే గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షకు 71 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 23,504 అభ్యర్థులు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మల్‌లో 13 పరీక్ష కేంద్రాల్లో 4,608, అదిలాబాద్‌లో 18 పరీక్ష కేంద్రాల్లో 6,729, ఆసిఫాబాద్‌లో 13 పరీక్ష కేంద్రాల్లో 2,783, మంచిర్యాలలో 27 పరీక్ష కేంద్రాల్లో 9,384 పరీక్షకు హాజరవుతున్నారు.

News June 8, 2024

సిర్పూర్ (టి): యువతి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ

image

సిర్పూర్(టి) మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ఏరియా లోని న్యూ రైస్ మిల్ గోదాం దగ్గర ఓ యువతి సూపర్ వాస్మోల్ తాగింది.  గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిర్పూర్ (టి) ఎస్ఐ రమేశ్ ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 8, 2024

బోధన్‌: దొంగల హల్‌చల్‌

image

బోధన్‌ పట్టణంలో నెలన్నర కాలంలో దొంగల హల్‌చల్‌ కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రజలు, వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంటి ఎదుట గాని, ఏదైనా దుకాణం, బ్యాంకుల వద్ద ద్విచక్రవాహనం నిలపాలంటే వాహనదారులు భయపడుతున్నారు. పని ముగించుకుని బయటకు రాగానే వాహనం కనిపించకుండా పోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొంగలు పక్కాగా పగలు రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లు, దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు.

News June 8, 2024

మూడు రోజుల పాటు నానా అవస్థలు

image

పట్టభద్రుల MLC ఉపఎన్నిక లెక్కింపు 60 గంటలకు పైగా సాగింది. కౌంటింగ్‌లో మొత్తం 52మంది అభ్యర్థులు, 3వేల మందికి పైగా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 12 గంటల పాటూ ఏకధాటిగా విధుల్లో ఉండడంతో అలసిపోయారు. గోదాముల్లో కూలర్లు ఏర్పాటు చేసినా అక్కడి ఉక్కపోతతో కొంతమంది డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. గతంలో 56 టేబుళ్లపై లెక్కించగా.. ఈ దఫా 96టేబుళ్లపై ఓట్లను లెక్కించిన ప్రక్రియ ఆలస్యమవడంతో అవస్థలు పడినట్లు తెలిపారు.