Telangana

News June 8, 2024

HYD: వరి సాగు గణనీయంగా పెరుగుతోంది: మంత్రులు

image

తెలంగాణలో వరి సాగు గణనీయంగా పెరుగుతోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ సోనా రకం బహుళ ప్రాచుర్యం పొందిందని తెలిపారు. శుక్రవారం HYDలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ప్రపంచ వరి సదస్సు-2024ను తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సదస్సులో 30 దేశాల నుంచి 150 మంది ఎగుమతిదారులు , దిగుమతిదారులు , శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

గ్రూప్-1 పరీక్ష.. వేలిముద్ర వేయాల్సిందే !

image

గ్రూప్-1 పరీక్ష రాసే అభ్యర్థులు కేంద్రంలోకి వచ్చేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు బయోమెట్రిక్ తప్పనిసరిగా వేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు కేంద్రాలను తనిఖీ చేయనున్నారని, తనిఖీలకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని, ముఖ్యంగా అభ్యర్థులు కాళ్లకు షూ ధరించరాదు. చెప్పులు మాత్రమే వేసుకుని రావాలి. సీఎస్‌కు మాత్రమే ఫోన్ అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.

News June 8, 2024

నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి రికార్డ్

image

రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికైన వారిలో నాగర్‌కర్నూల్ నుంచి నుంచి ప్రాతినిధ్యం వహించనున్న మల్లు రవి(73) పెద్ద వయస్కుడిగా రికార్డుకు ఎక్కారు. కాగా మల్లు రవి ఎంబీబీఎస్ చదివారు. 1980లో ఉమ్మడి APలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ డాక్టర్స్ వింగ్ కన్వీనర్‌గా ఆయన పనిచేశారు. 1991లో తొలిసారిగా NGKL ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 1998లో రెండోసారి MPగా గెలిచిన ఆయన 26ఏళ్ల తర్వాత మళ్లీ పార్లమెంట్‌కు వెళ్తున్నారు.

News June 8, 2024

HYD: చేప మందు ఎఫెక్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు

image

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నేటి నుంచి చేప మందు పంపిణీ చేయనున్నారు. లక్షలాది మంది తరలిరానుండడంతో నాంపల్లి పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు ఉదయం నుంచి 9వ తేదీ సా.6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రత్యేక పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్‌ను ప్రతి ఒక్కరూ ఫాలో కావాలని, సహాయం కోసం హెల్ప్‌లైన్‌ 9010203626 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. SHARE IT

ఓటమిని అంగీకరిస్తున్నా: రాకేశ్ రెడ్డి

image

WGL-KMM-NLG BRS ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఓటమిపై స్పందించారు. ఓటమిని అంగీకరించినట్లు ప్రకటించారు. సాంకేతికంగా ఓడిపోవచ్చు.. కానీ, నైతికంగా గెలిచానని అన్నారు. పన్నెండేళ్లుగా ప్రజల కోసం పని చేస్తున్నానని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులందరూ తనకు ఎంతో సపోర్ట్ చేశారన్నారు. ఊపిరి ఉన్నంత వరకు పట్టభద్రుల కొసం ప్రజా క్షేత్రంలో పోరాడుతానని పేర్కొన్నారు.

రాజముద్రపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: మంత్రి కొండా

image

తెలంగాణ అధికారిక రాజముద్రపై తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. హన్మకొండలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రాజముద్రలో కీర్తి తోరణం తొలగించలేదని, అందరి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని, కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

News June 8, 2024

అందుబాటులో జనుము, జీలుగ విత్తనాలు: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో జనము, జీలుగ, పత్తి విత్తనాలు, యూరియా అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు. జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చనిపోయిన రైతు కుటుంబానికి త్వరగా రైతు బీమా అందజేయాలని అధికారులకు సూచించారు. రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ తో రైతులను శాస్త్రవేత్తలతో అనుసంధానించాలని సూచించారు.