Telangana

News June 8, 2024

ADB: ‘గ్రూప్ 1 పరీక్షలో సందేహాలకు సంప్రదించండి’

image

ఆదిలాబాద్ జిల్లాలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జూన్ 9న ఉదయం 10.30 నుంచి మద్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష జరుగుతుందని 6,729 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలు, హాల్ టికెట్ డౌన్ లోడ్ గురించి, ఇతర సందేహాల నివృతి కోసం 9491053677 నంబర్‌ను సంప్రదింవచ్చిన అభ్యర్థులకు సూచించారు.

News June 8, 2024

కామారెడ్డి: ఈ నెల 10న యథావిధిగా ప్రజావాణి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 10నుంచి యథావిధిగా కొనసాగుతుందని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజావాణి తిరిగి కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారులకు తెలియజేయాలని సూచించారు.

News June 8, 2024

మెదక్: సోమవారం నుంచి యథావిధిగా ప్రజావాణి

image

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నిక నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం వచ్చే సోమవారం ( ఈ నెల 10) నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఇకపై ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలు నేరుగా వచ్చి తమ తమసమస్యలను వినిపించవచ్చున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.

News June 8, 2024

NLG: అంగన్వాడీల్లో ఆంగ్లంలో బోధన..!

image

ఉమ్మడి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఆంగ్లంలో బోధన చేయనున్నారు. ఈ సందర్భంగా మూడేళ్ల నుంచి ఆరేళ్ల మధ్య వయస్సు కలిగిన విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రాల్లో యూకేజీ, ఎల్కేజీకి సంబంధించిన పుస్తకాలు, నోట్బుక్స్ తో పాటు యూనిఫాం కూడా అందించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా బోధించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

News June 8, 2024

వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు ఆహ్వానం

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్వర్యంలో అశ్వారావుపేట వ్యవసాయ విద్యాసంస్థలో వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైందని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. అనూష తెలిపారు. ఎస్ఎస్సీ ఉత్తీర్ణులై టీఎస్ పాలిసెట్ లో ర్యాంకు పొందినవారు అర్హులని తెలిపారు. 2సంవత్సరాల వ్యవధి ఉండే డిప్లొమా కోర్సులో మొదటి సంవత్సరం ప్రవేశానికి 60 సీట్లు ఉన్నాయన్నారు.

News June 8, 2024

HYD: మృగశిర కార్తె.. చేపలకు ఫుల్ డిమాండ్

image

మృగశిర కార్తె సందర్భంగా ముషీరాబాద్ మార్కెట్‌‌కు భారీగా చేపలు దిగుమతి చేసుకుంటున్నారు వ్యాపారులు. సాధారణ రోజుల్లో 15 టన్నుల నుంచి 20 టన్నుల విక్రయాలు ఇక్కడ జరుగుతుంటాయి. శనివారం (మృగశిర కార్తె రోజు) 50 టన్నుల నుంచి 70 టన్నుల చేపలు అమ్ముడుపోతాయని వ్యాపారులు వెల్లడించారు. రేపు సండే కూడా గిరాకీ ఉంటుందన్నారు. మరోవైపు‌ నాంపల్లి‌ ఎగ్జిబిషన్‌లో‌ చేపమందు కోసం శుక్రవారం రాత్రి నుంచి క్యూకట్టారు.

News June 8, 2024

గద్వాల: పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్: ఎస్పీ రీతిరాజ్

image

ఈనెల 8న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల సమీపంలో ఉదయం 6 :00 నుంచి మధ్యాహ్నం 1: 00 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ రితిరాజ్ శుక్రవారం పేర్కొన్నారు. మొత్తం 105 మంది పోలీస్ సిబ్బంది 14 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలన్నారు.

News June 8, 2024

HYD: మృగశిర కార్తె.. చేపలకు ఫుల్ డిమాండ్

image

మృగశిర కార్తె సందర్భంగా ముషీరాబాద్ మార్కెట్‌‌కు భారీగా చేపలు దిగుమతి చేసుకుంటున్నారు వ్యాపారులు. సాధారణ రోజుల్లో 15 టన్నుల నుంచి 20 టన్నుల విక్రయాలు ఇక్కడ జరుగుతుంటాయి. శనివారం (మృగశిర కార్తె రోజు) 50 టన్నుల నుంచి 70 టన్నుల చేపలు అమ్ముడుపోతాయని వ్యాపారులు వెల్లడించారు. రేపు సండే కూడా గిరాకీ ఉంటుందన్నారు. మరోవైపు‌ నాంపల్లి‌ ఎగ్జిబిషన్‌లో‌ చేపమందు కోసం శుక్రవారం రాత్రి నుంచి క్యూకట్టారు.

News June 7, 2024

ఓటమిని అంగీకరిస్తున్నా: రాకేశ్ రెడ్డి

image

WGL-KMM-NLG BRS ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఓటమిపై స్పందించారు. ఓటమిని అంగీకరించినట్లు ప్రకటించారు. సాంకేతికంగా ఓడిపోవచ్చు.. కానీ, నైతికంగా గెలిచానని అన్నారు. పన్నెండేళ్లుగా ప్రజల కోసం పని చేస్తున్నానని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులందరూ తనకు ఎంతో సపోర్ట్ చేశారన్నారు. ఊపిరి ఉన్నంత వరకు పట్టభద్రుల కొరకు ప్రజా క్షేత్రంలో పోరాడుతానని పేర్కొన్నారు.

News June 7, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి”CRIME NEWS”

image

✓దౌల్తాబాద్:పిడుగుపాటుకు యువకుడు మృతి.
✓ గద్వాల: ఆర్టీసీ బస్సు బైక్ ఢీ.. ఒకరు మృతి.
✓ మహబూబ్నగర్: భారీ అగ్ని ప్రమాదం.
✓ గద్వాల్: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య.
✓ నాగర్ కర్నూల్: ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి.
✓ కడ్తాల్: జంట హత్య కేసులో ఏడుగురి అరెస్ట్.
✓ ఉమ్మడి జిల్లాలో పిడుగుపాటుకు గురై మూగజీవాలు మృతి.
✓ కొల్లాపూర్: ఎక్సైజ్ అధికారుల దాడులు కేసు నమోదు.