Telangana

News June 7, 2024

మెదక్: అగ్నిపథ్ పోస్టర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్

image

మెదక్‌లోని జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ వైమానిక దళ అధికారులతో కలిసి అగ్నిపథ్ పోస్టర్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంలో భాగంగా భారత వైమానిక దళం వారు అగ్నివీర్ వాయు అనే పేరుతో నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. యువతీ, యువకులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయాశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News June 7, 2024

KNR:12, 29, 24, 27వ తేదీల్లో సదరం శిబిరం

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 12, 19, 24, 27వ తేదీల్లో సదరం శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శుక్రవారం తెలిపారు. వినికిడి మూగ(చెవుడు)12న, మానసిక రోగులు 19న, కంటి చూపు 24న, ఆర్దో 27న, మూగ, చెవుడు, మానసిక దివ్యాంగులకు సంబంధిత వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News June 7, 2024

మెదక్: పిడుగుపాటుకు గురై మహిళా రైతు మృతి

image

చిలిపిచేడ్ మండలం చిట్కుల్‌లో పిడుగుపాటుకు ఒక మహిళ రైతు మృతిచెందింది. గ్రామానికి చెందిన బోయిని నర్సమ్మ (50) తమ వ్యవసాయ పొలం వద్ద పనులు పూర్తిచేసుకుని తిరిగి వస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గ్రామశివారులోకి రాగానే పిడుగుపాటుకు గురై నర్సమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.

News June 7, 2024

గ్రూప్-I పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో గ్రూప్-I ప్రిలిమినరి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ప్రపుల్ దేశాయ్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. జూన్ 9న జరిగే గ్రూప్-I ప్రిలిమినరి పరీక్ష నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సిలు, పోలీస్ నోడల్ అధికారి, సీఎస్, డిపార్ట్మెంటల్ అధికారులు, ఐడెంటిఫికేషన్ అధికారాలు పాల్గొన్నారు.

News June 7, 2024

NZB జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి

image

ఆలూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కూలర్ షాక్ కొట్టి సింధూర(5) మృతి చెందింది. నిజామాబాద్‌కి చెందిన సౌందర్య, మనీశ్ దంపతుల కూతురు సింధూర ఆలూరులోని అమ్మమ్మ ఇంట్లో శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ కూలర్‌ను తాకింది. కూలర్ అన్ చేసి ఉండటంతో షాక్ కొట్టి చిన్నారి తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News June 7, 2024

వరంగల్: రెండు రోజులు మార్కెట్ బంద్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. తిరిగి సోమవారం మార్కెట్ ఓపెన్ కానుంది.

News June 7, 2024

NZB: సహకార సంఘానికి తాళం వేసిన రైతులు

image

కోటగిరిలోని ఎత్తొండ గ్రామంలో రైతులకు రావాల్సిన రూ.1.80 కోట్ల ధాన్యం డబ్బులు తమకు వెంటనే చెల్లించాలని రైతులు సహకార సంఘానికి తాళం వేశారు. సహకార సంఘం పరిధిలోని 114 మంది రైతులు యాసంగిలో పండించిన పంటను ఇచ్చి 2 నెలలు అవుతున్నా వారికి డబ్బులు చెల్లించలేదని తహశీల్దార్‌కి ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న తహశీల్దార్ సునీత, AO శ్రీనివాస్ వారికి రావాల్సిన డబ్బులు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

News June 7, 2024

మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే

image

భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సందర్శించారు. బ్యారేజీలో కుంగిన పిల్లర్లను ఎమ్మెల్యే పరిశీలించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్ రెడ్డి, కొమురయ్య, తక్కల్లపల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.

News June 7, 2024

గ్రూప్-1 పరీక్ష విజయవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

అధికారులందరూ సమన్వయంతో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్ష నిర్వాహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో 4699 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఇందుకుగాను 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ గౌతమి తదితరులున్నారు.

News June 7, 2024

విత్తనాలు, ఎరువుల కొరత లేదు: అదనపు కలెక్టర్

image

వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ సాగుపై జిల్లాలోని ఏఓలు, ఏఈఓలతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఏఓలు, ఏఈఓలు తమ పరిధిలోని రైతులకు అందుబాటులో ఉండాలని, సాగులో మెలకువలు అందించాలని సూచించారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన తరువాత కచ్చితంగా రసీదు తీసుకోవాలని పేర్కొన్నారు. విత్తనాల, ఎరువుల కొరత లేదన్నారు.