Telangana

News June 7, 2024

NZB: ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్.. రూ. 6 లక్షలు స్వాధీనం

image

ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న షేక్ ఇస్మాయిల్(32)ను గురువారం అరెస్ట్ చేసినట్లు మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. మెట్పల్లి, కోరుట్ల, మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మండలాలలో 25 వాహనాలను దొంగిలించాడు. వాటిని కమ్మర్ పల్లి, ఆర్మూర్, NZB, మోర్తాడ్, పెర్కిట్ లలో స్ర్కాప్ వ్యాపారం చేసే 15 మందికి ఒక్కొ వాహనాన్ని రూ. 5 వేల చొప్పున విక్రయించారు. కాగా అతని నుంచి రూ. 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

News June 7, 2024

KMM-NLG-WGL: ఎమ్మెల్సీ ఎన్నిక.. 40 మంది ఎలిమినేషన్

image

నల్గొండ పట్టణ పరిధిలోని దుప్పలపల్లి FCI గోదాంలో KMM-NLG-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రెండో ప్రాధాన్యత ఓట్ల ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం రాత్రి నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించగా ఇప్పటి వరకు 40 మందిని ఎలిమినేషన్ చేశారు. బీజేపీ అభ్యర్థి ప్రేమ్ చందర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ ఎలిమినేషన్ తర్వాతనే ఫలితం తేలనుంది.

KMM: నా భర్త నాకు కావాలంటూ భార్య ధర్న

image

తన భర్త తనకు కావాలంటూ భార్య అత్తింటి ఎదుట ఆందోళనక దిగింది. స్థానికులు తెలిపిన వివరాలు..ఖమ్మం జిల్లా కల్లూరు వాసి మణికిషన్‌కు పెనుబల్లి మండలం యడ్లబంజార్‌ వాసి మౌనికకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన 6నెలల తర్వాత మౌనికను పుట్టింటికి పంపించిన భర్త ఆమెను తిరిగి తీసుకురాలేదు. పెద్దమనుషులు చెప్పినా ఫలితం లేకపోవడంతో మౌనిక కొడుకు(3)తో అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది. పోలీసులు వచ్చి సర్ది చెప్పారు.

News June 7, 2024

HYD: ‘దండం పెట్టి చెబుతున్నాం.. రోడ్లపై చెత్త వేయకండి’

image

గ్రేటర్ HYD ప్రజలకు శుభ్రతపై పారిశుద్ధ్య కార్మికులు వినూత్నంగా పిలుపునిచ్చారు. HYD మాదాపూర్‌లోని గఫూర్‌నగర్‌లో రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త (GVP పాయింట్)ను శుభ్రం చేసి, ముగ్గులు వేసి మాట్లాడారు. ‘ప్రజలందరికీ దండం పెట్టి చెబుతున్నాం.. ప్లీజ్ రోడ్లపై చెత్త వేయకండి.. ఇది మన హైదరాబాద్.. మనం అందరం శుభ్రంగా ఉంచుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం’ అని పిలుపునిచ్చారు. కాగా దుర్వాసన వస్తున్నా వారు క్లీన్ చేశారు.

సిద్దిపేట: గ్రూప్-1 సెంటర్‌ల వద్ద 144 సెక్షన్

image

ఈనెల 9న జరిగే గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద CRPC 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 8 గంటల గంటల్లోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని,10 గంటల కే గేట్లు మూసివేస్తారని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారన్నారు. హాల్ టికెట్, పెన్ మాత్రమే తీసుకొని రావాలని సూచించారు.

News June 7, 2024

MBNR: జిల్లాలో గృహజ్యోతి పథకం అమలు

image

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు నుంచి గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు అందిస్తున్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న వారికి విద్యుత్ శాఖ సిబ్బంది జీరో బిల్లులు జారీ చేసింది. కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్ తదితర ప్రాంతాలలో గృహ వినియోగదారులకు శుక్రవారం జీరో బిల్లులు జారీ చేశారు.

News June 7, 2024

NLG-KMM-WGL: 33 మంది ఎలిమినేషన్

image

NLG-KMM-WGL ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,696 ఆధిక్యంలో ఉన్నారు. గెలుపునకు కావాల్సిన కోటా ఓట్లు 1,55,095 అవసరం ఉండగా మల్లన్నకు గెలుపునకు ఇంకా 31,885 ఓట్లు రావాలి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 50,581 ఓట్లు కావాలి.

News June 7, 2024

ఆదిలాబాద్‌లో పోస్టుల వివరాలు ఇలా..!

image

ADB జిల్లాలో మొత్తం ఉపాధ్యాయ పోస్టులు 3,028 ఉండగా ప్రస్తుతం 2,467 మంది పని చేస్తున్నారు. మార్చి నుంచి ఇప్పటి వరకు 20 మంది పదవీవిరమణ పొందగా ఇందులో నలుగురు అనారోగ్య, రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలో 561 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 275 ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్లో చూపించారు. ఆయా కేటగిరిల్లో 286 ఖాళీలు ఉన్నాయన్నమాట. తాజా డీఎస్సీలో చేర్చితే పోస్టులు పెరిగి నిరుద్యోగులకు మేలు జరిగే అవకాశముంది.