Telangana

News June 7, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పలు రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.18 వేల ధర పలికింది. అలాగే 341 రకం మిర్చికి రూ.17 వేల ధర, వండర్ హాట్ (WH) రకం మిర్చికి రూ.18,100 ధర వచ్చింది. మరో వైపు 5,531 రకం మిర్చి రూ.13,500 పలికింది. మార్కెట్‌లో  క్రయవిక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. 

News June 7, 2024

NLG-KMM-WGL: 33 మంది ఎలిమినేషన్

image

NLG-KMM-WGL ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,696 ఆధిక్యంలో ఉన్నారు. గెలుపునకు కావాల్సిన కోటా ఓట్లు 1,55,095 అవసరం ఉండగా మల్లన్నకు గెలుపునకు ఇంకా 31,885 ఓట్లు రావాలి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 50,581 ఓట్లు కావాలి.

News June 7, 2024

HYD: అమలు కానున్న గృహ జ్యోతి పథకం!

image

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో జూన్ నుంచి గృహజ్యోతి పథకాన్ని HYD, ఉమ్మడి RR జిల్లా పరిధిలోని వినియోగదారులకు వర్తింపజేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ పథకం ఇప్పటి వరకు అమలు కాలేదు. సరూర్‌నగర్, రాజేంద్రనగర్, సైబర్ సిటీ, వికారాబాద్ సెక్షన్ల పరిధిలో నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారు 11.50 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. SHARE IT

రంగారెడ్డి: న్యాయ పరిపాలన శిక్షణకు దరఖాస్తులు

image

న్యాయ పరిపాలన శిక్షణ పొందేందుకు ఉమ్మడి RR (రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి) జిల్లాకు చెందిన ఎస్సీ అభ్యర్థుల నుంచి జూలై 6వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ తెలిపారు. బేసిక్ డిగ్రీ, లా డిగ్రీ పొంది జులై 1కల్లా 23 ఏళ్లు నిండిన వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. https://telanganaepass వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.

News June 7, 2024

NLG: నీట్‌లో రైతుబిడ్డ సత్తా

image

జిల్లాలోని సామాన్య రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి మంగళవారం విడుదలైన ‘నీట్’ ఫలితాల్లో సత్తా చాటింది. రాజపేట మండలం బేగంపేటకు చెందిన ఒగ్గు కర్ణాకర్-అనితల కుమార్తె కీర్తిసాయి నీట్‌లో 554 మార్కులు సాధించింది. ఇటీవల విడుదలైన ఈఏపీ సెట్‌లోనూ ఆమె 2,046 ర్యాంక్‌తో మెరిసింది. పట్టుదలతో చదివి తమ గ్రామ ‘కీర్తి’ పెంచిందంటూ స్థానికులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

News June 7, 2024

ఓయూలో సెల్ట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూలోని ఇంజినీరింగ్ కళాశాలలోని సెల్ట్ (సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్)లో నిర్వహించనున్న ‘ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులను ఈనెల 11 వరకు స్వీకరిస్తున్నట్లు సెల్ట్ డైరెక్టర్ సవీన్ సౌడ తెలిపారు. 12 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు సెల్ట్ కార్యాలయంలో పేరును నమోదు చేసుకోవాలన్నారు.

ప్రారంభమైన మార్కెట్.. పత్తి ధర ఎంతంటే?

image

ఆరు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పున: ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి భారీగా తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత వారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. నేడు క్వింటా పత్తి ధర రూ.7,005 పలికింది. కాలం మారినా ధరలు మాత్రం పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.