Telangana

News June 7, 2024

మహబూబాబాద్: వివాహం చేసుకున్న ఇద్దరు మహిళలు!

image

MHBD జిల్లా కొత్తగూడ మండలంలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వివాహిత మహిళలు గ్రామం నుంచి ఇటీవల పారిపోయారు. వారు వివాహం చేసుకుని భద్రాద్రి జిల్లా గుండాల(M) లోని ఓ గ్రామంలో రహస్యంగా జీవించారు. వీరిలో ఒక వివాహిత ప్యాంటు, షర్టు ధరిస్తూ పురుషుడిలా నమ్మించేది. వీరి కోసం వారి బంధువులు గాలించి చివరకు గుండాల వద్ద బుధవారం పట్టుకుని గురువారం గ్రామానికి తీసుకొచ్చారు. స్థానిక మహిళలు దేహశుద్ధి చేసినట్లు సమాచారం.

News June 7, 2024

HYD: ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు 

image

HYD నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని డా.నందమూరి తారక రామారావు కళామందిరంలో సంస్థ అధ్యక్షురాలు డా.దేవసేన నిర్వహణలో సాంస్కృతిక సంస్థ సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ 42వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.  డా.దేవసేన 42 ఏళ్లుగా సాంస్కృతిక రంగానికి నిర్విరామ సేవలను చేస్తున్నారని కొనియాడారు. ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

NGKL: వాట్సాప్ గొడవ .. ఇద్దరు యువకుల హత్య

image

కడ్తాల్ మండలం గోవిందాయపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఇద్దరు యువకులు హత్యకు గురైన విషయం తెలిసిందే. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివ (27) కారు డ్రైవర్. గుండెమోని శివ (25) HYDలో పనిచేస్తుండేవాడు. గ్రామానికి చెందిన రవి ఈ నెల 4న పుట్టినరోజు కావడంతో వేడుకలు జరుపుకున్నాడు. ఆ ఫోటోలను వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు.. వాటిని వీరు డిలీట్ చేశారు. రవి మిత్రులతో కలిసి ఇద్దరినీ హత్య చేశారు.

News June 7, 2024

మెదక్: పెళ్లికి అడ్డుచెప్పారని సూసైడ్

image

ప్రేమజంట <<13393123>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. వివరాలిలా.. మృతుడి సోదరులు ఒకే ఇంటి నుంచి అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నారు. వదిన చెల్లెలిని ప్రేమించిన సదానందం.. ఆ యువతినే పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఒకే కుటుంబం నుంచి ఒకే ఇంటికి ముగ్గురు కోడళ్లుగా వెళ్లడం మంచిది కాదని భావించి పెళ్లికి నిరాకరించారు. దీంతో వారిద్దరు నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.

News June 7, 2024

HYD: పోలీసులను చూసి పారిపోతూ వ్యక్తి మృతి

image

HYD తార్నాకలోని లాలాగూడ PS పరిధిలో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లాలాపేట్‌లో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా ఆడుతున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దీంతో పోలీసులను చూసిన వినయ్ అనే వ్యక్తి పారిపోతూ మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి మృతిచెందాడు. అయితే టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొట్టడంతో తట్టుకోలేక బిల్డింగ్ పై నుంచి దూకాడని ఆరోపిస్తూ అతడి స్నేహితులు ఆందోళనకు దిగారు.

KMM-NLG-WGL: గెలుపు కోసం 1,55,095 ఓట్లు..!

image

రెండు రోజులుగా కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. KMM-NLG-WGL ఉపఎన్నిక కౌంటింగ్‌లో ఎవరికి గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు రావాల్సి ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,22,813 ఓట్లు, BRS అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,246 ఓట్లు, BJP అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 29,697 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.

బీజేపీలో బండి తనదైన మార్క్!

image

కరీంనగర్ నుంచి పలువురు కీలక నేతలు రాజకీయాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. కేంద్రంలో తిరిగి అధికారంలోకి రాబోతున్న BJPలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్‌ రెండోసారి కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నికయ్యారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి పార్టీలో కొత్త ఉత్తేజం తీసుకురావడంలోనూ కీలకంగా వ్యవహరించారు. మొదట్లో కార్పొరేటర్‌గా, అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌గా కొనసాగారు.