Telangana

News June 7, 2024

KMM-NLG-WGL: 25,854 చెల్లని ఓట్లు

image

KMM-NLG-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 3,36,013 పోలవగా అందులో చెల్లని ఓట్లు 25,854 ఉండటం విశేషం. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీపడగా చెల్లని ఓట్ల సంఖ్య 5వ స్థానంలో నిలిచింది. డిగ్రీలు చదివిన ఓటర్లు ఇలా ఓటును దుర్వినియోగం చేయడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.

News June 7, 2024

HYD: మీ పిల్లల దుస్తులు కుడుతున్నాం అనుకుని కుట్టాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏడాది పాటు మన్నికగా ఉండేలా.. మీ పిల్లలకు దుస్తులు కడుతున్నాం అనుకుని కుట్టాలని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఈ మేరకు ముషీరాబాద్ రాంనగర్ మేడిబాయి బస్తీలోని మహ్మదీయ, శ్రీలక్ష్మి, శ్రీవినాయక, మల్లికార్జున సహాయక బృందాల బట్టలు కుట్టే కేంద్రాలను సందర్శించి యూనిఫామ్ కుట్టే ప్రక్రియను పరిశీలించారు. యూనిఫాం కుడుతున్న మహిళలతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు.

HYD: వరద నీటి నివారణపై ప్రత్యేక దృష్టి: రోనాల్డ్‌ రాస్‌

image

గ్రేటర్‌ HYDలో వరద నీటి నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం శేరిలింగంపల్లి జోన్‌ మాదాపూర్‌ సర్కిల్‌లో జోనల్‌ కమిషనర్‌ స్నేహ శబరీష్‌తో కలిసి కమిషనర్‌ మాదాపూర్‌ బాటా షోరూం, యశోద దవాఖాన, శిల్పారామం తదితర ప్రాంతాల్లో వాటర్‌ స్టాగ్నేషన్‌ పాయింట్లను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు.

MBNR: జిల్లాలో జోరుగా కురిసిన వాన

image

ఉమ్మడి జిల్లాలో గురువారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. నైరుతి రుతు పవనాల రాక తర్వాత కురిసిన ఓ మోస్తరు వర్షం ఇదే. ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. వాతావరణం పూర్తిగా చల్లబడింది. అరగంట పాటు ఎడ తెరపి లేకుండా కురిసిన వానకు జనం ఇబ్బందులు పడ్డారు. వర్షంలోనే వాహనాల హెడ్ లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు.

News June 7, 2024

ఐసెట్‌కు 90.47% మంది విద్యార్థులు హాజరు: కన్వీనర్

image

టీజీ ఐసెట్ ప్రశాంతంగా జరిగినట్టు ఐసెట్ కన్వీనర్ నరసింహాచారి తెలిపారు. గురువారం ఉదయం జరిగిన మూడో సెషన్‌లో 28,256 మంది విద్యార్థులకు గాను 25,662 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. ఈ నెల 5 ,6న మూడు సెషన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 116 రీజియన్ సెంటర్లలో 86,156 మంది విద్యార్థులకు గాను 77,942 (90.47%) మంది హాజరయ్యారని పేర్కొన్నారు.

News June 7, 2024

KMM-NLG-WGL: 25,854 చెల్లని ఓట్లు

image

KMM-NLG-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 3,36,013 పోలవగా అందులో చెల్లని ఓట్లు 25,854 ఉండటం విశేషం. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీపడగా చెల్లని ఓట్ల సంఖ్య 5వ స్థానంలో నిలిచింది. డిగ్రీలు చదివిన ఓటర్లు ఇలా ఓటును దుర్వినియోగం చేయడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.

News June 7, 2024

నిర్మల్: పిడుగు పడి బాలుడు మృతి

image

పిడుగు పడి బాలుడు మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఎల్వత్ గ్రామానికి చెందిన మగీర్వాడ్ శ్రీ (10) గురువారం పిడుగు పాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. శ్రీ ఉదయం మేకలు మేపడానికి వెళ్లాడు. మద్యాహ్నం కురిసిన వర్షానికి పిడుగు పడటంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. తండ్రి సాయినాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News June 7, 2024

KMM-NLG-WGL: 25,854 చెల్లని ఓట్లు

image

KMM-NLG-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 3,36,013 పోలవగా అందులో చెల్లని ఓట్లు 25,854 ఉండటం విశేషం.
మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీపడగా చెల్లని ఓట్ల సంఖ్య 5వ స్థానంలో నిలిచింది. డిగ్రీలు చదివిన ఓటర్లు ఇలా ఓటును దుర్వినియోగం చేయడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.