Telangana

News June 6, 2024

NLG: రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపు నాదే: తీన్మార్ మల్లన్న

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లే కొంపముంచుతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. కొద్దిసేపటి క్రితం కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండో ప్రాధాన్యత ఓట్లతో కచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

News June 6, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోనరావుపేట మండలంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.
@ మల్లాపూర్ మండలంలో పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య.
@ ముత్తారం మండలంలో 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.
@ మెట్‌పల్లి మండలంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్.
@ సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం.
@ మహదేవ్పూర్ మండలంలో విద్యుత్ షాక్‌తో 3 పశువులు మృతి.
@ చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు.

News June 6, 2024

NLG: రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపు నాదే: తీన్మార్ మల్లన్న

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లే కొంపముంచుతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. కొద్దిసేపటి క్రితం కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండో ప్రాధాన్యత ఓట్లతో కచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

News June 6, 2024

ఇంద్రవెల్లి: పిడుగుపాటుతో భార్యాభర్తలు మృతి

image

పిడుగుపాటుకు గురై భార్యాభర్తలు మృతి చెందిన ఘటన ఇంద్రవెల్లి మండలంలోని దొంగర్గావ్ శివారులో జరిగింది. గ్రామానికి చెందిన స్వప్న, సంతోష్ భార్యాభర్తలు. గురువారం సాయంత్రం పొలానికి వెళ్లారు. ఈదురు గాలులతో భారీ వర్షం రావడంతో అక్కడే ఉన్న చిన్న గుడిసెలో తలదాచుకున్నారు. ఆ సమయంలో పిడుగు పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.

News June 6, 2024

హైదరాబాద్‌లో వరద నివారణపై ఫోకస్

image

వర్షాకాల నేపథ్యంలో నగరంలో వరద నీటి నివారణపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన చర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. శేరిలింగంపల్లి జోన్ మాదాపూర్ సర్కిల్లోని బాటా షోరూం, యశోద హాస్పిటల్, శిల్పారామం, తదితర ప్రాంతాలలో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్‌తో కలిసి పరిశీలించారు. వరద నీరు నిలువకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కమిషనర్ సూచించారు.

తిప్పర్తి: మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై ఫిర్యాదు

image

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై ARO కె. వెంకటేశ్వర్లు తిప్పర్తి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా దుప్పలపల్లి గోడౌన్‌లో విధులు నిర్వహిస్తుండగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బ్యాలెట్ పేపర్ చూపించాలని బెదిరించారన్నారు. తన విధులకు ఆటంకం కలిగించినందుకు మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News June 6, 2024

న్యాల్కల్: మంజీరా నదిలో ప్రేమ జంట ఆత్మహత్య

image

పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం న్యాల్కల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. కాకి జనవాడకు చెందిన బావ, మరదలు సదానందం(24), ఉమ(20) ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఫుల్ కుర్తి వద్ద మంజీర నదిలో ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, ఘటనా స్థలంలో మృతుల బైకు, సెల్ ఫోన్లను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేశారు.

News June 6, 2024

పదేళ్ల తర్వాత జహీరబాద్‌లో కాంగ్రెస్ ఘన విజయం

image

ZHB లోక్ సభ స్థానంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎంపీగా సురేశ్ షెట్కార్ భారీ మెజార్టీతో జయ కేతనం ఎగురవేశారు. 2009లో సురేశ్ షెట్కార్ విజయం సాధించారు. ఆ తర్వాత బీబీ పాటిల్ వరుసగా రెండు సార్లు ఎంపీ అయ్యారు. పదేళ్ల తర్వాత అదే స్థానం నుంచి షెట్కార్ MLA టికెట్‌ను త్యాగం చేసి కాంగ్రెస్ MP అభ్యర్థిగా రంగంలో దిగి విజయం సాధించారు.

News June 6, 2024

నల్గొండ: పారదర్శకంగా ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలి: రాకేశ్‌రెడ్డి

image

ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ ఎన్నికల కౌంటింగ్ వద్ద ఆయన మాట్లాడుతూ.. తాము గెలుస్తామని, తమ గెలుపును ఆపాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. పారదర్శకంగా ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలన్నారు. గెలుపు, ఓటములను స్వీకరిస్తామని అన్నారు. రెండవ ప్రాధాన్యత ఓట్లతో గెలుస్తామని నమ్మకముందన్నారు.