Telangana

News June 6, 2024

KNR: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని కాపాడిన సీఐ

image

ఓ ఫోన్ కాల్ సమాచారంతో గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న ఓ యువతి ప్రాణాలను కాపాడారు. గొడవలతో మనస్తాపానికి గురైన యువతి తన స్కూటీపై గోదావరి నది వద్దకు నిన్న రాత్రి వెళ్లింది. విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి సదరు యువతి ఫోన్ లొకేషన్ ద్వారా గోదావరి బ్రిడ్జి వద్దకు వెళ్లి యువతిని కాపాడారు. కుటుంబ సభ్యులను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించారు.

News June 6, 2024

శివంపేట: కోర్టు ధిక్కరణ.. DSP, SIకి జరిమానా

image

కోర్టు ధిక్కరణకు పాల్పడిన DSP, SIలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. సికింద్లాపూర్ గ్రామంలోని భూవివాదంలో భూయజమాని కర్ణాకర్ కోర్టును ఆశ్రయించారు. అందుకు సంబంధించి గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు మళ్లీ కోర్టుకు వెళ్లారు. దీంతో అప్పటి తూప్రాన్ DSP యాదగిరి రెడ్డి, SI రవి కాంతారావుకు చెరో రూ.2000 ఫైన్ విధించారు.

News June 6, 2024

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగో రౌండ్ ఓట్లను లెక్కిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం ఐదు గంటల వరకు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావచ్చని తెలిపారు. తొలి ప్రాధాన్యత ఓట్లతో గెలుపు కాని పక్షాన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేయనున్నట్లు తెలిపారు.

News June 6, 2024

ఖమ్మం: రెచ్చిపోతున్న హిజ్రాలు..

image

ఖమ్మం జిల్లాలో హిజ్రాలు రెచ్చిపోతున్నారు. సత్తుపల్లి మండలం సత్యంపేట – రుద్రాక్షపల్లి రహదారిపై వచ్చే పోయే వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే కదలనివ్వకుండా నడిరోడ్డులో ఆపుతున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

News June 6, 2024

MBNR: ఇద్దరు యువకుల దారుణ హత్య

image

ఉమ్మడి పాలమూరు జిల్లా కడ్తాల్‌ శివారులో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక బట్టర్ ఫ్లై సిటీలో ఇద్దరు యువకులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతులు కడ్తాల్ మండలం గోవిందాయిపల్లికి చెందిన శేషిగారి శివ(24), గుండెమోని శివ(29)గా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని కడ్తాల్ పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు. 

News June 6, 2024

అమెరికాకు కోమటిరెడ్డి 

image

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు అమెరికా వెళ్తున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంతో పాటు మంత్రి అమెరికాలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరు రోజులపాటు జరిగే కార్యక్రమాలలో పాల్గొని మంత్రి అనంతరం తిరిగి తెలంగాణ రాష్ట్రానికి చేరుకుంటారు.

News June 6, 2024

HYD: ఇద్దరు యువకుల దారుణ హత్య

image

HYD శివారు కడ్తాల్‌ శివారులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు యువకులను దారుణ హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న కడ్తాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న విచారణ చేపట్టారు. మృతులు కడ్తాల్ మండలం గోవిందాయిపల్లికి చెందినవారిగా గుర్తించారు.

News June 6, 2024

HYD: ఇద్దరు యువకుల దారుణ హత్య

image

HYD శివారు కడ్తాల్‌ శివారులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు యువకులను దారుణ హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న కడ్తాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న విచారణ చేపట్టారు. మృతులు కడ్తాల్ మండలం గోవిందాయిపల్లికి చెందినవారిగా గుర్తించారు. 

News June 6, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం క్రింది విధంగా వర్షపాతం వివరాలు నమోదయ్యాయి. అత్యధికంగా గద్వాల జిల్లా అలంపూర్‌లో 103.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 77.0 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లో 48.5 మి.మీ, వనపర్తి జిల్లా రేవల్లిలో 30.0 మి.మీ, నారాయణపేట జిల్లా చిన్నజట్రంలో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 6, 2024

గద్వాల: పరీక్ష ఫీజు చెల్లించండి

image

గద్వాల: పాలమూరు యూనివర్శిటీ పరిధిలోని 2010-11 నుంచి 2015-2016 విద్య సంవత్సరంలో డిగ్రీలో అడ్మిషన్ పొందిన విద్యా ర్థులు, బ్యాక్ లాగ్ పరీక్ష ఫీజు చెల్లించాలని గద్వాల డీగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ కలందర్ బాష తెలిపారు. ఫీజు చెల్లించడానికి ఈనెల 10వ తేదీ చివరి గడువు అని పేర్కొన్నారు. అపరాధ రుసుం రూ.200తో చెల్లించేందుకు ఆవకాశం ఉందని తెలిపారు.