Telangana

News June 6, 2024

ZHB: ఆరుగురికి ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు

image

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో 19 మంది పోటీచేశారు. ఇందులో 10 మంది స్వతంత్రులే. వీరిలో ఎవరికీ 6వేల ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం. ఏడు నియోజకవర్గాల్లో 12,25,049 ఓట్లు పోలయ్యాయి. ఇందులో స్వతంత్రులకు 31,079 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నోటాకు 2,933 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన 10 మందిలో ఆరుగురికి నోటా కంటే తక్కువ వచ్చాయి.

News June 6, 2024

లైంగిక దాడి కేసులో 14 రోజుల రిమాండ్

image

లైంగిక దాడి కేసులో HZNR కోర్టు ఇద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు. ఓ గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలిపై సంవత్సరం క్రితం ఒకరు, 10 రోజుల క్రితం మరొకరు లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు. నిందితులు రాములు, యాదగిరిని అరెస్ట్ చేసి HZNR కోర్టులో హాజరుపర్చగా.. వారిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.

News June 6, 2024

కాజీపేటలో హత్య.. మహిళ వివరాలు

image

బుధవారం కాజీపేటలో మహిళ <<13387500>>హత్యకు <<>>గురైన విషయం తెలిసిందే. మృతదేహం పక్కన ఉన్న ఆధారాలను బట్టి మహిళ దర్గాకాజీపేటలోని లావుడ్యా తండాకు చెందిన లావుడ్యా కుమార్ భార్య యామిని ఆలియాస్ కుమారి(33)గా పోలీసులు గుర్తించారు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ఇక్కడకు ఎందుకు వచ్చిందో.. ఎవరు హత్య చేశారు అనే వివరాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని MGMకి తరలించారు.

News June 6, 2024

MLC కౌంటింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్‌కు తేలుకాటు

image

నల్గొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి MLC కౌంటింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్‌ తేలుకాటుకు గురైంది. మీడియా సెంటర్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆమెను బుధవారం రాత్రి తేలుకాటు వేసింది. అక్కడున్న సిబ్బంది 108 వాహనంలో చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News June 6, 2024

NLG: నేటి నుంచి బడిబాట షురూ..!

image

జిల్లాలో నుంచి నేటి ఈ నెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా విద్యా శాఖ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈనెల 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించేందుకు జయశంకర్ బడిబాట పేరుతో ఈ కార్యక్రమానికి విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు.

News June 6, 2024

వనపర్తి: ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్

image

పెబ్బేరులో రాజేందర్ గౌడ్‌పై హత్యాయత్నం కేసుకు పోలీసులు ఛేదించారు. SI హరిప్రసాద్ రెడ్డి వివరాలు.. రాజేందర్‌, భార్య ప్రత్యూషతో కలిసి ఓ స్కూల్ నిర్వహిస్తున్నారు. స్కూల్ PET మహేశ్‌‌తో ప్రత్యుషకు వివాహేత సంబంధం ఉన్నట్లు గుర్తించిన రాజేందర్ పలుమార్లు హెచ్చరించారు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి రాజేందర్ హత్యకు ఈనెల 1న ప్లాన్ చేయగా బెడిసికొట్టింది. నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు.

News June 6, 2024

నిజామాబాద్: అంచనాలకు మించి BJP జోరు

image

నిజామాబాద్ పార్లమెంట్‌లో BJPకి విశ్లేషకుల అంచనాలకు మించి ఓట్లు పోలయ్యాయి. గత ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి 4.80 లక్షలు ఓట్లు రాగా.. ఈసారి 5.92 లక్షల ఓట్లు వచ్చాయి. NZB రూరల్, కోరుట్ల, బాల్కొండ నియోజకవర్గాల్లో 15 వేల నుంచి 20 వేల మెజార్టీ వస్తుందని లెక్కలు కట్టారు. కాని రూరల్ 44వేలు, కోరుట్లలో 33వేలు, బాల్కొండలో 32 వేలు మెజార్టీ దక్కటం గమనార్హం. 7 అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు సాధించడంతో BJP జోరు సాగింది.

News June 6, 2024

ADB: బీఆర్ఎస్ అభ్యర్థికి 29 కేంద్రాల్లో సింగిల్ డిజిట్ ఓట్లు

image

ఆదిలాబాద్ ఎంపీగా BJP అభ్యర్థి గోడెం నగేశ్ గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు 29 పోలింగ్ కేంద్రాల్లో సింగిల్ డిజిట్ ఓట్లు వచ్చాయి. మెుత్తంగా బీఆర్ఎస్‌కు 161 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి నగేశ్ కు 3 కేంద్రాల్లో, కాంగ్రెస్ అభ్యర్థి సుగుణకు ఒక కేంద్రంలో మాత్రమే సింగిల్ డిజిట్ ఓట్లు వచ్చాయి. ఆమెకు మాన్కాపూర్ (202)లో 5 ఓట్లు వచ్చాయి.

News June 6, 2024

మెదక్ జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరి మృతి

image

మెదక్ జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మరణించారు. హవేలిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం మల్లన్న గుట్ట ప్రాంతంలో పిడుగు పడింది. దీంతో గ్రామానికి చెందిన శెట్టబోయిన సిద్దయ్య( 50), ఓడంగల నందు(22)లు మృత్యువాత పడ్డారు. అడవిలోకి వెళ్లిన వీరి కోసం నిన్న సాయంత్రం నుంచి కుటుంబీకులు పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఉదయం అడవిలోకి వెళ్లిన వారికి ఇద్దరు చనిపోయి కనిపించారు.

News June 6, 2024

HYD: 8న చేప ప్రసాదం పంపిణీ

image

మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబం ఈ నెల 8న అందించే చేప మందు ప్రసాదం పంపిణీకి ఆర్‌అండ్‌బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కౌంటర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో క్యూలైన్‌ల కోసం బారికేడ్‌లు, విద్యుద్దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి పనులను చేపట్టారు.