Telangana

News September 17, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవం వేడుకలు
> ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా గణేశుని నిమజ్జనాలు
> నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం
> నేడు సత్తుపల్లి మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
> నేడు అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన
> నేడు కారేపల్లిలో పర్యటించనున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్
> భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

News September 17, 2024

నిమజ్జన ప్రాంతాలను పర్యవేక్షించిన KNR కలెక్టర్

image

మానకొండూర్, కొత్తపల్లి, చింతకుంటలో గణేశ్ నిమజ్జన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం రాత్రి పరిశీలించారు. ఇప్పటివరకు నిమజ్జనం అయిన విగ్రహాల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరం, సీసీ కెమెరాలను పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు.

News September 17, 2024

కామారెడ్డిలో రికార్డు స్థాయి ధర పలికిన లడ్డూ

image

కామారెడ్డిలో వినాయకునికి లడ్డూ రికార్డు ధర పలికింది. కామారెడ్డి హౌసింగ్ బోర్డులోని సంకష్ఠ గణపతి దేవాలయంలో నిర్వాహకులు లడ్డూ వేలం పాట నిర్వహించారు. కాగా జీఆర్ఎల్ సంస్థ ప్రతినిధి సంతోష్ రూ.2.79 లక్షలకు లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నారు.

News September 17, 2024

దద్దరిల్లుతున్న హైదరాబాద్

image

వినాయక నిమజ్జనాలు, భారీ జులూస్‌లతో హైదరాబాద్ దద్దరిల్లుతోంది. వేలాది విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు క్యూ కట్టాయి. మరికాసేపట్లో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి భారీ శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, LED లైట్ల నడుమ యువత కేరింతలు కొడుతున్నారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కి జై’ నినాదంతో HYD హోరెత్తింది.

News September 17, 2024

దద్దరిల్లుతున్న హైదరాబాద్

image

వినాయక నిమజ్జనాలు, భారీ జులూస్‌లతో హైదరాబాద్ దద్దరిల్లుతోంది. వేలాది విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు క్యూ కట్టాయి. మరికాసేపట్లో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి భారీ శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, LED లైట్ల నడుమ యువత కేరింతలు కొడుతున్నారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కి జై’ నినాదంతో HYD హోరెత్తింది.

News September 17, 2024

గత ప్రభుత్వం ఇచ్చింది 49 వేలు కార్డులు మాత్రమే: పొంగులేటి

image

ఖమ్మం: గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది కేవలం 49 వేల రేషన్ కార్డులు మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను మంజూరు చేస్తుందని చెప్పారు. దాదాపు 90 లక్షల కార్డులు ఇప్పుడు ఉన్నాయని, వాటిని బైఫరికేషన్ చేసి, స్మార్ట్ కార్డులు ఇస్తామని, ప్రతీ పేదవాడికి కార్డులు అందించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

News September 17, 2024

NRPT: 250 మంది పోలీసులతో బందోబస్తు

image

నారాయణపేట జిల్లా కేంద్రంలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే గణేశ్ శోభాయాత్రకు 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. గణేశ్ మార్గ్‌లో సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి సమీక్ష చేస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని వచ్చే వాహనాలను ఇతర మార్గాల ద్వారా డైవర్ట్ చేశామని అన్నారు. ప్రధాన కూడళ్లలో పోలీస్ పీకేటింగ్ ఏర్పాటు చేశామన్నారు.

News September 17, 2024

కరీంనగర్‌లో జాతీయ జెండా ఆవిష్కరించనున్న మంత్రి

image

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో మంత్రి శ్రీధర్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద మంత్రి నివాళులు అర్పించి తర్వాత జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

News September 17, 2024

హనుమకొండ: జాతీయ జెండా ఎగురవేయనున్న కొండా సురేఖ

image

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా మంగళవారం హాజరవుతున్నారు. నేడు ఉదయం 9:48 నిమిషాలకు అదాలత్ కూడలిలోని అమరవీరుల స్తూపానికి పూలతో అంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 10 గంటలకు హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకొని జాతీయ జెండా ఎగరవేస్తారు.

News September 17, 2024

HYD విలీనమా.. విమోచనమా.. విద్రోహమా?

image

‘ఆపరేషన్ పోలో’లో భాగంగా 1948-09-17న హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైంది. ఇది జరిగి 76 ఏళ్లు పూర్తయినా ప్రతి ఏడాది కొత్త చర్చనే. విలీనమంటూ INC, సమైక్యత అని BRS-MIM, విమోచనమని BJP, సాయుధ పోరాటమని కమ్యూనిస్టులు, విద్రోహమని నిజాం పాలకుల మద్దతుదారులు వాదిస్తున్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాల మధ్య ‘SEP 17’ రాజకీయ బల ప్రదర్శనకు వేదికవుతోంది. ఈ వ్యవహారంలో మీ మద్దతు ఏ పార్టీకి ఇస్తారు..? కామెంట్ చేయండి.