Telangana

News June 5, 2024

NZB: అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

image

నగరంలోని గాజుల్ పేట్ రామ మందిర్ ప్రాంతానికి చెందిన నారాయణ(22) ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్రెడిట్ కార్డు తీసుకుని దాని ద్వారా డబ్బులను డ్రా చేసి వాడుకున్నాడు. డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో రెండు రోజుల క్రితం క్రెడిట్ కార్డు రికవరీ టీం ఇంటికి వచ్చి బెదిరించినట్లు 2 టౌన్ ఎస్ఐ రాము తెలిపారు. దీంతో మనస్తాపం చెందిన నారాయణ తన ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

News June 5, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✔మహబూబ్‌నగర్‌లో ఓటమికి బాధ్యత నాదే: సీఎం రేవంత్ రెడ్డి
✔సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డి తప్పుకోవాలి:DK అరుణ
✔సీసీకుంట: ఊయల చీర బిగుసుకొని చిన్నారి మృతి
✔CM రేవంత్ రెడ్డిని కలిసిన మల్లు రవి
✔BRSలో చేరినందుకు గర్వంగా ఉంది: ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్
✔ఆయా జిల్లాలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు
✔విద్యార్థుల యూనిఫామ్ పంపిణీపై అధికారుల ప్రత్యేక ఫోకస్

News June 5, 2024

కరీంనగర్: ఒకరికి మోదం.. ఒకరికి ఖేదం!

image

MP ఎన్నికల ఫలితాలు ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ నేతలకు మిశ్రమ స్పందనను మిగిల్చాయి. కరీంనగర్, పెద్దపల్లి కాంగ్రెస్ ఇన్చార్జిలుగా వ్యవహరించిన మంత్రులు అభ్యర్థుల గెలుపు కోసం శాయశక్తుల కృషి చేశారు. అయితే పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుపొందడంతో జిల్లాలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి విజయానికి చేసిన కృషి ఫలించలేదు.

News June 5, 2024

వరంగల్: యువతి దారుణహత్య

image

HNK జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాజీపేట మం.లో యువతి దారుణహత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల శివారులోని అమ్మవారిపేటలోని సాయినాథ్ రియల్ ఎస్టేట్ వెంచర్(భట్టుపల్లి నుంచి ఉర్సుగుట్ట వెళ్లే దారి)లో సుమారు 30ఏళ్ల యువతి హత్యకు గురైంది. యువతి ముఖంపై బండరాళ్లతో కొట్టి చంపిన ఆనవాళ్లు ఉన్నాయి. స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలపడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

News June 5, 2024

తొలి మహిళా ఎంపీగా డీకే అరుణ రికార్డు

image

డీకే అరుణ MBNR తొలి మహిళా MPగా రికార్డు సృష్టించారు. సమీప అభ్యర్థి చల్లా వంశీపై కేవలం 4500 (0.37%) ఓట్ల తేడాతో గెలుపొందారు. రాష్ట్రంలో ఇదే అత్యల్ప మెజార్టీ. ఇక్కడ 1952 నుంచి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా.. రామేశ్వర్ రావు, మల్లికార్జున్ గౌడ్ 4సార్లు, ఎస్. జైపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి 2సార్లు, జనార్దన్ రెడ్డి, ముత్యాల్ రావు, విఠల్ రావు, KCR, మన్నె శ్రీనివాస్ రెడ్డి ఒక్కోసారి MPగా గెలిచారు.

News June 5, 2024

‘నల్గొండలో ఇప్పటికీ BRS గెలవలే’

image

తెలంగాణ ఏర్పాడ్డాక జరిగిన ఎన్నికల(2014)లో నల్గొండ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన గుత్తా గెలిచారు. 2019లో ఉత్తమ్ కుమార్ రెడ్డి (INC) పోటీ చేసి విజయం సాధించారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో కుందూరు రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు బావుట ఎగురవేశారు. దీంతో నల్గొండ ఎంపీ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఖాతా తెరవని స్థానంగా ఉంది.

News June 5, 2024

చిన్న శంకరంపేట: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధ భరించలేక యువరైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిన్న శంకరంపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నారాయణ వివరాలు.. మండలానికి చెందిన దడువాయి పరమేశ్వర్ (38) అనే రైతు వ్యవసాయం చేసుకొని జీవిస్తూ ఉంటాడు. కుటుంబ అవసరాల నిమిత్తం అతడు అప్పులు చేశారు. డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. మనస్తాపం చెందిన పరమేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

News June 5, 2024

దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలనే మోడీకి ఓటేశారు: ఈటల

image

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కారం. దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలన్నా.. ఆత్మగౌరవం నిలబడాలన్నా మోదీకే మా ఓటు అని ప్రజలు వేశారని అన్నారు. అసెంబ్లీలో 15 శాతం ఉన్న ఓటు బ్యాంక్ 35కి పెరిగింది’ అని అన్నారు.  

News June 5, 2024

మేడిగడ్డ బ్యారేజ్ వద్ద భూపరీక్షలు

image

మేడిగడ్డ బ్యారేజ్‌లో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు భూపరీక్షలు ప్రారంభించారు. బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన మట్టి, మెటీరియల్ నమూనాలను సేకరిస్తున్నారు. బ్యారేజ్ కుంగిన పిల్లర్ల వద్ద 25 ఫీట్ల మేర డ్రిల్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. భూభౌతిక, భూ సాంకేతిక పరీక్షలను నిపుణులు పర్యవేక్షిస్తున్నారు.

News June 5, 2024

మేడిగడ్డ బ్యారేజ్ వద్ద భూపరీక్షలు

image

మేడిగడ్డ బ్యారేజ్‌లో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు భూపరీక్షలు ప్రారంభించారు. బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన మట్టి, మెటీరియల్ నమూనాలను సేకరిస్తున్నారు. బ్యారేజ్ కుంగిన పిల్లర్ల వద్ద 25 ఫీట్ల మేర డ్రిల్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. భూభౌతిక, భూ సాంకేతిక పరీక్షలను నిపుణులు పర్యవేక్షిస్తున్నారు.