Telangana

News June 5, 2024

చొప్పదండి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం!

image

చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం జన్మదిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక లేఖను విడుదల చేశారు. మేడిపల్లి సత్యం ప్రజాసేవలో నిమగ్నమై నియోజకవర్గ అభివృద్ధి కృషి చేయాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

News June 5, 2024

పవన్ కళ్యాణ్‌కు కలిసొచ్చిన కొండగట్టు సెంటిమెంట్!

image

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ సక్సెస్ అవ్వడంతో కొండగట్టు అంజన్న సెంటిమెంట్ కలిసొచ్చిందని ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకొని ‘వారాహి’ వాహనానికి పూజలు చేయించారు. దీంతో ఆంజనేయస్వామి ఆశీస్సులు పవన్‌పై మెండుగా ఉన్నాయని, అంజన్న సెంటిమెంట్ కలిసొచ్చిందని అభిమానులు అంటున్నారు.

News June 5, 2024

సంగారెడ్డిలో భారీ వర్షం

image

జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. గంట నుంచి కురుస్తున్న వర్షం సంగారెడ్డిలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. జిన్నారం మండల పరిధిలోని జంగంపేట్, మంగంపేట్, వావిలాల, ఊట్ల, రాళ్లకత్వ, శివనగర్, కొడగంచి, దాదిగూడెం, కొర్లకుంట, మంత్రి కుంట తదితర గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమం అయ్యాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

News June 5, 2024

ఎమ్మెల్సీ కౌంటింగ్.. తీన్మార్ మల్లన్న ముందంజ..!

image

ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తరువాత స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. మొదటి ప్రాధాన్యత ఓట్లు రాకేష్ రెడ్డికి పెద్ద ఎత్తున పోల్ అయినప్పటికీ అవి చెల్లుబాటు కాలేదు. దీంతో రాకేష్ రెడ్డి కాస్త వెనుకబడినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News June 5, 2024

ఎమ్మెల్సీ కౌంటింగ్.. తీన్మార్ మల్లన్న ముందంజ..!

image

ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తరువాత స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డికి పెద్ద ఎత్తున పోల్ అయినప్పటికీ అవి చెల్లుబాటు కాలేదు. దీంతో రాకేష్ రెడ్డి కాస్త వెనుకబడినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News June 5, 2024

ఎమ్మెల్సీ కౌంటింగ్.. తీన్మార్ మల్లన్న ముందంజ..!

image

ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తరువాత స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. మొదటి ప్రాధాన్యత ఓట్లు రాకేష్ రెడ్డికి పెద్ద ఎత్తున పోల్ అయినప్పటికీ అవి చెల్లుబాటు కాలేదు. దీంతో రాకేష్ రెడ్డి కాస్త వెనుకబడినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News June 5, 2024

జగిత్యాల: బస్సు కింద పడి బాలుడు మృతి

image

బస్సు కింద పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మోరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలుడు(4) ఇంటి నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చాడు. ఈ క్రమంలో జగిత్యాల నుంచి కొత్తపేటకు వెళ్తున్న బస్సు కింద పడటంతో నుజ్జునుజ్జుయి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 5, 2024

మహబూబ్‌నగర్‌లో ఓటమికి బాధ్యత నాదే: సీఎం రేవంత్

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా MBNR ఫలితంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తాను జిల్లాకు ముఖ్యమంత్రిని కాదు రాష్ట్రానికి అని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో గెలుపు ఓటములకు తానే బాధ్యుడిని అని చెప్పారు. ముఖ్యంగా సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ ఫలితానికి తానే బాధ్యత వహిస్తానని అన్నారు

News June 5, 2024

ఉమ్మడి జిల్లాలో సగం మంది పాలకులు మహిళలే

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సగం మంది మహిళ ప్రజాప్రతినిధులు, అధికారులే పాలన కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే వారు మహిళలే కావడం విశేషం. WGL, HNK, ములుగు జిల్లాల కలెక్టర్లు కూడా మహిళా IASలే. వరంగల్, MHBD, భూపాలపల్లి ZP ఛైర్మన్లుగా వారే ఉన్నారు. GWMC మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా ఉండగా.. తాజాగా నిన్న వరంగల్ ఎంపీగా కావ్య గెలిచారు. పాలకుర్తి MLAగా యశస్విని రెడ్డి ఉన్నారు.

News June 5, 2024

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై ఫైర్ అయిన ఎంపీ అర్వింద్

image

బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ ఎన్నికలో చిల్లర రాజకీయాలు చేశారని ఎంపీ అర్వింద్ ఫైర్ అయ్యారు. సుదర్శన్ రెడ్డి తన వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలన్నారు. ఆయన ఒక రాజకీయ అవకాశ వాది అని, లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టి వ్యాపారం చేసే సుదర్శన్ రెడ్డికి షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని సోయి లేదా అని ప్రశ్నించారు. సుదర్శన్ రెడ్డితో జిల్లా ప్రజలకు, బోధన్ నియోజకవర్గ ప్రజలకు నయా పైసా ఉపయోగంలేదన్నారు.