Telangana

News June 5, 2024

వరంగల్‌: ఇద్దరే మహిళ ఎంపీలు!

image

వరంగల్ లోక్‌సభ స్థానంలో ఇప్పటి వరకు ఇద్దరు మహిళలు మాత్రమే విజయం సాధించారు. 1984 సం.లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ నుంచి డాక్టర్ కల్పనాదేవి కాంగ్రెస్ అభ్యర్థి కమాలుద్దీన్ అహ్మద్‌పై గెలిచారు. మళ్లీ 2024లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ కడియం కావ్య బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌పై విజయం సాధించారు. వీరిద్దరూ డాక్టర్లు కావడం గమనార్హం.

News June 5, 2024

మల్కాజిగిరిలో BRSకు విచిత్ర పరిస్థితి..!

image

మల్కాజిగిరి MP స్థానంలో BRSకు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6సీట్లు, 2023లో 7కు 7 BRS క్లీన్ స్వీప్ చేసినప్పటికీ MPఎన్నికల్లో మాత్రం ఒక్కసారీ గెలవలేదు. ఇక్కడి ప్రజలు అసెంబ్లీకి BRSవైపే ఉంటున్నా MPకి మాత్రం వేరే పార్టీ వైపు చూస్తున్నారు. 2014 MPఎన్నికల్లో BRSఅభ్యర్థి మైనంపల్లి, 2019లో మర్రి రాజశేఖర్ రెడ్డి సెకెండ్ ప్లేస్‌లో ఉండగా ఈసారి రాగిడి థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు.

News June 5, 2024

సీఎం పదవి నుంచి రేవంత్ తప్పుకోవాలి: DK అరుణ

image

సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఫలితాలు రెఫరెండమని, తమకు 14 ఎంపీ సీట్లు వస్తాయని రేవంత్ అన్నారని గుర్తుచేశారు. మహబూబ్‌నగర్‌లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమికి స్థానిక కారణాలు ఉండొచ్చన్న ఆమె.. అభివృద్ధి జరగాలంటే కేంద్రంతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.

News June 5, 2024

ఖమ్మం: REWIND.. ఇలా గెలిచారు..

image

KMM-NLG-WGL పట్టభద్రుల MLC ఎన్నికల్లో 2021లో రెండో ప్రాధాన్య ఓట్లతోనే అప్పటి BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ స్థానంలో విజయం సాధించారు. మొత్తం 5,05,565 ఓట్లకు గానూ 3,87,960 ఓట్లు పోలయ్యాయి. రెండో ప్రాధాన్యతా ఓట్లతో పల్లా గెలిచారు. 4 రోజులపాటు జరిగిన లెక్కింపు అనంతరం అధికారులు విజేతను ప్రకటించారు. పల్లా రాజీనామాలతో ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే.

News June 5, 2024

సీఎంను కలిసిన మహిళా ప్రజాప్రతినిధులు

image

సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహిళ ప్రజా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కాసేపు సీఎంతో మహిళా నేతలు చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News June 5, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ సురేష్ శెట్కార్

image

సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ని జహీరాబాద్ ఎంపీగా గెలుపొందిన సురేష్ షేట్కార్ మర్యాదపూర్వకంగా కలిశారు. షేట్కార్‌ను రేవంత్ అభినందించారు. మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు, జహీరాబాద్ ఇంచార్జి చంద్రశేఖర్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్ పాల్గొన్నారు.

News June 5, 2024

మెదక్: బీఆర్ఎస్ నుంచి బీజేపీ ఖాతాలోకి..

image

మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఖాతా నుంచి BJP ఖాతాలోకి చేరిపోయింది. 2004 నుంచి 2019 వరకు రెండు దశాబ్దాలు మెదక్ బీఆర్ఎస్ MP అభ్యర్థులు దక్కించుకున్నారు. రాష్ట్రంలో మారిన అనూహ్య పరిణామాలతో బీఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆదరణకు దూరమైంది. కంచుకోటగా భావించిన సిద్దిపేటలోనూ బీఆర్ఎస్‌కు భారీ దెబ్బ తగిలింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ ఖాతా నుంచి బీజేపీలోకి వెళ్లింది.

News June 5, 2024

నిజామాబాద్ ప్రజలు గర్వించేలా పనిచేస్తా: ఎంపీ ధర్మపురి 

image

నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ధర్మపురి అరవింద్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో మరోసారి ఎంపీగా ఆశీర్వదించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిజామాబాద్ ప్రజలు గర్వించేలా పనిచేస్తానని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడుదామని కాంగ్రెస్ వాళ్లకు ఎంపీ ధర్మపురి అరవింద సవాల్ విసిరారు.

News June 5, 2024

కేంద్రాల వారీగా బండిల్స్ కట్టే కార్యక్రమం ప్రారంభం

image

వరంగల్ – ఖమ్మం -నల్లగొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ నల్గొండలో ప్రారంభం అయింది. ముందుగా పోలింగ్ కేంద్రాల వారీగా బండిల్స్ కట్టే కార్యక్రమం ప్రారంభం చేశారు. నాలుగు హాళ్లలో 96 టేబుల్స్ పై కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు బండిల్స్ కార్యక్రమం నిర్వహించి, ఆ తర్వాతే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

News June 5, 2024

HYD: అందెశ్రీని సన్మానించిన సీఎస్ శాంతికుమారి

image

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత డా.అందెశ్రీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని HYDలోని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా.అందెశ్రీని శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సీఎస్ సత్కరించారు. ఈ సందర్భంగా తాను రచించిన పలు పుస్తకాలను సీఎస్ శాంతి కుమారికి అందెశ్రీ అందజేశారు.