Telangana

News June 5, 2024

HYD: అందెశ్రీని సన్మానించిన సీఎస్ శాంతికుమారి

image

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత డా.అందెశ్రీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని HYDలోని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా.అందెశ్రీని శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సీఎస్ సత్కరించారు. ఈ సందర్భంగా తాను రచించిన పలు పుస్తకాలను సీఎస్ శాంతి కుమారికి అందెశ్రీ అందజేశారు.

News June 5, 2024

ప్రజాతీర్పును గౌరవిస్తున్నా: బీబీ పాటిల్

image

జహీరాబాద్ పార్లమెంట్ ఓటర్లకు బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై పై ఎంతో నమ్మకంతో రెండు సార్లు ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపించారన్నారు. తాను గెలిచిన నాటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశానన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నానని.. జహీరాబాద్ ప్రజల సంక్షేమానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు.

News June 5, 2024

BREAKING: HYD: యువతిని కత్తితో పొడిచిన యువకుడు

image

HYD దుండిగల్ PS పరిధిలోని గండిమైసమ్మ వద్ద ఈరోజు దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ యువతి కడుపులో యువకుడు కత్తితో పొడిచాడు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆమెపై కత్తితో దాడి చేయడమే కాకుండా అతడు ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో యువకుడిని స్థానిక అరుంధతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 5, 2024

BREAKING: HYD: యువతిని కత్తితో పొడిచిన యువకుడు

image

HYD దుండిగల్ PS పరిధిలోని గండిమైసమ్మ వద్ద ఈరోజు దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ యువతి కడుపులో యువకుడు కత్తితో పొడిచాడు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆమెపై కత్తితో దాడి చేయడమే కాకుండా అతడు ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో యువకుడిని స్థానిక అరుంధతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 5, 2024

MBNR, NGKLలో బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంకు

image

మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్ సభ పరిధిలో బీజేపీ అమాంతం తమ ఓటు బ్యాంకును పెంచుకుంది. MBNR లోక్ సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే బిజెపి ఒక్కటే ఎక్కువ ఓట్లు సాధించండి. BRS, కాంగ్రెస్ ఓట్లు తగ్గాయి.NGKL లోక్ సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే బిజెపి ఓటు బ్యాంకును పెంచుకోగా.. BRS తన ఓటు బ్యాంకును పెద్ద ఎత్తున కోల్పోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా ఓ మోస్తరుగా తగ్గింది.

News June 5, 2024

కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్

image

నల్గొండ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ గోడౌన్లో ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ సాగుతుంది. 4 హాల్స్ లో ఏర్పాటు చేసిన 96 టేబుళ్లపై ఉ.8 గంటల నుంచి బ్యాలెట్ పేపర్లను కట్టే ప్రక్రియను ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది ప్రారంభించారు. కాగా మద్యాహ్నం తరువాత మొదటి ప్రాధాన్యత ఓట్లను సిబ్బంది లెక్కించనున్నారు.

News June 5, 2024

సీసీకుంట: ఊయల చీర బిగుసుకొని చిన్నారి మృతి

image

సీసీకుంట మండలంలోని ఉంద్యాల గ్రామంలో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు ఓ చిన్నారి మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల కురుమన్న కూతురు అనుషిత(11) ఇంటి బయట బాల్ కానీకి చీరతో కట్టిన ఊయలతో ఆడుకుంటుంది. ప్రమాదవశాత్తు ఊయలకు కట్టిన పాప గొంతుకు బిగుసుకుంది. కొంతసేపటి తర్వాత గుర్తించిన తల్లి శైలజ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News June 5, 2024

కొత్తగూడెం: జనసేన, వైసీపీ అభిమానుల మధ్య ఘర్షణ

image

అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువులో జనసేన ఫ్లెక్సీ చింపిన విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జనసేన ఫ్లెక్సీని వైఎస్ఆర్సీపీ అభిమానులు చింపేశారని జనసేన అభిమానులు ఆరోపించారు. తోట శ్రీను అనే వ్యక్తి అడగడానికి వెళ్తే చితకబాదారని చెప్పారు. ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

News June 5, 2024

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ

image

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్లను నల్గొండలో లెక్కిస్తున్నారు. ప్రస్తుతం బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగుతుంది. 96 టేబుళ్లపై ఓట్ల కొనసాగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 24 గంటల పాటు ఎన్నికల కౌంటింగ్ కొనసాగనుంది. ఓట్ల లెక్కింపులో 2,800 మంది సిబ్బంది పాల్గొన్నారు.

News June 5, 2024

HYD: కాంగ్రెస్‌లో చేరిన నేతలకు పరాజయం

image

TGలో INC అధికారంలోకి వచ్చిన తర్వాత BRSను వీడిన దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, పట్నం సునీత MP ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. చేవెళ్లలో రంజిత్ రెడ్డి 1,72,897 తేడాతో ఓడిపోయారు. మల్కాజిగిరి సిట్టింగ్‌ స్థానంలో INC గట్టి పోటీ ఇవ్వలేకపోయినా.. డిపాజిట్ దక్కించుకుంది. ఇక సికింద్రాబాద్‌ MP స్థానంలో దానం మెరుగైన ఓట్లనే రాబట్టి 2వ స్థానంలో నిలిచారు. ఎన్నికల ముందు INCలో చేరిన నేతలను రాజధాని ప్రజలు ఆదరించలేదు.