Telangana

News June 5, 2024

ఖమ్మంలో కాంగ్రెస్‌కు తొలి గెలుపు

image

ఖమ్మం ఎంపీ స్థానాన్ని 2014లో వైఎస్ఆర్‌సీపీ గెలుచుకుంది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన పొంగులేటి గెలిచారు. 2019లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇక ప్రస్తుతం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి భారీ మెజార్టీతో ఖమ్మంలో పాగా వేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లైంది.

News June 5, 2024

నల్గొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో సత్తా చాటిన కాంగ్రెస్ MP ఎన్నికల్లోనూ NLG, BNRలో విజయం సాధించి నల్గొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని నిరూపించింది. నల్గొండలో 5.59లక్షల మెజార్టీ రాగా, భువనగిరిలో 2లక్షల పైచిలుకు మెజార్టీ వచ్చింది. BNRలో రాజగోపాల్ రెడ్డి అన్నితానై నడిపించగా, NLG ఇన్‌ఛార్జీగా ఉత్తమ్ తీవ్రంగా శ్రమించారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న HNRలో హస్తం పార్టీకి లక్షకు పైగా మెజార్టీ వచ్చింది.

News June 5, 2024

HYD: MIM మెజార్టీని టచ్ చేయని మాధవీ లత

image

MIM కంచుకోట హైదరాబాద్‌ లోక్‌సభ‌లో BJP ఘోర పరాజయం పాలైంది. కమలం పువ్వు గుర్తు మీద 3,23,894 (29.98%) ఓట్లు సాధించిన మాధవీ లత 2వ స్థానంలో నిలిచారు. 3,38,087 ఓట్ల భారీ మెజార్టీతో‌ ఆమెపై అసదుద్దీన్ ఒవైసీ ఘన విజయం సాధించారు. కనీసం MIMకు వచ్చిన మెజార్టీ ఓట్లను సైతం BJP ఢీ కొట్టలేకపోయింది. పతంగి గుర్తు మీద ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో 6,61,981(61.28) ఓట్లు పోలవడం విశేషం.

MBNR, NGKL: నోటాకు 9,299 ఓట్లు

image

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో నోటాకు ఆదరణ తగ్గింది.  మహబూబ్‌నగర్‌లో4330, నాగర్‌కర్నూల్‌లో4969 ఓట్లు మాత్రమే నోటాకు పడ్డాయి. ఈ 2 లోక్ సభ స్థానాల్లో కలిపి 2014లో 21,425 ఓట్లు, 2019లో 24,125 ఓట్లు, 2024లో 9,299 నోటాకు పోలయ్యాయి. 2019తో పోల్చితే ఈ సారి నోటాకు 14,826 ఓట్లు తక్కువగా వచ్చాయి. నోటాకు ఆదరణ తగ్గిందనడానికి తక్కువ ఓట్లు నమోదు కావడం గమనార్హం.

News June 5, 2024

పవన్ కళ్యాణ్‌కు కలిసొచ్చిన కొండగట్టు సెంటిమెంట్!

image

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ సక్సెస్ అవ్వడంతో కొండగట్టు అంజన్న సెంటిమెంట్ కలిసొచ్చిందని ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకొని ‘వారాహి’ వాహనానికి పూజలు చేయించారు. దీంతో ఆంజనేయస్వామి ఆశీస్సులు పవన్‌పై మెండుగా ఉన్నాయని, అంజన్న సెంటిమెంట్ కలిసొచ్చిందని అభిమానులు అంటున్నారు.

News June 5, 2024

మొదలైన కౌంటిగ్ ప్రక్రియ

image

నల్గొండ- వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుందనీ, అలాగే రాత్రి 11 గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పోలై .. చెల్లిన ఓట్లలో సగం కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థిని విజేతగా ఈసీ ప్రకటించే అవకాశం ఉంటుందని తెలిపారు.

News June 5, 2024

చేవెళ్ల: ఇదే స్థానం నుంచి రెండో సారి గెలుపు

image

చేవెళ్లలో బీజేపీ తరఫున బరిలో దిగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఈ స్థానం నుంచి రెండో సారి విజయం లభించింది. 2014లో ఆయన BRS నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ పార్టీ నాయకత్వంతో పొసగక బయటకొచ్చిన ఆయన 2019లో కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొండా బీజేపీలో చేరి 2024లో ఎన్నికల్లో విజయం సాధించారు.

కారుకు బ్రేక్… ప్రభావం చూపలేకపోయిన నామా

image

ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు చుక్కెదురైంది. ఏ రౌండ్లోనూ ఆయన ప్రభావం చూపలేకపోయారు. మొత్తం 12,40,582 ఓట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి 2,99,082 ఓట్లు మాత్రమే సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు 5,67,459 ఓట్లు పోల్ కాగా, పోలింగ్ శాతం 49.80గా నమోదైంది. ఈసారి కేవలం 24.10 శాతం ఓట్లే సాధించి ఓటమి చవిచూశారు.