Telangana

News June 5, 2024

NZB: 2 సార్లు MLA..ఎంపీ పోటీలో డిపాజిట్ గల్లంతు..!

image

నిజామాబాద్ లోక్ సభ BRS అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో ఏ మాత్రం సత్తాచాట లేకపోయారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు MLA గా గెలిచిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. తిరిగి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇవాళ వెలువడిన ఫలితాల్లో ఆయనకు 1,02,406 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 8.3% ఓట్లు రాబట్టగా.. డిపాజిట్ కూడా గల్లంతైంది.

News June 5, 2024

ADB: ఆది నుంచి విజయాలే.. MLAగా, మంత్రిగా, MPగా

image

ఆదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన గోడం నగేశ్‌కు ఆది నుంచి విజయం, అదృష్టం వరిస్తూనే ఉన్నాయి. TDPలో సుదీర్ఘకాలం పని చేసిన ఆయన BRSలో చేరిన వెంటనే టికెట్ దక్కించుకొని ఎంపీగా విజయం సాధించగా అదే రీతిలో ఈసారి BJPలో చేరిన మూడు రోజుల్లోనే టికెట్ దక్కించుకొని గెలుపొందారు. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు నెలల్లోనే ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర మంత్రిగా సేవలదించారు.

News June 5, 2024

పెద్దపల్లి: తండ్రీకొడుకుల చేతిలో ఓడిన గోమాసె శ్రీనివాస్

image

పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి BJP అభ్యర్థిగా పోటి చేసిన గోమాసె శ్రీనివాస్ 2 సార్లు ఒకే కుటుంబానికి చెందిన వారి చేతిలో ఓటమిపాలయ్యారు. 2009లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై ఓడిపోయిన ఆయన తాజాగా ఆయన కుమారుడు వంశీకృష్ణపై ఓటమి పాలయ్యారు. 2009లో TRS తరఫున పోటీ చేసిన శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై 49,017 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా ఇప్పడు 1,31,364 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

News June 5, 2024

HYD: ప్చ్.. డిపాజిట్ కోల్పోయిన పద్మారావు

image

ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకొన్న పజ్జన్న‌ను MP ఎన్నికల్లో జనాలు ఆదరించలేదు. ఎన్నికల ముందు సికింద్రాబాద్‌లో BRS VS BJP అని‌ ఆ పార్టీ శ్రేణులు‌ భావించాయి. కానీ, నిన్నటి ఫలితాల్లో ఆయన డిపాజిట్ కోల్పోయారు. 1, 2 మినహాయిస్తే.. అన్ని రౌండ్లలో BRS మూడో స్థానంలో నిలిచింది. ఫలితంగా 1,29,586(12.37%) ఓట్లకే పరిమితం కావడం గమనార్హం. తొలిసారి MPగా పోటీ చేసిన MLA పద్మారావు ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్నారు.

News June 5, 2024

మల్కాజిగిరి బ్యాలెట్‌లోనూ బీజేపీకి ఆధిక్యం

image

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 18,880 బ్యాలెట్ ఓట్లు ఉండగా.. ఇందులో 18,496 బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 10,330 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్ రెడ్డికి 6,230 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి 1,787 ఓట్లు వచ్చాయి. నోటాకు 160 ఓట్లు రాగా.. చెల్లని బ్యాలెట్ ఓట్లు 222 ఉన్నాయి.

నల్లగొండ: కొనసాగుతున్న కౌంటింగ్

image

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రధాన అభ్యర్థులుగా రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్), తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్) ప్రేమేందర్ రెడ్డి (బీజెపి), అశోక్ (స్వతంత్ర) బరిలో ఉన్నారు. మంగళవారం వెల్లడైనా నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్లలో బీజేపీ రెండో స్థానంలో నిలవడంతో ఎమ్మెల్సీ ఫలితం ఆసక్తిరేపుతోంది.  

News June 5, 2024

రఘురాం రెడ్డికి మెజార్టీ ఇలా..

image

ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలను పరిశీలిస్తే ఖమ్మం అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఆయన 86,565 ఓట్ల మెజార్టీ సాధించగా, కొత్తగూడెంలో 76, 177 ఓట్లు, సత్తుపల్లిలో 69,408 ఓట్లు, మధిరలో 63,569, వైరాలో 61,778, పాలేరులో 61,681 ఓట్లు, అశ్వారావుపేటలో 42,927 ఓట్ల మెజార్టీ సాధించారు.

News June 5, 2024

HYD: TDP గెలుపు.. BRS MLA సంతోషం

image

ప్రజలు ఇచ్చిన అవకాశంతో అహంకారాన్ని నెత్తిన ఎక్కించుకునే నాయకులకు ఏపీ ప్రజల తీర్పు చెంపపెట్టు లాంటిదని HYD రాజేంద్రనగర్ MLA, BRS నేత ప్రకాశ్ గౌడ్ అన్నారు. ఏపీలో TDP, జనసేన, BJP కూటమి ఘన విజయం సాధించడంపై ఆయన శ్రేణులకు అభినందనలు తెలిపారు. ఏపీ ప్రజలు 2019లో జగన్‌కు తిరుగులేని మెజారిటీతో విజయం అందించినా నియంతృత్వం, అహంకారం, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకే ఆయన పరిమితమయ్యారని మండిపడ్డారు.