Telangana

News June 5, 2024

ఈ ఎన్నికల్లో బీజేపీకి నామమాత్రమే

image

ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మొత్తం 1,18,636 ఓట్లు పొందారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి 20,488 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో 1.80 శాతం పోల్ కాగా, ఈసారి ఓట్ల శాతం 9.55 శాతానికి పెరగడం విశేషం. తొలి నుంచి విస్తృతంగా ప్రచారం చేయడంతో బీజేపీ అభ్యర్థి వినోద్ రావుకు లక్ష ఓట్లకు పైగా పోలైనా ఏ రౌండ్లోనూ ఆయన ప్రభావం చూపలేకపోయారు.

News June 5, 2024

MNCL: తండ్రీకొడుకుల చేతిలో ఓడిన గోమాసె శ్రీనివాస్

image

పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి BJP అభ్యర్థిగా పోటి చేసిన గోమాసె శ్రీనివాస్ 2 సార్లు ఒకే కుటుంబానికి చెందిన వారి చేతిలో ఓటమిపాలయ్యారు. 2009లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై ఓడిపోయిన ఆయన తాజాగా ఆయన కుమారుడు వంశీకృష్ణపై ఓటమి పాలయ్యారు. 2009లో TRS తరఫున పోటీ చేసిన శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై 49,017 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా ఇప్పడు 1,31,364 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

News June 5, 2024

చరిత్ర సృష్టించిన బండి సంజయ్

image

దేశంలో మోదీ చరిష్మా, రాష్ట్రంలో బండి ఖలేజాతో కరీంనగర్ లోక్‌సభ స్థానంలో బండి సంజయ్ భారీ మెజారిటీతో వరుస విజయాన్ని నమోదు చేశారు. ఈ నియోజకవర్గంలో 1991 తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ అభ్యర్థి రెండో సారి గెలవలేదు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన బండి సంజయ్ తిరిగి 2024 ఎన్నికల్లోనూ రెండో సారి పోటీ చేసి విజయాన్ని అందుకోవడం విశేషం. దీంతో మాజీ MP రత్నాకర్ రావు రికార్డు సమం చేశారు.

News June 5, 2024

నేడు పాలమూరు బాలోత్సవ్

image

బాలకేంద్రం వేసవి సాంస్కృతిక శిక్షణ ముగింపులో భాగంగా పాలమూరు బాలోత్సవ్ పేరిట బుధవారం సాంస్కృతిక సంబరం చేపట్టనున్నట్లు బాలకేంద్రం శిక్షకులు తెల్కపల్లి గజేంద్ర, రాజేశ్ కన్న వెల్లడించారు. మహబూబ్ నగర్ కొత్త బస్టాండ్ సమీపంలోని బాదం రామస్వామి ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక మహోత్సవంప్రారంభమవుతుందన్నారు. చిన్నారులతో సంప్రదాయ, జానపద నృత్యాలు, చిత్రకళ ప్రదర్శన ఉంటుందని అన్నారు.

News June 5, 2024

NGKL: పోటీలో లేకుండానే బర్రెలక్క ఓటమి

image

నాగర్ కర్నూల్ ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కర్నె శిరీష (బర్రెలక్క) పోటీలో లేకుండానే ఓడిపోయారు. అసలు బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కంటే నోటాకే వచ్చిన ఓట్లే ఎక్కువ. మొత్తానికి నోటాకు 4580 ఓట్లు రాగా, బర్రెలక్కకు 3087 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఆమె కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడ్డాయి. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

News June 5, 2024

జహీరాబాద్‌: కాంగ్రెస్‌ 2వ సారి విజయకేతనం

image

ఎంపీ ఎన్నికల్లో జహీరాబాద్‌ను కాంగ్రెస్‌, నిజామాబాద్‌ను బీజేపీ కైవసం చేసుకున్నాయి. ZHB కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ 47,896 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009లో గెలిచిన షెట్కార్‌ తాజాగా మరోసారి విజయకేతనం ఎగురవేశారు.BRS ఎంపీగా ఉన్న బీబీపాటిల్‌ BJPలో చేరి పోటీ చేయగా, కాంగ్రెస్‌ నుంచి BRSలో చేరిన గాలి అనిల్‌కుమార్‌ బరిలో నిలిచి ఓటమిచెందారు. దీంతో BRS సిట్టింగ్‌ స్థానాన్ని కొల్పోయింది.

News June 5, 2024

అట్లుంటది MALKAJGIRI ప్రజలతోని..!

image

మల్కాజిగిరి ప్రజలు విలక్షణ తీర్పుకు పెట్టింది పేరుగా మారారు. గెలిపించిన పార్టీని వరుసగా మళ్లీ గెలిపించకుండా ప్రతిసారీ కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించగా ఆ తర్వాత 2014లో టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డిని గెలిపించారు. మళ్లీ 2019లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని గెలిపించగా ఈసారి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఛాన్స్ ఇచ్చారు. దీనిపై మీ కామెంట్?

News June 5, 2024

అట్లుంటది MALKAJGIRI ప్రజలతోని..!

image

మల్కాజిగిరి ప్రజలు విలక్షణ తీర్పుకు పెట్టింది పేరుగా మారారు. గెలిపించిన పార్టీని వరుసగా మళ్లీ గెలిపించకుండా ప్రతిసారీ కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించగా ఆ తర్వాత 2014లో టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డిని గెలిపించారు. మళ్లీ 2019లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని గెలిపించగా ఈసారి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఛాన్స్ ఇచ్చారు. దీనిపై మీ కామెంట్?

News June 5, 2024

మంత్రి పొంగులేటి స్వగ్రామంలో బీజేపీకి లీడ్ 

image

పొంగులేటి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురంలో రెండు పోలింగ్ బూత్ లలో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. నారాయణపురంలో 94వ బూత్‌లో బీజేపీకి 89 ఓట్ల మెజారిటీ వచ్చింది. అక్కడ మొత్తం 735 ఓట్లు పోలవగా బీజేపీ 404, కాంగ్రెస్ 315, బీఆర్ఎస్ 16 ఓట్లు సాధించింది. బూత్ నంబర్ 95లో 320 ఓట్లు పోలవగా బీజేపీ 197, కాంగ్రెస్ 112, బీఆర్ఎస్‌కు 11ఓట్లు లభించాయి. బీజేపీకి 85 ఓట్ల ఆధిక్యం దక్కింది.

News June 5, 2024

రంగారెడ్డి: పట్నం, పట్లోళ్ల ఫ్యామిలీకి కలిసిరాని ఎంపీ ఎన్నికలు

image

ఉమ్మడి RR జిల్లా రాజకీయాలను శాసించిన పట్లోళ్ల, పట్నం ఫ్యామిలీలకు ఎంపీ ఎన్నికల్లో మాత్రం గెలుపు వరించడం లేదు. తాజాగా పట్నం సునీతారెడ్డి ఓటమే ఇందుకు నిదర్శనం. HYD పార్లమెంట్ స్థానం నుంచి గతంలో TDP అభ్యర్థిగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి పోటీ చేసి ఓడారు. 2014లో కార్తీక్ రెడ్డి పోటీ చేసి కొండా చేతిలో ఓడారు. దీన్ని బట్టి పట్లోళ్ల, పట్నం ఫ్యామిలీల్లో ఎంపీ స్థానాలకు పోటీ చేయడం కలిసిరాలేదని తెలుస్తోంది.