Telangana

News June 5, 2024

HYD: ఈటలకు గోల్డెన్ ఛాన్స్..!

image

మల్కాజిగిరి ప్రజలు ఈటలకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. సొంత నియోజకవర్గం హుజూరాబాద్, గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా మల్కాజిగిరి ప్రజలు ఎంపీగా గెలిపించారు. కాగా దేశంలో అతిపెద్ద ఎంపీ స్థానమైన ఇక్కడ 2009లో గెలిచిన సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రిగా, 2014లో గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా, 2019లో గెలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈటల కేంద్ర మంత్రి అవుతారా వేచి చూడాలి.

ఆదిలాబాద్: 3వ స్థానానికి BRS..!

image

లోక్సభ ఓట్ల లెక్కింపుల్లో BRS అభ్యర్థి ఆత్రం సక్కు అన్ని రౌండ్లలో మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019లోక్సభ ఎన్నికల్లో 3,18,665 సాధించి రెండోస్థానంలో నిలిచిన BRS మొన్నటి శాసనసభల్లో ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలకే పరిమితమైనప్పటికీ ఏడు నియోజకవర్గాల్లో వచ్చిన 4,48,961 ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా కేవలం 1,37,217 ఓట్లతో 3వ స్థానానికి రావడం గమనార్హం

News June 5, 2024

ADB: వికసించిన గిరి కమలం.. అప్పుడు 58,227, ఇప్పుడు 90,652

image

ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం (ఎస్టీ)లో మరోసారి భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది. గోడం నగేశ్ 86, 603 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరో 4049 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను పరిగణనలోకి తీసుకొంటే నగేష్‌ 90,652 ఓట్లను దక్కించుకున్నారు. ఒక్క ఆసిఫాబాద్‌ నియోజకవర్గం మినహా మిగతా ఆరు నినియోజకవర్గాల్లో బీజేపీ హవా కొనసాగింది. 2019లో బీజేపీకి 58,227 ఆధిక్యత రాగా ఈ సారి ఏకంగా 90,652 ఓట్ల BJPకి మెజార్టీ దక్కింది.

News June 5, 2024

కరీంనగర్: బండికి 44.55 శాతం ఓట్లు

image

కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో బండి సంజయ్‌ 44.55 శాతం ఓట్లను పొందారు. మొత్తంగా 13,13,331 మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. ఇందులో 5,85,116 మంది బీజేపీకి ఓటేశారు. 2019 ఎన్నికలతో పోలిస్తే సంజయ్‌కు ఓటు శాతం పెరిగింది. అప్పటి ఎన్నికల్లో 11.47 లక్షల ఓట్లకుగానూ 4,98,276 ఓట్లను పొంది 43.42 శాతం మద్దతును పొందారు. మొత్తంగా 2,25,209 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుపై విజయం సాధించారు.

News June 5, 2024

అన్నిచోట్ల ఓ లెక్క… MBNRలో మరోలెక్క

image

ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌ను బీజేపీ, నాగర్‌కర్నూల్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. కాగా MBNR కౌంటింగ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ తీవ్ర ఉత్కంఠ రేపింది. రౌండ్ రౌండుకూ కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరు రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ అయింది. చివరకు 7,601 ఓట్ల స్వల్ప మెజార్టీతో బీజేపీ గెలిచింది. అటు NGKLలో మల్లు రవి 94,414 ఓట్లతో ఘనవిజయం సాధించారు.

News June 5, 2024

జగన్ రికార్డును బ్రేక్ చేసిన రఘువీర్ రెడ్డి

image

భారీ మెజార్టీతో గెలిచిన రఘువీర్ గతంలో జగన్ సాధించిన రికార్డును బద్దలు కొట్టారు. 2011లో కడప MP స్థానానికి జరిగిన బై పోల్‌లో జగన్ మెజార్టీ 5,45,672. ఆ రికార్డును తిరగరాస్తూ రఘువీర్ 5,59,905 లక్షల మెజార్టీ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మెజార్టీ మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహరావు పేరిట ఉంది. 1991లో నంద్యాల స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన 5.8 లక్షల పైచిలుకు ఓట్లు సాధించారు.

News June 5, 2024

HYD: ఓట్ల లెక్కింపు ప్రశాంతం: కమిషనర్

image

హైదరాబాద్‌లో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయన కార్వాన్, నాంపల్లి, యాకుత్‌పుర, చార్మినార్, చాంద్రాయణగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ ప్రక్రియకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి, పోలీస్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News June 5, 2024

ఖమ్మంలో నామా రికార్డు బ్రేక్

image

ఖమ్మంలో నామా పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. ఖమ్మంలో 17సార్లు ఎన్నికలు జరగ్గా 2019 ఎన్నికల్లో నామాకు 1,68,062 మెజార్టీ వచ్చింది. కాగా ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి ఆ రికార్డును బద్దలు కొట్టారు. ఆయన నామాపై 4,67,847 మెజార్టీతో గెలిపొందారు. నామాకు 2,99,082 ఓట్లు వచ్చాయి. కాగా ఖమ్మంలో ఈస్థాయిలో మెజార్టీ రావడం ఇదే తొలిసారి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగాయి.