Telangana

News June 5, 2024

HYD: ప్రజల తీర్పును శిరస్సు వంచి స్వాగతిస్తున్నా: నివేదిత

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్‌లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస్సు వంచి స్వాగతిస్తున్నా అని బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్న అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా నిలిచిన నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా కంటోన్మెంట్ ప్రజలకు ఎల్లప్పుడూ తానూ అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.

పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో మంత్రి మార్క్!

image

పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో మంత్రి శ్రీధర్ బాబు మరోసారి తన మార్కు చూపించారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరుపొందిన మంత్రి తన రాజకీయ చతురను ప్రదర్శించి పార్టీ అభ్యర్థి వంశీకృష్ణకు విజయం చేకూర్చారు. తొలుత అభ్యర్థి ఎంపికపై పార్టీలో భిన్న స్వరాలు వినిపించిన మంత్రి అన్నింటిని చక్కదిద్దారు. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నాయకులను సమన్వయం చేసి పార్టీ గెలుపునకు కృషి చేశారు.

News June 5, 2024

KNR: నోటాకు ఎన్ని ఓట్లంటే?

image

లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ పరిధిలోని స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. పెద్దపల్లిలో అత్యధికంగా 5,711 ఓట్లు పోలవగా.. కరీంనగర్‌లో అత్యల్పంగా 5,438 ఓట్లు పోలయ్యాయి. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చక నోటాకు వేలల్లో ఓట్లు వేశారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నోటాకు ఓట్లు పెరిగాయి. దీనిపై మీ కామెంట్?

News June 5, 2024

HYD: నోటాకు ఎన్ని ఓట్లంటే?

image

లోక్‌సభ ఎన్నికల్లో రాజధాని పరిధిలోని స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. మల్కాజిగిరిలో అత్యధికంగా 13,206 ఓట్లు పోలవగా హైదరాబాద్‌లో అత్యల్పంగా 2,906 ఓట్లు పోలయ్యాయి. ఇక చేవెళ్లలో 6,308 ఓట్లు, సికింద్రాబాద్‌లో 5,166 ఓట్లు వచ్చాయి. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చక నోటాకు వేలల్లో ఓట్లు వేశారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నోటాకు ఓట్లు పెరిగాయి. దీనిపై మీ కామెంట్?

News June 5, 2024

NZB: అసెంబ్లీకి ఓడించిన.. పార్లమెంట్‌కు పంపించారు

image

ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి పోటీ చేశారు. భారాస అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ చేతిలో 10,300 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న అర్వింద్ లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి వ్యూహం మార్చారు. మోదీ చరిష్మాకు తోడు.. తన వ్యూహానికి పదును పెట్టారు. 1.13 లక్షలకు పైగా మెజార్టీతో అర్వింద్ విజయం సాధించారు.

News June 5, 2024

HYD: నోటాకు ఎన్ని ఓట్లంటే?

image

లోక్‌సభ ఎన్నికల్లో రాజధాని పరిధిలోని స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. మల్కాజిగిరిలో అత్యధికంగా 13,206 ఓట్లు పోలవగా హైదరాబాద్‌లో అత్యల్పంగా 2,906 ఓట్లు పోలయ్యాయి. ఇక చేవెళ్లలో 6,308 ఓట్లు, సికింద్రాబాద్‌లో 5,166 ఓట్లు వచ్చాయి. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చక నోటాకు వేలల్లో ఓట్లు వేశారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నోటాకు ఓట్లు పెరిగాయి. దీనిపై మీ కామెంట్?

News June 5, 2024

MBNR: గెలుపొందిన పత్రాన్ని అందుకున్న డీకే అరుణ.!

image

మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన డీకే అరుణకు జిల్లా ఎన్నికల అధికారులు మంగళవారం సాయంత్రం గెలుపొందిన పత్రాన్ని అందజేశారు. మహబూబ్ నగర్ సెగ్మెంట్ కౌంటింగ్ మొదట నుండి ఉత్కంఠ మధ్య జరిగింది. ఎట్టకేలకు డీకే అరుణ స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులపై విజయం సాధించారు. గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

News June 5, 2024

నైతిక విజయం కాంగ్రెస్ దే: నీలం మధు

image

మెదక్ పార్లమెంటు ఎన్నికలలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందినా నైతిక విజయం కాంగ్రెస్ దేనని ఆ పార్టీ అభ్యర్థి నీలం మధు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగా ఒక్కటై బీసీ బిడ్డను ఓడించడానికి కుట్ర చేశాయని ఆరోపించారు. రెండు పార్టీలు అంతర్గతంగా ఒప్పందంతో బీజేపీ అభ్యర్థిని గెలిపించారన్నారు. కాంగ్రెస్ బీసీ బిడ్డకు అవకాశం కల్పిస్తే ఓర్వలేక కుట్రలు పన్నాయని అన్నారు.

News June 5, 2024

WGL: నోటాకు ఎన్ని ఓట్లంటే?

image

వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. వరంగల్‌లో 8,380 ఓట్లు రాగా.. మహబూబాబాద్‌లో 6,585 ఓట్లు పోలయ్యాయి. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చక నోటాకు వేలల్లో ఓట్లు వేశారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నోటాకు ఓట్లు పెరిగాయి. దీనిపై మీ కామెంట్?