Telangana

News June 5, 2024

నోటాకు ఎన్ని ఓట్లంటే?

image

లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ,భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. నల్గొండలో 6086 ఓట్లు పోలవగా భువనగిరిలో 4646 ఓట్లు పోలయ్యాయి. కాగా నల్గొండ కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్ రెడ్డి 60.5% ఓట్లతో సమీప బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై గెలుపొందారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ 44.89% ఓట్లతో సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌పై గెలుపొందారు.

News June 5, 2024

ఆదిలాబాద్: NOTAకు 11 వేల ఓట్లతో 4వ స్థానం

image

ఆదిలాబాద్ పార్లమెంట్ ఫలితాల్లో నోటాకు భారీగా ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో కలిపి మొత్తం 11,743 ఓట్లు రావడంతో నాలుగో స్థానంలో నిలిచింది. శ్యామ్ నాయక్ అభ్యర్థికి 7,496 ఓట్లు రాగ ఐదవ స్థానంలో నిలిచారు. మెస్రం జంగుబాపు అభ్యర్థికి 6,735 ఓట్లు, రాథోడ్ రమేష్ అభ్యర్థికి 6521, జైవంత్ రావ్ అభ్యర్థికి 6,439 ఓట్లు వచ్చాయి.

News June 5, 2024

నోటాకు ఎన్ని ఓట్లంటే?

image

లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్ స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. ఖమ్మంలో 6782 ఓట్లు పోలవగా.. మహబూబాబాద్‌లో 6585 ఓట్లు పోలయ్యాయి. కాగా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధి రఘురాం రెడ్డి 61.29% ఓట్లతో సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై గెలుపొందారు. నామా నాగేశ్వరరావుకు 23.9% ఓట్లు పోలయ్యాయి.

News June 4, 2024

HYD: మహిళ దారుణ హత్య.. కేసు నమోదు

image

ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన HYD బాలాపూర్ సమీపంలోని మీర్‌పేట్ PS పరిధి వినాయక హిల్స్‌లో కాసేపటి క్రితం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉంటున్న జటావత్ ప్రభు(45) అనే మహిళను ఆమె కూతురి అత్త సుత్తితో తలపై కొట్టి చంపేసింది. పోలీసులు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌ చేయడం గమనార్హం.

News June 4, 2024

HYD: మహిళ దారుణ హత్య.. కేసు నమోదు

image

ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన HYD బాలాపూర్ సమీపంలోని మీర్‌పేట్ PS పరిధి వినాయక హిల్స్‌లో కాసేపటి క్రితం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉంటున్న జటావత్ ప్రభు(45) అనే మహిళను ఆమె కూతురి అత్త సుత్తితో తలపై కొట్టి చంపేసింది. పోలీసులు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌ చేయడం గమనార్హం.

News June 4, 2024

చేవెళ్ల: పోస్టల్ బ్యాలెట్‌లో కొండాకు ఎన్ని ఓట్లు అంటే..!

image

చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. ఆయన గెలుపులో ఉద్యోగులు సైతం కీలక పాత్ర పోషించారు. మొత్తం 19,397 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. అందులో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కి 1,428, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 11,365, కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 6,124ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన MLA శ్రీ గణేశ్ బృందం

image

కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీగణేశ్ బృందం CM రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి CM అభినందనలు తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా శ్రీ గణేశ్‌కు సూచించారు. సీఎంను కలిసిన వారిలో జంపన ప్రతాప్, పల్లె లక్ష్మణ్ గౌడ్, ముప్పడి మధుకర్, సంకీ రవీందర్, ఇటుక రాజు, బద్రీనాథ్ ఉన్నారు

News June 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం.
@ పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం.
@ నిజామాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం.
@ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్.
@ ఎండపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.
@ వీణవంక మండలంలో ఎల్లమ్మ ఆలయంలో చోరీ.
@ మల్హర్ మండలంలో తాటి చెట్టు పై పడిన పిడుగు.

News June 4, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✒మహబూబ్ నగర్ లో డీకే అరుణ(BJP) విజయం
✒నాగర్ కర్నూల్ లో మల్లురవి(INC) ఘన విజయం
✒భారీ బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు
✒ఉమ్మడి జిల్లాలో CONGRESS,BJP నాయకుల సంబరాలు
✒APలో చంద్రబాబు గెలుపు.. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల టిడిపి కార్యకర్తల సంబరాలు
✒GDWL:ఈదురు గాలులు.. రాకపోకలు బంద్
✒NRPT: ఘనంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి
✒ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లపై అధికారుల పై అధికారుల ఫోకస్

News June 4, 2024

చామలకు ధ్రువీకరణ పత్రం అందజేసిన కలెక్టర్ 

image

భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా ధ్రువీకరణ పత్రాన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హనుమంత్ జండగే అందజేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.