Telangana

News June 4, 2024

HYD: డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్, BRS

image

HYD ఎంపీ స్థానంలో కాంగ్రెస్, BRS డిపాజిట్లు కోల్పోయాయి.ఇక్కడ పోలైన మొత్తం ఓట్లలో MIM అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ 61.28% ఓట్లతో గెలుపొందారు. BJP అభ్యర్థి మాధవీలతకు 29.98% ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ సమీర్‌కు 5.83%, BRS అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్‌కు 1.73% ఓట్లు రాగా డిపాజిట్లు కోల్పోయారు. ఒవైసీకి 6,61,981, మాధవీలతకు 3,23,894, సమీర్‌కు 62,962, శ్రీనివాస్‌కు 18,641 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

MBNR: వరుసగా మూడుసార్లు ఓడిన వంశీచంద్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా వంశీచంద్ రెడ్డి స్వల్ప తేడాతో డీకే అరుణపై ఓడిపోయారు. దీంతో వంశీ ఇప్పటి వరకు వరుసగా 3సార్లు ఓటమి చవిచూశారు. 2014లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి 78 ఓట్లతో MLAగా గెలుపొందిన చల్లా 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీచేసి ఓడిపోగా తాజాగా మరోసారి ఓటమి పాలయ్యారు. జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నప్పటికీ ఆయనను ప్రజలు ఆదరించలేదు.

News June 4, 2024

జగిత్యాల: ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్న అరవింద్

image

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ లక్షకు పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అతనిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

News June 4, 2024

KNR: 45 శాతం ఓట్లు సాధించిన బండి సంజయ్

image

కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతం ఓట్లు బండి సంజయ్ కుమార్ సాధించారు. కాంగ్రెస్‌కు 27.4 శాతం, బీఆర్ఎస్‌కు 21.4 శాతం ఓట్లు వచ్చాయి. మరోవైపు కరీంనగర్‌లో కేసీఆర్, వినోద్ రికార్డులు బద్దలు కొట్టారు. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో అత్యధిక ఓట్ల శాతాన్ని సాధించి టాప్‌లో నిలిచారు.

News June 4, 2024

గెలుపొందిన సర్టిఫికేట్ అందుకున్న రఘురాంరెడ్డి

image

ఖమ్మం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన రామ‌సహాయం రఘురాంరెడ్డికి ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్ సర్టిఫికేట్ అందజేశారు. తన గెలుపునకు సహకరించిన వారికి రఘురాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు రాగమయి, రాందాస్ నాయక్ పాల్గొన్నారు.

News June 4, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ

image

CM రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ తగిలింది. ఆయన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి MP స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిపై BJP అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. మల్కాజిగిరి స్థానంలో గెలవాలని CM ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినా కలిసిరాలేదు. ఇక CM సొంత జిల్లా వికారాబాద్‌లోనూ BJP చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కొడంగల్‌లో BJP MBNR అభ్యర్థి DKఅరుణ సత్తా చాటి గెలుపొందారు.

News June 4, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ

image

CM రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ తగిలింది. ఆయన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి MP స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిపై BJP అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. మల్కాజిగిరి స్థానంలో గెలవాలని CM ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినా కలిసిరాలేదు. ఇక CM సొంత జిల్లా వికారాబాద్‌లోనూ BJP చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కొడంగల్‌లో BJP MBNR అభ్యర్థి DKఅరుణ సత్తా చాటి గెలుపొందారు.

News June 4, 2024

ఓడినా ప్రజల మధ్యే ఉంటా: నామా

image

తాను గెలిచినా.. ఓడినా నిత్యం నియోజకవర్గ ప్రజల మధ్యలోనే ఉంటానని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తనకు కన్న తల్లి ఎంత ఇష్టమో ఖమ్మం నియోజకవర్గ ప్రజలు కూడా అంతే ఇష్టమని చెప్పారు. గెలిస్తే పొంగిపోయేది లేదని ఓడితే కుంగేది లేదన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని పేర్కొన్నారు.

News June 4, 2024

ADB: ముగిసిన రౌండ్లు.. మొత్తం మెజారిటీ ఎంతంటే.!

image

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో BJP అభ్యర్థి గోడం నగేశ్ 86,883 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 23 రౌండ్‌ల కౌంటింగ్ ముగిసే సరికి 86,883 ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు. BJP 5,58,103, కాంగ్రెస్ 4,71,220, బీఆర్ఎస్ 1,36,380 ఓట్లు సాధించాయి. కాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 9,232 కలిపి మొత్తం 90,932 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

News June 4, 2024

పెద్దపల్లి పార్లమెంటులో పోస్టల్ బ్యాలెట్ వివరాలు

image

పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ వెల్లడించారు. కాంగ్రెస్‌కు 5,407, BJPకి 5,116, BRSకి 1,416 ఓట్లు వచ్చాయన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 291 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడని తెలిపారు.