Telangana

News June 4, 2024

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో‌ BRS ఓటమి

image

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో‌ BRS పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. సిట్టింగ్‌ స్థానంలో సాయన్న కుమార్తె నివేదిత ఇక్కడ 3వ స్థానానికి పరిమితం కావడం శ్రేణులను మరింత నిరాశ పర్చింది. BJP అభ్యర్థి వంశ తిలక్‌పై శ్రీ గణేశ్(INC) 13,206 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. కాంగ్రెస్‌కు 53651 మంది ఓటేసి గెలిపించారు. వంశ తిలక్‌కు 40445, నివేదితకు 34462 మంది ఓటేశారు.

News June 4, 2024

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో‌ BRS ఓటమి

image

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో‌ BRS పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. సిట్టింగ్‌ స్థానంలో సాయన్న కుమార్తె నివేదిత ఇక్కడ 3వ స్థానానికి పరిమితం కావడం శ్రేణులను మరింత నిరాశ పర్చింది. BJP అభ్యర్థి వంశ తిలక్‌పై శ్రీ గణేశ్(INC) 13,206 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. కాంగ్రెస్‌కు 53651 మంది ఓటేసి గెలిపించారు. వంశ తిలక్‌కు 40445, నివేదితకు 34462 మంది ఓటేశారు.

News June 4, 2024

బండి సంజయ్‌కు సర్టిఫికెట్ అందజేత

image

కరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఎస్ ఆర్ఆర్ కాలేజీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్టిఫికెట్‌ను ఆయనకు అందజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

News June 4, 2024

నా గెలుపు కార్యకర్తలకు అంకితం: బండి సంజయ్

image

కరీంనగర్ ఎంపీగా గెలిపించడానికి బీజేపీ కార్యకర్తలు గత మూడు నెలలుగా కష్టపడ్డారని, నా గెలుపును కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని అన్నారు.

News June 4, 2024

ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: పొంగులేటి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చరిత్ర సృష్టించాలన్నా దాన్ని తిరగరాయాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడతూ.. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయం సాధించడంతో హర్షం వ్యక్తం చేశారు. రఘురాంరెడ్డి గెలుపునకు కృషి చేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

News June 4, 2024

ఉమ్మడి వరంగల్‌లో కాంగ్రెస్‌ క్లీన్ స్వీప్

image

ఉమ్మడి వరంగల్‌‌లోని వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. బీఆర్ఎస్‌ సిట్టింగ్‌ స్థానాలను హస్తం కైవసం చేసుకుంది. వరంగల్‌లో కడియం కావ్యకు 2.20 లక్షల మెజార్టీ రాగా.. మహబూబాబాద్‌లో బలరాం నాయక్‌ 3.44 లక్షల భారీ ఆధిక్యం సాధించారు. కాగా ఈ రెండు స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అందరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉండటం గమనార్హం.

News June 4, 2024

గెలుపొందిన సర్టిఫికెట్ అందుకున్న రఘువీర్ రెడ్డి 

image

నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికిఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ , మాణిక్ రావు, సూర్యవంశీ , జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సర్టిఫికెట్ అందజేశారు. మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి వారితో ఉన్నారు. 

News June 4, 2024

ఇది మోదీ కుటుంబ సభ్యుల విజయం: ఎంపీ అరవింద్

image

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో తన విజయం పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క నిజామాబాద్ మోదీ కుటుంబ సభ్యుల విజయమని ఎంపీ అరవింద్ అన్నారు. మంగళవారం ఆయన ఎన్నికల కౌంటింగ్ హాల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారన్నారు. తనపై నమ్మకంతో రెండోసారి గెలిపించిన ప్రజల ఆశలను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

News June 4, 2024

ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్లు

image

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కలెక్టర్లు తెలిపారు. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, షేక్ రిజ్వాన్ బాషా, సీపీ అంబర్ కిషోర్ ఝా ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎల్ఈడీ స్క్రీన్, టీవీల ద్వారా వీక్షించారు.

News June 4, 2024

నల్గొండ నా బలం.. నల్గొండ నా బలగం: కోమటిరెడ్డి

image

నల్గొండలో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై నమ్మకంతో రఘువీర్‌ను అఖండ మెజార్టీతో గెలిపించిన నల్గొండ ప్రజానీకానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ కష్టసుఖాల్లో అండగా ఉంటానని మాటిస్తున్నానని తెలిపారు. ఇది నల్గొండ ప్రజల, కాంగ్రెస్ కార్యకర్తల కష్టఫలమని చెప్పారు. ‘నల్గొండ నా బలం బలగం’ అంటూ ట్వీట్ చేశారు.