Telangana

News June 4, 2024

సమస్యలు పరిష్కరిస్తా: ఈటల రాజేందర్

image

భారీ మెజార్టీతో గెలిపించిన మల్కాజిగిరి పార్లమెంటు ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధి హోలీ మేరీ కళాశాలలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా నిత్యం అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. మూడోసారి మోదీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.

News June 4, 2024

కరీంనగర్: మెజార్టీతో గెలవబోతున్న సంజయ్, అరవింద్

image

బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇద్దరు లక్షకుపైగా మెజార్టీతో గెలవబోతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బండి సంజయ్, నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ ఇద్దరు లక్షకుపైగా మెజార్టీతో గెలవబోతున్నారు. ప్రస్తుతం ఇద్దరు లక్షకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. అధికారికంగా ప్రకటించడమే తరువాయి.

News June 4, 2024

NZB: ప్రజా తీర్పును గౌరవిస్తా: జీవన్ రెడ్డి

image

ప్రజా తీర్పును గౌరవిస్తానని NZB పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో MPగా గెలిచిన BJP అభ్యర్థి ధర్మపురి అరవింద్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన అరవింద్ NZB పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, ఇప్పుడైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అరవింద్ కు సూచించారు.

News June 4, 2024

హుజురాబాద్: MLAగా ఓడి ఎంపీలుగా గెలవబోతున్నారు

image

గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటల రాజేందర్, కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్‌లు ఎమ్మెల్యేగా ఓటమి చెంది ఎంపీలుగా గెలువబోతున్నారు. ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు లక్షలకు పైగా మెజార్టీతో దూసుకుపోతున్నారు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లక్ష డెబ్బై వేలకు పైగా మెజార్టీతో ఉన్నారు.

News June 4, 2024

సమస్యలు పరిష్కరిస్తా: ఈటల రాజేందర్

image

భారీ మెజార్టీతో గెలిపించిన మల్కాజిగిరి పార్లమెంటు ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధి హోలీ మేరీ కళాశాలలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా నిత్యం అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. మూడోసారి మోదీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.

News June 4, 2024

NZB: ఎమ్మెల్యేగా ఓడి.. ఎంపీగా గెలిచి..!

image

నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ సిట్టింగ్ బీజేపీ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. కాగా ప్రస్తుతం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ప్రత్యర్థి అభ్యర్థి జీవన్ రెడ్డి పై భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు.

News June 4, 2024

‘పథకాలే భారీ మెజారిటీతో గెలిపించాయి’

image

కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలే తనను గెలిపించాయని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి తెలిపారు. ఖమ్మం మండలంలోని పొన్నెకల్ శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పార్లమెంట్ కౌంటింగ్ వద్ద ఆయన మాట్లాడారు. తన గెలుపునకు కృషి చేసిన మంత్రులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

News June 4, 2024

MBNR: హాట్ సీటుగా పాలమూరు !

image

పాలమూరు పార్లమెంట్ సీటు హాట్ సీటుగా మారింది. మహబూబ్ నగర్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతోంది. ఫలితాల్లో రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయి. ప్రస్తుతం స్వల్ప ఆధిక్యతలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి టఫ్ ఫైట్ ఇస్తున్నారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. NGKLలో మల్లు రవి ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

62,366 ఓట్ల మెజార్టీతో గోడం నగేశ్

image

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 17వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ 62,366 ఓట్ల మెజార్టీతో కొనసాగుతొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి 1,02,092, కాంగ్రెస్ అభ్యర్థి 3,65,688 బీజేపీ అభ్యర్థి 4,28,054 ఓట్లు సాధించారు.

News June 4, 2024

ఉత్కంఠగా మహబూబ్‌నగర్‌లో కౌంటింగ్

image

మహబూబ్‌నగర్ లోక్‌సభ ఓట్ల కౌంటింగ్ ఉత్కంఠంగా సాగుతోంది. 17వ రౌండ్ ముగిసేవరకూ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కేవం 3000 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. రౌండ్ రౌండ్‌కు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న కౌంటింగ్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మొదటి నుంచి లీడ్‌లో కొనసాగిన డీకే అరుణ ఆధిక్యం తాజాగా తగ్గడంతో కమలం పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.