Telangana

News June 4, 2024

నిజామాబాద్: బీజేపీ తగ్గేదేలే..!

image

నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం భారీ మెజార్టీ దిశగా ధర్మపురి అర్వింద్ దూసుకెళ్తున్నారు.1,22,890 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి

image

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం వెళ్లిపోయారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ లక్షకు పైగా మెజారిటీతో ఆధిక్యంలో ఉండడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల తీర్పును శిరసా వహిస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేరకు అర్వింద్ హామీలను అమలు చేయాలని కోరారు.

News June 4, 2024

1,00,760 ఓట్ల ఆధిక్యంలో ధర్మపురి అర్వింద్

image

నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ధర్మపురి అర్వింద్ 1,00,760 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

KNRలో బీజేపీ, పెద్దపల్లిలో కాంగ్రెస్!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం KNRలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ముందంజలో ఉన్నారు. KNRలో 12వ రౌండ్ వరకు బండి సంజయ్ 1,38,616 ఓట్లు, 11వ రౌండ్‌ వరకు వంశీ కృష్ణ 73,591 ఓట్లతో లీడ్‌లో కొనసాగుతున్నారు. బండి సంజయ్‌కు మొత్తం 3,31,529 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

WGL, మహబూబాబాద్‌లో కాంగ్రెస్ జోరు

image

వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థులు వరంగల్‌లో కడియం కావ్య 1,53,918 ఓట్ల మెజార్టీ, మహబూబాబాద్‌లో బలరాం నాయక్‌ 2,84,897 ఓట్ల భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికీ కావ్యకు 4,23,137 ఓట్లు రాగా.. బలరాం నాయక్‌కు 5,19,052 ఓట్లు వచ్చాయి. కాసేపట్లో రెండు స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి.

News June 4, 2024

12వ రౌండ్: 1,38,616 బండి సంజయ్ ఆధిక్యం

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ప్రతి రౌండ్‌లో ఆధిక్యతను కనబరుస్తూ దూసుకుపోతున్నారు. 12వ రౌండ్ ముగిసేసరికి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై 1,38,616 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బిజెపికి 3,31,529 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 1,92,913 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్‌కు 1,57,061 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

MBNRలో బీజేపీ, NGKLలో కాంగ్రెస్ జోరు !

image

ఉమ్మడి జిల్లాలోని 2 పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ముందంజలో ఉన్నారు. MBNRలో 11వ రౌండ్ వరకు డీకే అరుణ 15,067 ఓట్లు, 12వ రౌండ్‌ వరకు మల్లు రవి 42,825 ఓట్లతో లీడ్‌లో కొనసాగుతున్నారు. DK అరుణకు మొత్తం 2,85,843, మల్లుకు 2,80,145 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

కరీంనగర్‌లో దూసుకుపోతున్న “బండి”

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రతి రౌండ్‌లో ఆధిక్యతను కనబరుస్తూ దూసుకుపోతున్నారు. 11వ రౌండ్ ముగిసేసరికి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై 1,25,575 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీకి 3,02,198 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 1,76,623 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్‌కు 1,44,541 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

చేవెళ్ల: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఐదో రౌండ్ వివరాలు

image

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఐదో రౌండ్ వివరాలు మహేశ్వరం: కాసాని జ్ఞానేశ్వర్‌కు 1723, విశ్వేశ్వర్ రెడ్డికి 6745, రంజిత్ రెడ్డికి 4091 ఓట్లు వచ్చాయి. రాజేంద్రనగర్: కాసాని జ్ఞానేశ్వర్‌కు 1361, విశ్వేశ్వర్ రెడ్డికి 10064, రంజిత్ రెడ్డికి 6556 ఓట్లు వచ్చాయి. శేరిలింగంపల్లి: కాసాని జ్ఞానేశ్వర్‌కు 1521, విశ్వేశ్వర్ రెడ్డికి 8145, రంజిత్ రెడ్డికి 4828 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

నిజామాబాద్: కొనసాగుతున్న బీజేపీ హవా

image

నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. రౌండ్ రౌండ్‌కి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ధర్మపురి అర్వింద్ 58,306 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.