Telangana

News June 4, 2024

2,55,082 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ముందంజ

image

నల్గొండ పార్లమెంట్ 17వ రౌండ్ ఫలితాలు వెలువడే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి 2,55,082 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఈ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి 3,78,649 ఓట్లు రాగా
బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 1,23,567 ఓట్లు వచ్చాయి.
బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి 1,04,457 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.

News June 4, 2024

NZB: BRS మాజీ మంత్రి, MLA ఇలాకాలో BJP అభ్యర్థి హవా

image

NZB పార్లమెంట్ కౌంటింగ్ లో బాల్కొండ నియోజకవర్గంలో BRS మాజీ మంత్రి, MLA ఇలాకాలో BJP అభ్యర్థి అర్వింద్ ధర్మపురి హవా కొనసాగుతోంది. 8వ రౌండు కౌంటింగ్ వరకు మొత్తం 97,909 ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు అరవింద్ ధర్మపురి 49,865 ఓట్లు సాధించి 16,891 మెజారిటీతో ఉన్నారు. ఇక 32,974 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 2వ స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ 9,452 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

News June 4, 2024

మూడో రౌండ్‌లో ధర్మపురి అర్వింద్ ముందంజ

image

నిజామాబాద్ ఎంపీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పై 29,683 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

మహబూబాబాద్: 5 రౌండ్లు పూర్తి.. 83,912 ఓట్ల ఆధిక్యం

image

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం కౌంటింగ్‌లో భాగంగా 5వ రౌండ్‌లో పోలైన ఓట్లు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌కి మొత్తం 1,54,211 ఓట్లు రాగా.. BRS అభ్యర్థి మాలోత్ కవితకు 70,299 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి 83,912 ఓట్లతో భారీ మెజార్టీలో ఉన్నారు.

News June 4, 2024

జహీరాబాద్‌లో కాంగ్రెస్ హవా

image

జహిరాబాద్‌లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షట్కార్ 13,074 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

NZB: కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయిన BRS కౌంటింగ్ ఏజెంట్లు

image

నిజామాబాద్ పార్లమెంట్ కౌంటింగ్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో వెనుకబడిపోయిన పోలింగ్ ఓట్లను చూసి నిరాశ పడిన పలువురు BRS కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ హాల్ నుంచి నిరాశతో బయటకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్తున్నారని మీడియా పాయింట్ వద్ద నిలబడిన పలువురు జర్నలిస్టులు వారిని ప్రశ్నిస్తే ఇంకేముంది అంటూ పెదవి విరుస్తూ మెల్లగా జారుకున్నారు.

News June 4, 2024

63,985 ఓట్లతో బండి సంజయ్ లీడ్

image

కరీంనగర్‌లో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదో రౌండ్ లెక్కింపు ముగిసేసరికి BJP అభ్యర్థి బండి సంజయ్ 63,985 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఐదో రౌండ్ ముగిసే సరికి బీజేపీ 1,42,675, కాంగ్రెస్ 78,690, బీఆర్ఎస్ 66,351 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

HYD: కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: కిషన్ రెడ్డి

image

ప్రజల ఆశీర్వాదం భాజపాకు ఉంది.. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులతో భాజపా భారీ విజయం సాధించబోతుందన్నారు. జూన్‌ రెండో వారంలో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు.

News June 4, 2024

HYD: కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: కిషన్ రెడ్డి

image

ప్రజల ఆశీర్వాదం భాజపాకు ఉంది.. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులతో భాజపా భారీ విజయం సాధించబోతుందన్నారు. జూన్‌ రెండో వారంలో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. 

News June 4, 2024

18,498 ఓట్ల ఆధిక్యంలో కడియం కావ్య

image

వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 2వ రౌండ్ పూర్తయ్యే సరికి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు 61,611 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌కు 43,113, బీఆర్ఎస్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ 28,195 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 18,498 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.