India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొన్ని నెలల క్రితం వేసిన హైవే రోడ్డు కొట్టుకపోతే ఎలా అని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ అధికారులను ప్రశ్నించారు. నిన్న కురిసిన భారీ వర్షంతో హవేలీ ఘనాపూర్ మండలం నాగపూర్ గేట్ సమీపంలో కొట్టుకుపోయిన రోడ్డును మంత్రి పరిశీలించారు. నిన్న కారుతో పాటు వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. సరైన ప్రణాళిక లేకుండా హైవే ఇంజనీరింగ్ అధికారులు సరైనా అంచనా వేయకపోవడం శోచనీయమన్నారు.
నిజాంపేట మండల పరిధిలోని నందిగామలో కూలిన బ్రిడ్జిని మంత్రి దామోదర రాజనర్సింహ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలకు ప్రజలు అధైర్య పడవద్దని, వర్షానికి నష్టపోయిన వారికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. కలెక్టర్ స్థాయి అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు అందుబాటులో ఉన్నారని, ఏదైనా సమస్య ఉంటే వారికి తెలపాలని సూచించారు.
నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) గ్రామంగా మార్చుటకు కృషి చేస్తామని ఎంపీ గోడం నగేష్ హమిచ్చారు. గురువారం ఆదిలాబాదులోని ఆయన నివాసంలో గ్రామస్థులు ఎంపీను మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తపల్లి గ్రామంలో ఉన్న శ్రీహనుమాన్ ఆలయానికి ప్రహరీ కోసం రూ.5 లక్షలు మంజూరు చేశారు. కార్యక్రమంలో చౌహన్ దిగంబర్, గుణవంతరావు, శ్యామరావు, కేశవ్, దీపక్, ప్రవీణ్ నాయక్ తదితరులున్నారు.
మహానగరంలో వైభవంగా జరిగే గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రై కమిషనరేట్ల కమిషనర్లు అందుకు తగ్గ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. శోభాయాత్ర జరిగే సెప్టెంబర్ 6న 30,000 మంది పోలీసులను రంగంలోకి దించనున్నారు. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలని ఇప్పటికే కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
BEdలో చేరాలనుకునే అభ్యర్థులకు ప్రభుత్వం చిట్ట చివరి అవకాశం కల్పిస్తోంది. రేపటి నుంచి (29వ తేదీ)నుంచి సెప్టెంబర్ 2 వరకు ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. రేపటినుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ పేమెంట్ చేయడంతోపాటు అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని సూచించారు. ఎంపికైన వారి వివరాలు 11న వెల్లడిస్తామన్నారు.
వచ్చేనెల 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి BRS కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అటు NDA అభ్యర్థికి గానీ, ఇండీ కూటమి అభ్యర్థికి గానీ ఓటు వేయకూడదని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేత వినోద్ కుమార్ తెలిపారు.
అభివృద్ధి పనుల్లో భాగంగా సికింద్రాబాద్ నుంచి నడిపే పలు రైళ్ల స్టేషన్లు నవంబర్ 26 వరకు ఇతర స్టేషన్లకు మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సిద్దిపేట రూట్‌లో వెళ్లే ట్రైన్ మల్కాజిగిరి నుంచి, పుణె రూట్‌లో నడిచే ట్రైన్లు నాంపల్లి నుంచి నడుస్తాయి. అలాగే దర్బంగ, సిల్చార్, అగర్తల, యశ్వంత్‌పుర, రాక్సాల్ స్టేషన్లకు వెళ్లే రైళ్లు చర్లపల్లి నుంచి నడుస్తాయని సీపీఆర్‌వో తెలిపారు.
వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే అధికారులు ఆస్తి, పంట నష్టంపై నివేదిక అందజేసి, నష్టపరిహారంపై ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలని నిజామాబాద్ MPఅరవింద్ ధర్మపురి జిల్లా కలెక్టర్ ను కోరారు. నష్టపరిహారంపై తాను కూడా ముఖ్యమంత్రి కి లేఖ రాస్తానని, విపత్తు నిర్వహణపై హోం శాఖకి సైతం నివేదిస్తానన్నారు. కాగా వరద బాధితులను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి, కనీస సౌకర్యాలు అందించాలన్నారు.
ప్రజాపోరాటం, దమనకాండకు చిహ్నంగా నిలిచిన బషీర్‌బాగ్ రక్తపాతానికి నేటికి 25 ఏళ్లు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నాటి చంద్రబాబు సర్కార్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం అది. అదే 2000 AUG 28న ‘చలో అసెంబ్లీ’ నినాదం. నిరసనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయగా.. రాళ్ల వర్షంతో వారంతా తిరగబడ్డారు. పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టగా.. రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి ప్రాణాలు విడిచారు.
రానున్న 48 గంటల వరకు భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను, అనవసరంగా ఎవరు బయటకు రాకూడదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం హెచ్చరించారు. విద్యుత్ తీగల వద్దకు ఎవరు వెళ్ళకూడదని, ఎలాంటి అపోహలను నమ్మవద్దని ఆయన సూచించారు. ప్రజల భద్రతా దృష్ట్యా 24 X 7 పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.