Telangana

News June 4, 2024

ELECTION RESULTS: ఫస్ట్ సికింద్రాబాద్.. లాస్ట్ హైదరాబాద్!

image

లోక్‌సభ ఎన్నికల ఘట్టం నేటితో తుది దశకు చేరుకుంది. సరిగ్గా ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవనుంది. HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కలిపి మొత్తం 155 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా మొదట సికింద్రాబాద్ రిజల్ట్ సా.4గంటలకల్లా రానుంది. సా.4.40కి మల్కాజిగిరి, సా.5కి చేవెళ్ల, సా.5.20కి HYD రిజల్ట్ రానుంది. ఇక కంటోన్మెంట్ ఫలితం మ.3కే తేలనుంది.

News June 4, 2024

ELECTION RESULTS: ఫస్ట్ సికింద్రాబాద్.. లాస్ట్ హైదరాబాద్!

image

లోక్‌సభ ఎన్నికల ఘట్టం నేటితో తుది దశకు చేరుకుంది. సరిగ్గా ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవనుంది. HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కలిపి మొత్తం 155 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా మొదట సికింద్రాబాద్ రిజల్ట్ సా.4గంటలకల్లా రానుంది. సా.4.40కి మల్కాజిగిరి, సా.5కి చేవెళ్ల, సా.5.20కి HYD రిజల్ట్ రానుంది. ఇక కంటోన్మెంట్ ఫలితం మ.3కే తేలనుంది.

News June 4, 2024

MP RESULTS: మొదట నల్గొండ, తర్వాత భువనగిరి

image

NLG, BNR లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. MLGలో తొలుత లెక్కింపు పూర్తవనుండగా.. ఆ తర్వాత వరుసగా SRPT, NLG, KDD, HNR, సాగర్‌ చివరగా DVK ఓట్ల లెక్కింపు పూర్తవనుంది. BNR లోక్‌సభ పరిధి ఇబ్రహీంపట్నంలో 343 పోలింగ్‌ స్టేషన్లుండగా .. ఇక్కడ 20 టేబుళ్లను, మునుగోడు, తుంగతుర్తి, BNR, NKL, ALR, జనగామలో 14 టేబుళ్లలో ఓట్లను లెక్కించనున్నారు. మొదట నల్గొండ, తర్వాత భువనగిరి ఎంపీ ఎవరో తేలనుంది.

News June 4, 2024

ADB: నేడే కౌంటింగ్.. గంటకు నాలుగు రౌండ్లు

image

ఆదిలాబాద్ పార్లమెంట్‌లో మొత్తం 156 రౌoడ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఒక్కో టేబుల్‌పై 14 ఈవీఎంలను అధికారులు లెక్కించనున్నారు. మొత్తం ఓట్లు 16,50,175 ఉండగా 12,21,583 ఓట్లు పోలయ్యాయి. 74.03 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం ఏడు కౌంటింగ్ హాల్స్ ఉండగా ప్రతి కౌంటింగ్ హాల్‌లో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో 21 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. గంటకు నాలుగు రౌండ్లు చొప్పున లెక్కించనున్నారు.

News June 4, 2024

రాష్ట్రంలో మెుదటి ఫలితం నిజామాబాద్‌దే..!

image

రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. తొలి ఫలితం మధ్యాహ్నం ఒంటి గంట వరకే వెలువడే అవకాశం ఉంది. తుది ఫలితం సాయంత్రం 6 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది. కాగా తొలి ఫలితం నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో వెలువడనుంది. ఈ నియోజకవర్గంలో కేవలం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కాగా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

News June 4, 2024

హుస్నాబాద్: అమరుల కుటుంబాలకు పెన్షన్: మంత్రి పొన్నం

image

తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తి మేరకే తెలంగాణ ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నానని అన్నారు. 12వ ఆవిర్భావ దినోత్సవంలోపు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అమరవీరుల కుటుంబాలకు రూ.25 వేల పెన్షన్, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం అందజేస్తామని అన్నారు.

News June 4, 2024

ఆదిలాబాద్: 8 గంటలకు షురూ..3 గంటలకు పూర్తి..!

image

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభం కానుంది. దీనికి వేరువేరుగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ స్థానాల వారిగా పోలైన ఓట్లు, మొత్తం పోలింగ్ బూత్ ల ఆధారంగా లెక్కింపుకు టేబుళ్లను సిద్ధం చేశారు. ఉదయం 8 ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా పూర్తిస్థాయి ఫలితాల వెల్లడికి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చే అవకాశముంది.

News June 4, 2024

MBNR: కోడ్ ముగియగానే గృహజ్యోతి అమలు !

image

6 గ్యారంటీ పథకాలలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల కోడ్ ముగియగానే అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈనెల 5న కోడ్ ముగిసిన వెంటనే 6వ తేదీ నుంచి గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు జారీ చేసేందుకు అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారి చేశారు. గృహలక్ష్మి పథకం అమలు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంస్థపై రూ.10 కోట్ల భారం పడుతుందని అంచనా వేశారు.

News June 4, 2024

24 రౌండ్స్‌లో పూర్తికానున్న నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్

image

నల్గొండ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు 24 రౌండ్స్ లో పూర్తి కానుంది. కౌంటింగ్ కోసం మొత్తం 8 హాల్స్ 122 టేబుల్ ఏర్పాటు చేశారు. 2061 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను ఉదయం 8 గంటల నుంచి లెక్కించనున్నారు. నల్లగొండ పార్లమెంట్ ‌లో 74.02 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 17,25,465 మంది ఓటర్లకు గాను 12,77,137 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

News June 4, 2024

హైదరాబాద్‌లోని: నేడే కౌంటింగ్.. అంతా సిద్ధం

image

రాజధాని పరిధి‌ 4 MP స్థానాలు, కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక‌ కౌంటింగ్‌ నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. ఇప్పటికే RR జిల్లా కలెక్టర్ శశాంక, VKB కలెక్టర్‌ నారాయణరెడ్డి గొల్లపల్లిలోని కౌంటింగ్‌ సెంటర్‌ను పరిశీలించారు. HYD జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్‌ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో‌ ఏర్పాట్లపై ఆరా తీశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా‌ లెక్కింపు చేపట్టాలని అధికారులకు సూచించారు.