Telangana

News June 3, 2024

చామల.. బూర.. క్యామ.. వీరిలో మన MP ఎవరు?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో భువనగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి క్యామ మల్లేశ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, BJP నుంచి బూర నర్సయ్య పోటీలో ఉన్నారు. కాగా భువనగిరి నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్లు స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు. చాలా సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని వెల్లడించాయి.

News June 3, 2024

MBNR: ఎన్నికల ఫలితాలను ఇలా తెలుసుకోవచ్చు

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని MBNR, NGKL నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న క్రమంలో తమ తమ నియోజకవర్గాల్లోని ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఎన్నికలసంఘం అధికారిక వెబ్ సైట్ results.eci.gov.inను అందుబాటులోకి తీసుకువచ్చింది. మీరు కూడా వెబ్‌సైట్‌ను సంప్రదించి ఫలితాలను తెలుసుకోండి

News June 3, 2024

రేవంత్ పాలనలో ‘తెలంగాణ పదం’ మాయమైంది: హరీశ్ రావు

image

ఉద్యమాలతో ఏర్పడ్డ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ పదం మాయమైందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రిక ప్రకటనలలో ఎక్కడా కూడా జై తెలంగాణ పదం లేదని అన్నారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని హరీశ్ రావు అన్నారు.

News June 3, 2024

RTV Survey: మెదక్, ZHBలో BJP గెలుపు!

image

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల సందర్భంగా RTV Survey‌‌ తాజాగా వివరాలు వెల్లడించింది‌. రాష్ట్రంలో BJP-10, INC-6, BRS-0, MIM- ఒక స్థానంలో‌ గెలిచే అవకాశం ఉన్నట్లు‌ తెలిపింది. మెదక్, జహీరాబాద్‌లో‌ BJP‌ గెలవబోతున్నట్లు‌ RTV Survey‌‌ పేర్కొంది. మెదక్, జహీరాబాద్‌లో కాంగ్రెస్, BRS ఖాతా తెరవదని‌ అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 3, 2024

KMR: అన్న భూమిపట్టా మార్పిడి చేయలేదని తమ్ముడి ఆత్మహత్య

image

నాగిరెడ్డిపేట మండలం బెజ్గం చెరువు తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రగుంట తండాకు చెందిన మలావత్ కేవుల (36) కల్లులో విషం కలుపుకొని మృతి చెందినట్లు ఎస్సై రాజు తెలిపారు. మృతుడి కేవులకు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. పెద్దవాడైన సక్రు పైన భూమి పట్టా ఉన్నందున తన పేరు పై పట్టా మార్పిడి చేయాలని పలుమార్లు కోరాడు. అన్న సక్రు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది కేవుల సూసైడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.

News June 3, 2024

RTV సర్వే: వరంగల్ బీజేపీ, మహబూబాబాద్ కాంగ్రెస్!

image

వరంగల్ స్థానం బీజేపీదేనని RTV సర్వే తేల్చి చెప్పింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున అరూరి రమేశ్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీఆర్ఎస్ నుంచి మారేపల్లి సుధీర్‌కుమార్ బరిలో ఉన్నారు. మహబూబాబాద్ స్థానంలో కాంగ్రెస్ గెలుపొందనుందని ఈ సర్వే పేర్కొంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోరిక బలరాం నాయక్, బీజేపీ తరఫున అజ్మీరా సీతారాంనాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత పోటీలో ఉన్నారు.

News June 3, 2024

RTV సర్వే: కరీంనగర్ బీజేపీ, పెద్దపల్లి కాంగ్రెస్!

image

కరీంనగర్ స్థానం బీజేపీదేనని RTV సర్వే తేల్చి చెప్పింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్‌రావు, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్ బరిలో ఉన్నారు. పెద్దపల్లి స్థానంలో కాంగ్రెస్ గెలుపొందనుందని ఈ సర్వే పేర్కొంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గడ్డం వంశీకృష్ణ, బీజేపీ తరఫున గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ నిల్చున్నారు.

News June 3, 2024

మందమర్రి: కాలకృత్యాలకు వెళ్లి యువకుడి మృతి

image

కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ఒక యువకుడు మృతి చెందిన ఘటన మందమర్రిలో చోటు చేసుకుంది. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. విద్యానగర్‌కు చెందిన శ్యాంసుందర్(30) ఉదయం కాలకృత్యాలకు బాత్రూంలోకి వెళ్లి బయటికి రాకపోవడంతో కుటుంబీకులు డోర్లు పగలగొట్టి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. 108కు కాల్ చేయగా సిబ్బంది వచ్చి పరిశీలించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. మృతుని తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News June 3, 2024

ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం : కేటీఆర్

image

నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీ <<13368558>>హిందూపూర్ వాటర్ ట్యాంక్‌లో <<>>మృతదేహం లభించిన ఘటనపై ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ట్విటర్ (ఎక్స్) వేదికగా నిప్పులు చెరిగారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని విమర్శించారు.

News June 3, 2024

REWIND 2023: కంటోన్మెంట్‌లో BRS గెలుపు!

image

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌‌లో 1,23,397 ఓట్లు పోలయ్యాయి.
లాస్య నందిత(BRS)-59,057(WIN)
శ్రీ గణేశ్(BJP)-41,888
వెన్నెల(INC)-20,825 ఓట్లు పడ్డాయి.
లాస్య నందిత అకాల మరణంతో‌ ఉపఎన్నిక అనివార్యమైంది. గతంలో BJP నుంచి పోటీ చేసి ఓడిన శ్రీ గణేశ్‌ ప్రస్తుతం INC నుంచి పోటీ చేశారు.‌ నివేదిత సాయన్న(BRS), వంశతిలక్‌(BJP) బరిలో ఉన్నారు. ఉప ఎన్నికలో 1,30,929 మంది ఓటేశారు. మరి గెలుపెవరిది.. మీ కామెంట్?