Telangana

News June 3, 2024

HYD: పాలిసెట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

image

పాలిసెట్ ఫలితాల్లో రాజధాని విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. HYDలో 10,095 మంది పరీక్ష రాయగా..84.40% ఎంపీసీ, 80.73% బైపీసీ, RR జిల్లాలో మొత్తం 4,103 మంది పరీక్ష రాయగా.. 86.74% ఎంపీసీ, 83.55% బైపీసీ, మేడ్చల్ జిల్లాలో మొత్తం 4,267 మంది పరీక్ష రాయగా.. 91.74% ఎంపీసీ, 84.09% బైపీసీ, VKB జిల్లాలో మొత్తం 1145 మంది పరీక్ష రాయగా..86.99% ఎంపీసీ, 85.59% బైపీసీలో ఉత్తీర్ణత సాధించినట్లుగా అధికారులు వెల్లడించారు.

News June 3, 2024

కరీంనగర్: సీఎంను కలిసిన సివిల్ ర్యాంకర్

image

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సాయికిరణ్ ఇటీవల విడుదలైన సివిల్స్-2023 ఫలితాల్లో ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాధించిన విషయం తెలిసిందే. సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కుటుంబ సభ్యులతో కలిసి సాయి కిరణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సివిల్స్ ర్యాంకర్‌ను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు.

News June 3, 2024

HYD: పాలిసెట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

image

పాలిసెట్ ఫలితాల్లో రాజధాని విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. HYDలో 10,095 మంది పరీక్ష రాయగా..84.40% ఎంపీసీ, 80.73% బైపీసీ, RR జిల్లాలో మొత్తం 4,103 మంది పరీక్ష రాయగా.. 86.74% ఎంపీసీ, 83.55% బైపీసీ, మేడ్చల్ జిల్లాలో మొత్తం 4,267 మంది పరీక్ష రాయగా.. 91.74% ఎంపీసీ, 84.09% బైపీసీ, VKB జిల్లాలో మొత్తం 1145 మంది పరీక్ష రాయగా..86.99% ఎంపీసీ, 85.59% బైపీసీలో ఉత్తీర్ణత సాధించినట్లుగా అధికారులు వెల్లడించారు.

News June 3, 2024

BREAKING: గోల్కొండ బోనాల జాతర తేదీల ప్రకటన

image

భాగ్యనగర్ శ్రీమహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు ఈరోజు మాట్లాడారు. ఈ ఏడాది HYD గోల్కొండలో ఆషాఢ మాసం బోనాల జాతరను జులై 7వ తేదీన ప్రారంభించనున్నామని తెలిపారు. ఇక పాతబస్తీలోని లాల్‌దర్వాజ సహా అన్ని ఆలయాల్లో జులై 19న ఉత్సవాలు ప్రారంభమవుతాయని, జులై 28న బోనాలు సమర్పిస్తామని చెప్పారు. 29వ తేదీన జాతర, సామూహిక ఘటాల ఊరేగింపు ఉంటుందని వెల్లడించారు. SHARE IT

వెంకట్రామిరెడ్డి.. రఘునందన్.. నీలం మధు.. వీరిలో మన MP ఎవరు?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో మెదక్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు, BJP నుంచి రఘునందన్ రావు పోటీలో ఉన్నారు. కాగా మెదక్‌లో BRS, కాంగ్రెస్ మధ్య టఫ్ పైట్ ఉందని సర్వేల్లో వెల్లడవగా త్రిముఖ పోటీ ఉంటుందని స్థానిక నేతలు అంటున్నారు. KCR, హరీశ్ రావు సొంత ఇలాకా కావడంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

మన ఎంపీ బలరాంనా.. కవితనా.. సీతారాం నా?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో మహబూబాబాద్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి మాలోతు కవిత, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, BJP నుంచి అజ్మీరా సీతారాం నాయక్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

రేపే RESULTS.. ఆదిలాబాద్ ఎంపీ ఎవరు..?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో ఆదిలాబాద్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి ఆత్రం సక్కు, కాంగ్రెస్ నుంచి సుగుణ, BJP నుంచి గోడం నగేశ్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

పెద్దపల్లి: రైళ్ల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు!

image

కాజీపేట- బల్లార్షా స్టేషన్ల మధ్య రైళ్లు తరచూ రద్దవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కంటే ముందు అందుబాటులో ఉన్న కాజీపేట- అజ్ని కరోనా సమయంలో రద్దయింది. దాని స్థానంలో ఎక్స్ ప్రెస్ రైలును తీసుకొచ్చినప్పటి 7 నెలల క్రితం అది కూడా రద్దయింది. పెద్దపల్లి- విజయవాడ మధ్య నడిచే పుష్పుల్ డెమో రైలును సైతం రద్దు చేశారు. ఈ రైళ్లను పునరుద్ధరించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

News June 3, 2024

నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు: చిన్నారెడ్డి

image

నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని సోమవారం చిన్నారెడ్డి అన్నారు. నాణ్యత కలిగిన విత్తనాలనే రైతులు కొనాలని సూచించారు. రైతులు విత్తనాలు కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే స్థానిక వ్యవసాయ అధికారులకు గాని, పోలీసులకు గాని సమాచారం చేరవేయాలి అన్నారు. వారిపై చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.