Telangana

News June 3, 2024

రఘువీర్.. కృష్ణారెడ్డి.. సైదిరెడ్డి.. వీరిలో మన MP ఎవరు?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో నల్గొండ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి, BJP నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీలో ఉన్నారు. కాగా నల్గొండ నుంచి కాంగ్రెస్ గెలుస్తుందని దాదాపు అన్ని సర్వేల్లో వెల్లడైంది. భారీ మెజార్టీ వస్తోందని హస్తం పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మీరేమంటారు.

News June 3, 2024

మన ఎంపీ వంశీకృష్ణనా.. కొప్పులనా.. శ్రీనివాసా?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో పెద్దపల్లి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, BJP నుంచి గోమాస శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో గంటల తరబడి క్యూలైన్ భక్తులు వేచి చూశారు. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

News June 3, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు ఇలా…

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా రాజోలిలో 147.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా బిజ్వారులో 97.5 మి.మీ, నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో 84.5 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా దోనూర్లో 77.5 మి.మీ, వనపర్తి జిల్లా సోలిపూర్లో 76.0 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదయింది.

News June 3, 2024

పటాన్‌చెరులో యువకుడి మృతి

image

క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన యువకుడు మృతిచెందిన ఘటన పటాన్‌చెరు అమీన్‌పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కిష్టారెడ్డిపేటలో ఉంటున్న అరుణ్(22) స్నేహితులతో కలిసి దాయెరలోని క్వారీ గుంతలోని నీటిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. నీటిలోకి వెళ్లిన అరుణ్ పైకిరాలేదు. చీకటి పడుతున్న పైకి రాకపోవడంతో ఇంటికెళ్లి తల్లి ఉమకు సమాచారమిచ్చారు. ఆదివారం పోలీసులు పరిశీలించగా మృతదేహం కనిపించింది.

News June 3, 2024

మన ఎంపీ RRRనా లేక నామానా లేక తాండ్రానా..?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో ఖమ్మం ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి నామా, కాంగ్రెస్ నుంచి RRR, BJP నుంచి తాండ్ర వినోద్ రావు పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని పలు సర్వేల్లో వెల్లడైంది. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

సంగారెడ్డి: ‘నేటి నుంచి జరిగే బడిబాట వాయిదా’

image

సంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో జరగాల్సిన బడి బాట కార్యక్రమాన్ని ప్రభుత్వ వాయిదా వేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరిగి బడి బాట ఎప్పుడు నిర్వహించాలనేది ప్రభుత్వం త్వరలోనే తేదీలను ప్రకటించనుందని పేర్కొన్నారు.

News June 3, 2024

FLASH: HYDలో మరోసారి డ్రగ్స్ కలకలం  

image

HYDలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఫిలింనగర్ PS పరిధిలో ఓ డ్రగ్స్ విక్రేతను అరెస్ట్ చేశామని, 16 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కొకైన్ అమ్ముతూ నైజీరియా దేశస్థుడు ఒకొరియో కాస్మోస్ అలియాస్ ఆండీ పట్టుబడ్డాడని తెలిపారు. అతడు నగరంలో పలువురు యువకులకు రెగ్యులర్‌గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News June 3, 2024

FLASH: HYDలో మరోసారి డ్రగ్స్ కలకలం

image

HYDలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఫిలింనగర్ PS పరిధిలో ఓ డ్రగ్స్ విక్రేతను అరెస్ట్ చేశామని, 16 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కొకైన్ అమ్ముతూ నైజీరియా దేశస్థుడు ఒకొరియో కాస్మోస్ అలియాస్ ఆండీ పట్టుబడ్డాడని తెలిపారు. అతడు నగరంలో పలువురు యువకులకు రెగ్యులర్‌గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News June 3, 2024

NLG: ఖరీఫ్ సాగుకు రైతన్న సన్నాహాలు

image

గతేడాది వ్యవసాయంలో ఎదురైన కష్టనష్టాలను పక్కనబెట్టి, మళ్లీ ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండుతాయన్న ఆశతో రైతన్నలు ఖరీఫ్ కు అన్ని విధాలుగా ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాలో అడపాదడపా కురుస్తున్న చిన్నపాటి వర్షాలకు రైతులు దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు పుడమితల్లిని పదును చేస్తున్నారు. ఇప్పటికే రైతులు విత్తనాల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు.