Telangana

News June 27, 2024

మెదక్: ఐటీఐఆర్‌ను కేంద్రం మళ్లీ తీసుకురావాలి: జగ్గారెడ్డి

image

కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌‌ను మళ్లీ తీసుకురావాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యేTGPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. 2014లో అధికారంలోకి వచ్చిన BJP సర్కార్ ITIRను రద్దు చేశారని తెలిపారు. దీన్ని రద్దు చేయకపోతే ఈ పదేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు వినతి పత్రం సమర్పిస్తానని ఆయన అన్నారు.

News June 27, 2024

ఆర్మూర్ అభివృద్ధి కోసం పోరాటానికి సిద్ధం: ఎమ్మెల్యే

image

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఆర్మూర్ నియోజకవర్గంలోనూ పైలెట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించాలన్నారు. దీనిపై వారం రోజులలో ప్రభుత్వం నిర్ణయం తెలపాలన్నారు. లేకపోతే దీక్ష చేయడానికి అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

News June 27, 2024

మాజీ సీఎంను కలిసిన ఉమ్మడి జిల్లా నేతలు

image

వనపర్తి జిల్లా BRS ముఖ్య నేతలు మాజీ CM కేసీఆర్‌ను ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని తాజా రాజకీయ అంశాలపై జిల్లా నేతలతో కేసీఆర్ చర్చించినట్లు, పార్టీ శ్రేణులు ధైర్యంగా ముందుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలలో BRS సత్తాచాటాలని కేసీఆర్ సూచించినట్లు జిల్లా అధ్యక్షులు గట్టుయాదవ్ తెలిపారు. పార్టీనేతలు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News June 27, 2024

గాంధీ ఆసుపత్రికి రూ.66 కోట్ల నిధులు

image

గాంధీ ఆసుపత్రి అభివృద్ధి పనులు, కాలేజీ విద్యార్థుల వసతి గృహాల నిర్మాణాలకు గాను రూ. 66 కోట్ల నిధులు మంజూరు చేసిన CM రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి​ దామోదర రాజనర్సింహాకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు కృతజ్ఞతలు తెలిపారు. TGMSIDC ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి హేమంత్‌​ను రాజారావు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

News June 27, 2024

గాంధీ ఆసుపత్రికి రూ.66 కోట్ల నిధులు

image

గాంధీ ఆసుపత్రి అభివృద్ధి పనులు, కాలేజీ విద్యార్థుల వసతి గృహాల నిర్మాణాలకు గాను రూ. 66 కోట్ల నిధులు మంజూరు చేసిన CM రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి​ దామోదర రాజనర్సింహాకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు కృతజ్ఞతలు తెలిపారు. TGMSIDC ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి హేమంత్‌​ను రాజారావు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్కను అందజేసి  శుభాకాంక్షలు తెలిపారు. 

News June 27, 2024

MNCL: బ్యాడ్మింటన్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి

image

మంచిర్యాలలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఈ నెల 27 నుంచి 30 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ యువీఎన్ బాబు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్లూరు సుధాకర్, టోర్నమెంట్ మ్యాచ్ కంట్రోలర్ కుమార్, జిల్లా కోశాధికారి సత్యపాల్ రెడ్డి, తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.

News June 27, 2024

ఖమ్మం: వ్యాయామంపై పిల్లలు ఆసక్తి కనబరచాలి: అదనపు కలెక్టర్

image

పిల్లలు మంచి పౌరులుగా ఎదగడానికి చదువుతోపాటు వ్యాయామం కూడా ఎంతో అవసరమని ఖమ్మం అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో వ్యాయమ విద్య ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన ఒకరోజు అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు వ్యాయామం ఎంతో అవసరమన్నారు. పిల్లలకు వ్యాయామం క్రీడల వల్ల లభిస్తుందన్నారు.

News June 27, 2024

జూలై 1 లోగా పూర్తి చేయాలి: కలెక్టర్ నారాయణ రెడ్డి

image

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను జూలై 1 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి విద్యాశాఖ కార్యక్రమాలపై విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను అప్పజెప్పడం జరిగిందని అన్నారు.

News June 27, 2024

KNR: వయోవృద్ధుల సమస్యలను సత్వరమే పరిష్కరించండి: కలెక్టర్

image

కొడుకులు ఇబ్బందులు పెట్టే వయోవృద్ధులు, తల్లిదండ్రులకు అధికారులు అండగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ చట్టం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ఆమె సమీక్షా నిర్వహించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. కొడుకులను పిలిపించి తగిన కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యలు పరిష్కరించాలన్నారు.

News June 27, 2024

రేపు మేడారం హుండీల లెక్కింపు

image

మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల హుండీల లెక్కింపును రేపు గురువారం ప్రారంభించనునట్లు మేడారం ఈవో రాజేంద్రం తెలిపారు. పూజారులు, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారుల భారీ బందోబస్తు నడుమ మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయం ఆవరణలో హుండీల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.