India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొడుకులు ఇబ్బందులు పెట్టే వయోవృద్ధులు, తల్లిదండ్రులకు అధికారులు అండగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ చట్టం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ఆమె సమీక్షా నిర్వహించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. కొడుకులను పిలిపించి తగిన కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యలు పరిష్కరించాలన్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల హుండీల లెక్కింపును రేపు గురువారం ప్రారంభించనునట్లు మేడారం ఈవో రాజేంద్రం తెలిపారు. పూజారులు, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారుల భారీ బందోబస్తు నడుమ మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయం ఆవరణలో హుండీల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
@ పెగడపల్లి మండలంలో బైక్, టాటా ఏస్ డీ.. ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు. @ ముస్తాబాద్ మండలంలో 4 ఇసుక ట్రాక్టర్లు సీజ్. @ రాయికల్ మండలంలో తనిఖీలు నిర్వహించిన జగిత్యాల కలెక్టర్. @ పెండింగ్ పనులను పూర్తి చేయాలన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గా రఘువరన్. @ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్న కరీంనగర్ కలెక్టర్. @ ఢిల్లీ వెళ్ళిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
సింగరేణి గనులను వేలం వేయకుండా సింగరేణి సంస్థకే గనులను ఇవ్వాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే అప్పగించి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో వద్ద బైకు మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు ఢీ కొన్న యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న చిరాగ్ పల్లి గ్రామానికి చెందిన అజ్మత్ షా (24) మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ పోలీసులు తెలిపారు.
✏ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు
✏MBNR: చెంచు ఈశ్వరమ్మను పరామర్శించిన మంత్రి సీతక్క
✏ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ నివారణపై ర్యాలీలు
✏జడ్చర్లలో ఫ్లై ఓవర్‌పై మృతదేహం
✏సివిల్ సర్వీస్‌కు దరఖాస్తుల ఆహ్వానం:BC స్టడీ సర్కిల్
✏GDWL: ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
✏ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి: ఏబీవీపీ
✏నీట్ పరీక్ష ఫలితాలపై విచారణ చేయాలి:NSUI,SFI
చేపలు పట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. బాబాపూర్ గ్రామానికి చెందిన పడాల నాగరాజు(16) బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలోని గోదావరి నదికి చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. మృతుడి తండ్రి పడాల గంగ నరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం పాఠశాలల బంద్ విజయవంతమైనట్లు ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పాఠశాలల బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. బంద్‌లో దామ సునీల్, జగదీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారన్నారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ఎంతో కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులకు మచ్చతెచ్చే పనులు చేయవద్దని సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని.. తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అతిథిగా హాజరై మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.
HYD ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై శ్రీకాంత్ అలియాస్ క్రాంతి(30) లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి బాత్ రూంలో ఉండగా ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కింద కేసు నమోదు చేశారు. నిందితుడు జీహెచ్ఎంసీలో వర్కర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Sorry, no posts matched your criteria.