Telangana

News June 3, 2024

ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

image

వారంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉప్పల్‌లోని మినీ శిల్పారామంలో పేరణి ఆంధ్ర నాట్యం, కూచిపూడి కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ గురువు పవన్, సంధ్య ఆధ్వర్యంలో పేరణి, ఆంధ్ర నాట్య అంశాలను కళాకారులు ప్రదర్శించారు. వినాయక కౌతం, మెలప్రాప్తి, శబ్దపల్లవి, శృంగనర్తనం, కుంభ హారతి, జయజయోస్తు తెలంగాణ, తిల్లాన, మామవతు, శ్రీ సరస్వతి, హారతి అంశాలను కళాకారులు ప్రదర్శించారు.

News June 3, 2024

ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు 

image

వారంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉప్పల్‌లోని మినీ శిల్పారామంలో పేరణి ఆంధ్ర నాట్యం, కూచిపూడి కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ గురువు పవన్, సంధ్య ఆధ్వర్యంలో పేరణి, ఆంధ్ర నాట్య అంశాలను కళాకారులు ప్రదర్శించారు. వినాయక కౌతం, మెలప్రాప్తి, శబ్దపల్లవి, శృంగనర్తనం, కుంభ హారతి, జయజయోస్తు తెలంగాణ, తిల్లాన, మామవతు, శ్రీ సరస్వతి, హారతి అంశాలను కళాకారులు ప్రదర్శించారు.

News June 3, 2024

HYD: పోలీసుల భారీ బందోబస్తు

image

లోక్‌‌సభ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలు మోహరించి చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ కౌంటింగ్ సెంటర్లను 24/7 నిఘా నేత్రాలతో పర్యవేక్షణ చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

News June 3, 2024

HYD: పోలీసుల భారీ బందోబస్తు

image

లోక్‌‌సభ ఎన్నికల ఫలితాలు రేపు వెలువనుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలు మోహరించి చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ కౌంటింగ్ సెంటర్లను 24/7 నిఘా నేత్రాలతో పర్యవేక్షణ చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

News June 3, 2024

పంథిని వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐనవోలు మండలం పంథిని గ్రామంలో రెండు ట్రాక్టర్లను ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 3, 2024

కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో HM మృతి

image

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రోజున విషాదం నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామడుగు మండలం వెలిచాలకు చెందిన సత్తవ్వ VMWD మండలం శాత్రాజ్ పల్లి ZPHSలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ముగించుకొని తిరిగి స్కూటీపై ఇంటికి వెళుతుండగా వెలిచాల క్రాస్ వద్ద HZB డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

News June 3, 2024

MBNR: అభ్యర్థులకు ఎగ్జిట్ పోల్ ఫీవర్..!

image

ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులకు ఎగ్జిట్ పోల్ ఫీవర్ పట్టుకుంది. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్‌లో NGKLలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గెలుస్తారని, MBNRలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుస్తారని పలు సర్వేలు చెప్పాయి. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులకు ఎగ్జిట్ పోల్ టెన్షన్ పట్టుకుంది. MBNR స్థానంలో గెలుపోటములకు 2 శాతం ఓట్ల తేడా ఉన్నట్లు తెలుస్తోంది.

News June 3, 2024

సంగారెడ్డి: డ్రగ్స్ దందా.. భార్యాభర్తలు అరెస్ట్

image

వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి డ్రగ్స్ దందా చేస్తున్న భార్యాభర్తలను HYD పాతబస్తీ పరిధి హుమాయున్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కిలో 100 గ్రా. గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ సైదీశ్వర్ తెలియజేశారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సిరాజ్ ఖాన్, రింకు డోలాయి భార్యాభర్తలు. సిరాజ్ ఖాన్ సంగారెడ్డి జిల్లా ముత్తంగి హోటల్‌లో పనిచేస్తున్నాడు. వీరు మెహదీపట్నంలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు.

News June 3, 2024

NGKL: మ్యారేజ్ డే మరుసటి రోజు గర్భిణి మృతి

image

NGKLలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో 7నెలల <<13363296>>గర్భిణి మృతి<<>> విషయం తెలిసిందే. తాడూరుకు చెందిన పద్మ(35)- మహేందర్‌ దంపతులకు 15ఏళ్ల క్రితం పెళ్లైంది. శనివారం వారి పెండ్లి రోజు కాగా రాత్రి బంధువులతో వేడుకలు జరుపుకొన్నారు. ఆదివారం ఉదయం కడుపులో నొప్పి రావడంతో కుటుంబీకులు ఆమె ప్రతినెల వెళ్లే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యం వికటించి పద్మ మృతిచెందింది. ఆ ఆస్పత్రిని DMHO సుధాకర్‌లాల్‌ తనిఖీ చేసి సీజ్‌ చేశారు.

News June 3, 2024

మిర్యాలగూడ రైల్వే పట్టాలపై మృతదేహం 

image

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు ఇచ్చారు. పోలీసులకు మృతుడికి సంబంధించిన ఎలాంటి సమాచారం లభించలేదు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చరికి తరలించారు.