Telangana

News June 3, 2024

వరంగల్: ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

image

వరంగల్‌ లోక్‌సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రోజుల ఉత్కంఠకు మరో రోజుతో తెర పడనుంది. ఎనుమాముల మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. WGL తూర్పులో 17 రౌండ్లు ఉండడంతో లెక్కింపు ప్రక్రియ మొదట పూర్తి కానుంది. మిగతా 6 నియోజకవర్గాల్లో 18 రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. మొత్తం 124 టేబుళ్లపై.. 127 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు.

News June 3, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ప్రియాంక సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
∆} నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం లోక్‌సభ ఎన్నికలు కౌంటింగ్‌పై కలెక్టర్ గౌతమ్ సమీక్ష
∆} చింతకాని మండలంలో పవర్ కట్
∆} ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలు

News June 3, 2024

MDK: నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ

image

నేటి నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లి మెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో 783 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మెదక్ లోని ప్రభుత్వ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. హాల్ టికెట్లను www.bse.telanganaa.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.

News June 3, 2024

సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర సాకారం.. సోనియాగాంధీకి ఆలయం

image

ఎల్లారెడ్డిపేట మేజర్‌ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచి నేవూరి వెంకట్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాకారానికి సోనియాగాంధీ కారణమని ఆమె ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి చెందడంతో BRSలో చేరారు.దీంతో ఆలయ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆయన హస్తం గూటికి చేరుకుని ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు.

News June 3, 2024

MBNR: టెన్త్ సప్లిమెంటరీ రాయనున్న 5,575 మంది

image

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది 44,898 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. వీరిలో 39,323 పాసయ్యారు. మొత్తం 5,575 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అత్యధికంగా MBNR జిల్లాలో 2,127 మంది అత్యల్పంగా, NRPT జిల్లాలో 526 మంది ఫెయిలయ్యారు. వీరందరూ నేటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు. ఫెయిలైన విద్యార్థులంతా పాసయ్యేలా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు DEO రవీందర్ తెలిపారు.

News June 3, 2024

ఖమ్మంకి 18, మిగతా చోట్ల 14 టేబుల్స్

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్ సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది.  ఖమ్మం నియోజకవర్గానికి 18, మిగతా చోట్ల 14 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయాలని అధికారులు నిర్ణయించింది. మహబూబా బాద్ లోక్‌సభ స్థానం ఓట్లను మహబూబాబాద్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో, ఖమ్మం లోక్‌సభ స్థానం ఓట్లను పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కించనున్నారు.

News June 3, 2024

భీమిని: ఏకంగా 5 పిల్లలకు జన్మనిచ్చిన మేక

image

భీమిని మండలం లోని పెద్దపేట గ్రామంలో ఓ రైతు పెంచుకుంటున్న మేక ఏకంగా 5 పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పటి వరకు 1 లేదా 2 జన్మనిచ్చిన మేకలను చూసుంటాం. కానీ ఇది ఏకంగా 5 పిల్లలను జన్మనివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. 5 మేక పిల్లలకు జన్మ ఇవ్వడంతో చుట్టూ పక్కల ప్రాంతాలవారు మేకలను చూడటానికి క్యూ కట్టారు.

News June 3, 2024

MBNR: 12 మంది MLAలు ఉన్నప్పటికీ ఓటమి..!

image

ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరూ ప్రత్యేక దృష్టిసారించారు. రేవంత్ MBNRలో నిర్వహించిన ఓ సభలో స్థానిక MLC ఉపఎన్నికలో జీవన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 12 మంది MLAలు ఉన్నప్పటికీ పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో నేతలు గప్‌చూప్‌గా ఉన్నారు. పార్టీ ఓటమికి కారణాలు విశ్లేషించుకునే పనిలో పడ్డారు.

News June 3, 2024

భారీ వర్షాలు.. గ్రేటర్ వరంగల్ ALERT

image

రెండు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రేటర్‌ వరంగల్‌ అప్రమత్తమైంది. ఆదివారం రాత్రి కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే డీఆర్‌ఎఫ్, ప్రజారోగ్యం, ఇంజినీరింగ్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. మడికొండ మెట్టుగుట్ట వద్ద చెట్లు కూలడంతో అక్కడికి DRF బృందం వెళ్లాలని ఆదేశించారు. వరంగల్‌ బట్టలబజారు వేంకటేశ్వరస్వామి దేవాలయం ముందు వరద నీరు భారీగా నిలవడంతో పారిశుద్ధ్య కార్మికులు మళ్లించారు.

News June 3, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డి మనవడితో సరదాగా గవర్నర్

image

సీఎం రేవంత్ రెడ్డి మనవడితో గవర్నర్ రాధాకృష్ణన్ కొద్దిసేపు సరదాగా గడిపారు. HYD ట్యాంక్ బండ్ వద్ద రాత్రి జరిగిన తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో స్టేజీపై తన మనవడిని సీఎం గవర్నర్‌కు పరిచయం చేశారు. ఈ సమయంలో గవర్నర్ ఆ చిన్నారికి రెండు నోట్లను ఇచ్చారు. దీంతో ఆ బాలుడు వద్దన్నట్లుగా ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చాడు. అయినా గవర్నర్ మరోసారి ఆ నోట్లను చిన్నారికి ఇస్తూ జేబులో పెట్టడంతో సీఎం నవ్వుతూ చూశారు.