India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ పరంగా 50 శాతం సీట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం NZB జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ కోరారు. ఈ మేరకు TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు సరిపోవన్నారు. జనరల్ స్థానాల్లో 50 శాతం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

వృద్ధులకు మానసిక ఆనందం, సామాజిక అనుబంధం పంచుతూ అవసరమైన సేవలు అందించడం కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తూ నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఒంటరితనంతో బాధపడే వృద్ధులకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వృద్ధులకు నాణ్యతతో కూడిన బలవర్ధకమైన పౌష్ఠిక ఆహారం అందించాల్సిన అవసరం ఉందని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సమన్వయంతో నిజామాబాద్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో ఏర్పాటు చేసిన ‘ప్రణాం వృద్ధుల డే కేర్ సెంటర్’ను ప్రభుత్వ సలహాదారు, బోధన్ MLA సుదర్శన్ రెడ్డి, NZB కలెక్టర్, రెడ్ క్రాస్ అధ్యక్షురాలు ఇలా త్రిపాఠితో కలిసి బుధవారం ప్రారంభించారు. వృద్ధుల జీవన విధానం కల్పించడమే ఈ ప్రణాం డే కేర్ సెంటర్ ప్రధాన లక్ష్యమని సుదర్శన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌కు 150 కిలోమీటర్ల మేర ఉన్న 500లకు పైగా వీకెండ్ స్పాట్స్ ఇప్పుడు మీ కెమెరా కోసం వెయిట్ చేస్తున్నాయి. FTCCI నిర్వహిస్తున్న ఈ మెగా రీల్స్ కాంటెస్ట్ గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. పాత కోటలు, జలపాతాలు, ఫేమస్ దాబాల అందాలను 60 సెకన్ల వీడియోలో బంధించండి. బెస్ట్ రీల్స్‌కు రూ.10,000 వరకు నగదు బహుమతులతో పాటు క్రేజీ గుర్తింపు పొందే ఛాన్స్! తెలంగాణ టూరిజాన్ని మీ స్టైల్‌లో వైరల్ చేయండి.

HYD నగరం రంగులు, తాళాలు, సంప్రదాయాలు, ఐక్యతతో కూడిన ఓ అద్భుతమైన వేడుకకు సాక్ష్యం కానుంది. గిగ్గిల్‌మగ్ ఈవెంట్స్ (GiggleMug Events) సమర్పణలో, ఎత్నిక్ ఫెస్ట్ 2026ను జనవరి 31న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గచ్చిబౌలి స్టేడియంలో వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతిదాంట్లోనూ మన సంస్కృతి ఉట్టిపడేలా ఈ ప్రోగ్రాం సాగనుంది. భారతదేశపు సుసంపన్నమైన వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ ఉత్సవాన్ని రూపొందించారు.

దేశ చరిత్రలో షాద్‌నగర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 1959 అక్టోబర్ 14న అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఇక్కడే దేశంలోనే మొదటి ‘బ్లాక్ డెవలప్‌మెంట్ సెంటర్’ (పంచాయతీ రాజ్)ను ప్రారంభించారు. నాటి సర్పంచ్ అప్పారెడ్డి హయాంలో జరిగిన ఈ పరిణామం భారతదేశ గ్రామ స్వరాజ్య చరిత్రలో షాద్‌నగర్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించింది.

TGలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం 1380 సీట్లను భర్తీ చేయనున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 29న నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. అర్హులైన విద్యార్థులు https://tsemrs.telangana.gov.in ద్వారా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. SHARE IT.

వరుస హత్యలతో HYD హడలెత్తుతోంది. అక్రమ సంబంధాలు, గంజాయి మత్తు మానవత్వాన్ని దహించేస్తోంది. మంగళవారం జరిగిన 3 హత్యలు నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. జవహర్ నగర్‌లో గంజాయి మత్తులో కన్నతల్లినే కొడుకు కిరాతకంగా హతమార్చాడు. కూకట్‌పల్లిలో జల్సాలకు అడ్డొస్తున్నాడని భర్తను ఉరేసి ఉసురు తీసింది కసాయి భార్య. బోరబండలో భార్యపై అనుమానంతో రోకలి బండతో కొట్టి చంపాడో <<18912212>>దుర్మార్గపు భర్త.<<>> నేరచీకట్లలో నగరం కమ్ముకుపోతోంది.

NZB మున్సిపాలిటీ 1931 సంవత్సరంలో ఏర్పడింది. 1987లో దీన్ని ‘స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ’గా అప్‌గ్రేడ్ చేశారు. 2005 మార్చి 5న ప్రభుత్వం జారీ చేసిన GO No.109 ప్రకారం నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్‌గా మారింది. ప్రస్తుతం ఇది నిజామాబాద్ నగరపాలక సంస్థ పేరుతో 60 వార్డులతో పరిపాలన కొనసాగిస్తోంది.

దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో తొలిసారిగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 21, 22, 23, 24, 28వ తేదీల్లో రెండు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని నిబంధన విధించడంతో అభ్యర్థులు ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. అధికారులు తనిఖీలు చేసి విద్యార్థులను లోపలికి అనుమతించారు.
Sorry, no posts matched your criteria.