Telangana

News June 3, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డి మనవడితో సరదాగా గవర్నర్

image

సీఎం రేవంత్ రెడ్డి మనవడితో గవర్నర్ రాధాకృష్ణన్ కొద్దిసేపు సరదాగా గడిపారు. HYD ట్యాంక్ బండ్ వద్ద రాత్రి జరిగిన తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో స్టేజీపై తన మనవడిని సీఎం గవర్నర్‌కు పరిచయం చేశారు. ఈ సమయంలో గవర్నర్ ఆ చిన్నారికి రెండు నోట్లను ఇచ్చారు. దీంతో ఆ బాలుడు వద్దన్నట్లుగా ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చాడు. అయినా గవర్నర్ మరోసారి ఆ నోట్లను చిన్నారికి ఇస్తూ జేబులో పెట్టడంతో సీఎం నవ్వుతూ చూశారు.

News June 3, 2024

మెదక్ పార్లమెంట్: 103 టేబుళ్లు.. 147 రౌండ్లు

image

మెదక్ లోక్‌సభలో 103 టేబుళ్లపై ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్క తేలనుంది. మెదక్, సిద్దిపేట సెగ్మెంట్లు 14 టేబుల్స్ -20 రౌండ్లు, నర్సాపూర్ 14 టేబుల్స్ -22 రౌండ్లు, దుబ్బాక 14 టేబుల్స్- 19 రౌండ్లు, గజ్వేల్ 15 టేబుల్స్- 22 రౌండ్లు, పటాన్‌చెరు 18 టేబుల్స్- 23 రౌండ్లు, సంగారెడ్డి 14 టేబుల్స్- 21 రౌండ్లు, పోస్టల్ బ్యాలెట్ 18 టేబుల్స్- 2 రౌండ్లలో లెక్కిస్తారు. 650మందితో పోలీస్ బందోబస్తు చేస్తున్నారు.

News June 3, 2024

మరోసారి మోదీనే పీఎం: డీకే అరుణ

image

మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పాల్గొన్నారు. ఎగ్జిట్ పోల్ ప్రకారం మహబూబ్ నగర్ బీజేపీ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడ చూసినా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయని, మళ్లీ మోదీనే పీఎం కానున్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

News June 3, 2024

MBNR: 7 నుంచి ప్రయోగ తరగతులు.. కేంద్రాలు ఇవే!

image

BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ మొదటి సంవత్సరం సైన్స్ చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్-1 ప్రయోగ తరగతులు(ప్రాక్టికల్ క్లాసెస్) ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ డిగ్రీ కళాశాల, NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, కల్వకుర్తి, నారాయణపేట, కొండనాగుల, జడ్చర్ల, షాద్నగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల స్టడీ సెంటర్లలో ఏర్పాటు చేశారు.

News June 3, 2024

మెదక్: సిబ్బందికి 2వ రాండమైజేషన్ పూర్తి

image

లోక్ సభ ఓట్ల లెక్కింపు సిబ్బంది రెండవ రాండమైజేషన్ కలెక్టర్ ఛాంబర్లో పూర్తి చేశారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు, కౌంటింగ్ అబ్జర్వర్ల సమక్షంలో కలెక్టర్ రాహుల్ రాజ్ 7 నియోజక వర్గాల కౌంటింగ్ సిబ్బంది, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సిబ్బందిని, కౌంటింగ్ సూపర్ వైజర్స్, మైక్రో అబ్జర్వర్స్ సిబ్బందిని కేటాయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమాదేవి ఉన్నారు.

News June 3, 2024

HYD: మీ ప్రాంతంలో రోడ్లు బాగున్నాయా? 

image

HYD, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు పాడై ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ప్రధాన మార్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అధికారులకు చెప్పినా తాత్కాలిక మరమ్మతులతో సరి పెడుతున్నారని, దీంతో అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో రోడ్లు బాగున్నాయా కామెంట్ చేయండి.
SHARE IT 

News June 3, 2024

HYD: మీ ప్రాంతంలో రోడ్లు బాగున్నాయా?

image

HYD, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు పాడై ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ప్రధాన మార్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అధికారులకు చెప్పినా తాత్కాలిక మరమ్మతులతో సరి పెడుతున్నారని, దీంతో అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో రోడ్లు బాగున్నాయా కామెంట్ చేయండి.
SHARE IT

News June 3, 2024

ఓట్ల లెక్కింపునకు సంసిద్ధం కావాలి : కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వెంటనే పూర్తి చేసి ఓట్ల లెక్కింపుకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. జిల్లా ఎస్పీ చందనా దీప్తితో కలిసి ఆదివారం ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు పై జిల్లా అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులతో కో-ఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు.

News June 3, 2024

కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు: సీపీ

image

లోకసభ ఎన్నికల లెక్కింపు జూన్ 4న జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుచేస్తూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు 4న ఉదయం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఐదుగురికి మించి గుమికూడరాదని తెలిపారు.

News June 3, 2024

కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

image

ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను అధికారులు పరీశీలించారు. జిల్లా కలెక్టర్ గౌతమ్, పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే, కౌంటింగ్ పరిశీలకులు ప్రేదిమాన్ కృషన్ భట్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి కేంద్రాన్ని తనీఖీ చేశారు. కౌంటింగ్ రోజున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.