Telangana

News June 2, 2024

ADB: బడి బాట వాయిదా

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ 3 నుంచి నిర్వహించాల్సిన బడి బాట వాయిదా పడింది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గమనించగలరని కోరారు.

News June 2, 2024

అందేశ్రీ గీతానికి ఇందూరే స్ఫూర్తి

image

తెలంగాణ రాష్ట్రీయ గీతం రచయిత అందెశ్రీకి ఇందూరుతో అభినవభావ సంబంధం ఉంది. 1978లో బతుకుదెరువు కోసం ఆర్మూర్ పరిధిలో తాపీ పని చేస్తున్న అందె ఎల్లయ్య.. మానిక్‌బండార్‌ పరిధిలో ఆశ్రమం నడుపుతున్న శంకర్‌మహరాజ్‌ దృష్టిలో పడ్డారు. నీ పని ఇదికాదురా.. అందరిని చైతన్యం చేసే అక్షరాన్ని ఆయుధంగా సంధించాలని జ్ఞానభిక్ష పెట్టి అందెశ్రీగా నామకరణం చేశారు. చదువు లేకున్నా.. ఏకసంతాగ్రాహిగా, పాటల రచన, గానం చేశారు అందెశ్రీ.

News June 2, 2024

HYD: ప్రొ.జయశంకర్ ఆ జన్మ తెలంగాణ వాది: KCR

image

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆ జన్మ తెలంగాణ వాది అని.. ఈ సమయంలో ఆయన్ను స్మరించుకోకుండా ఉండలేమని BRS అధినేత కేసీఆర్‌ అన్నారు. HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. అప్పట్లో చాలా మంది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. గతంలో తెలంగాణ అనే పదాన్నే పలకవద్దని అప్పటి స్పీకర్‌ అసెంబ్లీలో అన్నారని చెప్పారు.

HYD: ట్యాంక్‌బండ్‌పై ఘనంగా ‘పదేళ్ల పండుగ’ సంబురాలు

image

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కళాకారులు తరలివచ్చారు.

ఆసిఫాబాద్: భారీ వర్షం.. కొట్టుకుపోయిన తాత్కలిక వంతెన

image

ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామం వాగుపై రాకపోకలు కొనసాగించేందుకు గుండి గ్రామస్థులు తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు .గుండి తాత్కాలిక వంతెన ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీనితో గుండి గ్రామస్తులకు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా ఆసిఫాబాద్ జిల్లా అధికారులు స్పందించి వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరారు.

News June 2, 2024

దామరగిద్ద: బావిలో పడి యువకుడి మృతి

image

నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దామరగిద్ద మండలం కానుకుర్తి నిరంజన్ స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన బాబమ్మ, సామలప్ప దంపతుల రెండో కుమారుడు నిరంజన్(చింటు) మధ్యాహ్నం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని ఓ బావిలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో అందులో మునిగి నిరంజన్ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News June 2, 2024

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో సైబరాబాద్ సీపీ

image

కొండాపూర్‌ పరిధిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీ అవినాశ్ మహంతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. 2014 జూన్ 2న అధికారికంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీసు శాఖ సిబ్బంది మనస్ఫూర్తిగా కర్తవ్య నిర్వహణ చేయాలని కోరారు.