Telangana

News June 2, 2024

స్థానికులు దర్శించుకోవడానికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు

image

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని స్థానికులు దర్శించుకోవడానికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ప్రతి మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల 30 నిమిషాల వరకు స్థానికులు ఆధార్ కార్డుతో వచ్చినవారికి దర్శనం ఏర్పాటు కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు

News June 2, 2024

కేసీఆర్‌‌కు శుభాకంక్షలు తెలిపిన మాజీ మంత్రులు

image

రాష్ట్ర అవతరణ దినోత్సవం సంధర్బంగా ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జిల్లా మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్చం అందజేసి శుభాకంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది.

News June 2, 2024

సంగారెడ్డి: చికిత్స పొందుతూ విద్యార్థి మృతి

image

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గుర్రపు శ్రీనివాస్ కుమారుడు బద్రీనాథ్(17) హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తి చేసి నీట్ పరీక్షలు రాశాడు. వారం కిందట అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతోపాటు గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News June 2, 2024

తిరుమలాయపాలెం: ప్రసాదం ఇచ్చేందుకు వెళుతూ మృతి

image

తిరుపతి ప్రసాదం ఇచ్చేందుకు బంధువుల ఇంటికి వెళుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం తిరుమలాయపాలెంలో జరిగింది. ఖమ్మం నగరంలోని మామిళ్ళగూడెంకి చెందిన సోమేశ్వరరావు ఇటీవల తిరుపతి వెళ్లి వచ్చాడు. మరిపెడ మండలం ఎల్లంపేటలో బంధువులకు ప్రసాదం ఇచ్చేందుకు వెళ్తుతుండగా తిరుమలాయపాలెంలో వద్ద బైక్ ఢీకొట్టింది. దీంతో సోమేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు.

News June 2, 2024

బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగలరు: మంత్రి జూపల్లి

image

జూన్ 4 తరువాత బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగలరని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడంపై ఆయన స్పందించారు. అయినా తమ అభ్యర్థి ఓడింది కేవలం 111 ఓట్లతోనే అని అన్నారు. స్థానిక సంస్థల్లో గతంలో 300 ఓట్లున్న కాంగ్రెస్ బలం 652 ఓట్లకు పెరిగిందని ధీమా వ్యక్తం చేశారు.

News June 2, 2024

KCRను కలిసిన నవీన్ రెడ్డి, జిల్లా నేతలు

image

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ రెడ్డి దంపతులు, ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. BRS అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ నవీన్ రెడ్డిని అభినందిస్తూ పూలబోకే అందజేశారు. నవీన్ రెడ్డి గెలుపుకు కృషి చేసిన ఉమ్మడి జిల్లా నేతలను కేసీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

News June 2, 2024

వాంకిడిలో పిడుగు.. అపస్మారక స్థితిలోకి మహిళ

image

వాంకిడి మండలం ఇందాని గ్రామంలో పిడుగుపాటు శబ్దానికి గ్రామానికి విక్రుబాయి ఆదివారం సాయంత్రం తన ఇంటి బయట నిలబడింది. ఆ సమయంలో పెద్ద శబ్దాలతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు ఇంటి పక్కనే పడింది. పిడుగు శబ్దానికి ఆమె భయపడి అక్కడే కింద పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఇంకా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 2, 2024

MBNR: ‘ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి’

image

బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అధ్యక్షతన ఏడు నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులు, ఎలక్షన్ ఏజెంట్లతో ఆదివారం కన్వెన్షన్ హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంగళవారం నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండి చివరి ఓటు లెక్కించే వరకు కౌంటింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

News June 2, 2024

రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి జూపల్లి

image

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పూలమాలలతో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన యంత్రాంగం, అధికారులు, తదితరులు ఉన్నారు.

News June 2, 2024

గ్రేటర్ HYDలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

image

గ్రేటర్ HYDలోని ప్రతి బస్ డిపోలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ పనులను ప్రారంభించింది. కంటోన్మెంట్, మియాపూర్-1 డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, గ్రేటర్‌లోని మరో 23 బస్ డిపోల్లోనూ జులై చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే 62 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా మరో 20 జూన్ చివరి నాటికి అందుబాటులో రానున్నాయి.